ట్రంప్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ | Donald Trump Fire Incident: PM Narendra Modi Condemn Attack, Says Violence Has No Place In Politics, Tweet Inside | Sakshi
Sakshi News home page

Trump Fire Incident: ట్రంప్‌పై దాడిని ఖండించిన ప్రధాని మోదీ

Published Sun, Jul 14 2024 9:02 AM | Last Updated on Sun, Jul 14 2024 11:17 AM

PM Narendra Modi Condemn

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగింది. ఈ దాడి నుంచి  ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ వార్త తెలిసిన ప్రపంచ నేతలంతా ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్రంప్‌పై దాడికి స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ప్రధాని మోదీ ఈ దాడిని ఖండించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పోస్టులో ‘నా స్నేహితుడు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడి విషయమై చాలా ఆందోళన చెందుతున్నాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement