Four thieves
-
సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఓ అలీ బాబా అని, ఆయన కుటుంబసభ్యులు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత, సంతోష్ చార్ చోర్ (నలుగురు దొంగలు) అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేకుండా పోయా యన్నారు. తెలంగాణలో ఇలాంటి నిరం కుశ, అరాచక పోకడలు ఉంటాయని ఊహించలేదన్నారు. రాజ్యసభ సీటు కూడా సంతోష్కిస్తారా, అమరవీరుల కుటుంబాలకు ఎందుకివ్వరని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ బస్సు యాత్రతో మంత్రి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీపై కేసీఆర్ వ్యాఖ్య లు బాధించాయంటున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా సీఎంతోనే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేసీఆర్ తిడితే కేటీఆర్‌తో ఆమె వివరణ తీసుకోవడం హాస్యాస్పదమన్నారు. -
దొంగల ముఠా అరెస్ట్
చంద్రాయణగుట్ట (హైదరాబాద్) : వరుస దొంగతనాలతో నగర వాసులను బెంబేలెత్తిస్తున్న నలుగురు దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రాయణగుట్ట, భవానీ నగర్ పరిధిలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను సౌత్‌జోన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 22 తులాల బంగారు ఆభరణాలు, ఒక ఎల్ఈడీ టీవీ, 3 కెమరాలు, ఒక లాప్టాప్, ఒక మైక్రోఓవెన్ స్వాధీనం చేసుకున్నారు. -
నలుగురు దొంగల్ని అరెస్ట్ చేసిన అనంత పోలీసులు
అనంతపురం: పలుదొంగతనాల కేసులో నిందితులుగా ఉన్న నలుగుర్ని గురువారం అనంతపురం రెండో పట్టణ పోలీసులు బళ్లారి రోడ్డు వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి 4 తులాల బంగారం, 8 మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిసింది. నిందితులు పెద్దన్న , దివాకర్, మహేశ్‌లను నాగముణీంద్రలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
తుపాకులతో బెదిరించి దోపిడీ చేసే నలుగురి అరెస్ట్
కర్నూలు: పర్యాటకులను తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, ఒక రివాల్వర్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ నలుగురు నల్లకాలువ స్మృతివనం సమీపంలో పర్యాటకులను తుపాకులతో బెదిరించి దోపీడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు చెప్పారు.