
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్(79)పై అల్లరిమూక దాడిచేసిన ఘటనపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శలు గుప్పించారు. మోదీ తీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘నేను దేశంలో శక్తిమంతమైన కార్పొరేట్లకు తలవంచుతాను. బలం, అధికారమే నాకు ముఖ్యం. నేను ప్రజల్లో భయం, విద్వేషం వ్యాప్తిచేసి అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తా. బలహీనుల్ని తొక్కిపడేస్తా. నాకు ఎంతమేరకు ఉపయోగపడతారన్న దాన్ని బట్టే చుట్టూ ఉన్నవారిని గౌరవిస్తా. నేనెవర్ని?’ అని రాహుల్ ట్వీట్ చేశారు. స్వామి అగ్నివేశ్‌పై అల్లరిమూక దాడి వీడియో క్లిప్‌ను ఈ ట్వీట్‌కు జతచేశారు. జార్ఖండ్‌లోని పకుర్‌లో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ అల్లరిమూక అగ్నివేశ్‌పై మంగళవారం దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. బీజేపీ అనుబంధ బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలే తనపై దాడిచేశారని అగ్నివేశ్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment