
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా అని, ఆయన కుటుంబసభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ చార్ చోర్ (నలుగురు దొంగలు) అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకుండా పోయా యన్నారు. తెలంగాణలో ఇలాంటి నిరం కుశ, అరాచక పోకడలు ఉంటాయని ఊహించలేదన్నారు. రాజ్యసభ సీటు కూడా సంతోష్‌కిస్తారా, అమరవీరుల కుటుంబాలకు ఎందుకివ్వరని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ బస్సు యాత్రతో మంత్రి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీపై కేసీఆర్ వ్యాఖ్య లు బాధించాయంటున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా సీఎంతోనే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తిడితే కేటీఆర్‌తో ఆమె వివరణ తీసుకోవడం హాస్యాస్పదమన్నారు.