Swami Agnivesh
-
అగ్నివేశ్‌కు ప్రముఖుల నివాళి
న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత స్వామి అగ్నివేశ్ మృతి పట్ల పలువురు సామాజిక వేత్తలు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. వెట్టి కార్మికులు, స్త్రీల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన నిజమైన సెక్యులర్ నేతగా ఆయనను కొనియాడారు. అగ్నివేశ్ భౌతికకాయానికి శనివారం ఆర్యసమాజ్ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. సమాజంలో అల్పసంఖ్యాకుల తరఫున ఆయన జీవితాంతం పోరాడారని, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల పక్షాన ఆయన తన గొంతు వినిపించారని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ నివాళులు అర్పించారు. దేశంలో మతసామరస్యం నెలకొల్పేందుకు ఆయన కృషి మరువలేనిదని మాజీ ప్రధాని మన్మోహన్ కొనియాడారు. వామపక్ష పోరాటాలకు ఆయన గొప్ప స్నేహితుడని, పైకి కాషాయం ధరించినా లోపల నిజమైన సెక్యులర్ అని సీపీఐ లీడర్ డి రాజా ప్రశంసించారు. డీఎంకే నేత స్టాలిన్, పీఎంకే నేత రామ్‌దాస్ సైతం అగ్నివేశ్ మృతి పట్ల సంతాపం తెలిపారు. తన సిద్ధాంతాలతో విభేదించేవారు ఆయనపై అనేకమార్లు దాడులకు దిగినా, నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డారని లాయర్ మహమూద్ ప్రాచా ప్రశంసించారు. -
సోషలిస్టు విశ్వాసం రగిలించిన ‘అగ్నిశిఖ’
శరణార్థులకోసం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ ఆఫీసులో నేను పనిచేస్తున్నప్పుడు మొదటిసారిగా స్వామి అగ్నివేశ్‌ను చూశాను. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ వద్ద బానిసత్వంకి సంబంధించిన సమకాలీన ఫోరమ్‌లపై కార్యాచరణ బృందం ముందు సాక్ష్యం చెప్పడానికి ఆయన వచ్చినప్పుడు నేను చూశాను. ఆనాడు అగ్నివేశ్ కలిగించిన ప్రభావం మరపురానిది. జెనీవాలో ఆనాడు ఆయన పేల్చిన మాటలను ఎవరమూ మర్చిపోలేం. శుక్రవారం 80 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన స్వామి అగ్నివేశ్ ఈ దేశంలో చాలామందికి అర్థం కాని ఒక నిగూఢ రహస్యమే. 1939 సెప్టెంబర్ 21న ఆయన జన్మించారు. తల్లిదండ్రులను కోల్పోయి, ఒక సంస్థానంలో దివాన్‌గా పనిచేస్తున్న తన తాతగారి వద్ద పెరిగిన ఈ బ్రాహ్మణుడు తదనంతర కాలంలో అణగారిన ప్రజలతో తన్నుతాను మమే కం చేసుకున్నాడు. 30 ఏళ్ల ప్రాయంలోనే సన్యాసాన్ని పుచ్చుకున్న అగ్నివేశ్ స్వయంప్రకటిత హిందుత్వ ప్రచారకుల దాడికి నిత్యం గురవుతూ వచ్చాడు. 30 ఏళ్ల ప్రాయంలోనే ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా పనిచేసిన అగ్నివేశ్ తర్వాత రాజ కీయ పదవులకు దూరంగా ఉండిపోయారు. ఆర్యసమాజ్ అత్యున్నత అంతర్జాతీయ సంస్థ అయిన వరల్డ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా దశాబ్దంపాటు పనిచేశారు. తరువాత ఆ సంస్థలోని కీలక నియమాలనుంచి వేరుపడి 30 ఏళ్ల వయస్సులోనే తన సొంత ఆర్యసభను నెలకొల్పారు. భారతీయ సమాజ సమస్యలు, దానికి కారణాలపై అత్యంత ఆసక్తితో నిబ ద్ధంగా పనిచేసిన ఈ భారతీయ విశిష్టమూర్తి అంతర్జాతీయ ప్రాచుర్యం పొందడమే కాకుండా 1994 నుంచి 2004 వరకు బానిసత్వ వర్తమాన వేదికలపై ఐక్యరాజ్యసమితి వాలంటరీ ట్రస్ట్ ఫండ్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి ఛత్తీస్‌గఢ్‌లో పెరిగిన ఈ భారతీయుడు హరి యాణాలో పోటీ చేసి ఎన్నికయ్యారు, ఆయన ప్రధానంగా సామాజిక కార్యకర్త. 1981లో తాను స్థాపిం చిన వెట్టిచాకిరీ విమోచన ఫ్రంట్ ద్వారా వెట్టిచాకిరీకి వ్యతి రేకంగా గొప్ప కృషి సాగించారు. నిర్విరామ ప్రచారకర్త 80 సంవత్సరాల క్రితం వేప శ్యామ్‌రావుగా జీవితం ప్రారంభించిన అగ్నివేశ్.. భారతీయ సామాజిక జీవితంలో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులలో ఒకరు. 1980ల నుంచి సాంప్రదాయిక ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. కానీ ఏది సరైనది అని నమ్ముతూ వచ్చారో దానిని నిర్విరామంగా ప్రచారం చేస్తూ వచ్చారు. న్యాయశాస్త్రం, వాణిజ్య శాస్త్రంలో డిగ్రీలు సాధిం చిన అగ్నివేశ్, భారత భవిష్యత్ ప్రధాన న్యాయమూర్తి వద్ద గతంలో జూనియర్ లాయర్‌గా ప్రాక్టీసు కూడా చేశారు. జీవితపర్యంతం అన్యాయ చట్టాలను సవాలు చేస్తూ వాటిని మార్చేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. వెట్టిచాకిరీ నిషేధ చట్టంలాగా కొన్ని సార్లు గొప్ప విజయం సాధించారు కూడా. సతీ నిరోధక చట్టం–1987 రూపకల్పనలో ఆధ్యాత్మిక మద్దతుదారుగా వ్యవహరించారు. అగ్నివేశ్ తన సోషలిస్టు విశ్వాసాల కోసం హిందూయిజాన్ని వరించారు. తన పంథాను ఆయన వైదిక సామ్యవాదం లేదా వేదిక్ సోషలిజం అని పిలిచేవారు. ఆయన కార్యాచరణే ఆయన్ని వీధుల్లోకి తీసుకొచ్చింది. భ్రూణహత్యల నుంచి బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక అంశాలపై ఆయన నిర్విరామంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన ఎన్నోసార్లు భౌతిక దాడులనుంచి తప్పించుకున్నారు. అఖిల భారతీయ హిందూ మహారాష్ట్ర ఆయన తలకు 20 లక్షల రూపాయల మేరకు వెలకట్టింది. ఇక జార్ఖండ్‌లో త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన కార్యాచరణ అనేక సార్లు తనను జైళ్లలోకి నెట్టింది. విద్రోహం, హత్యారోపణల పాలై దాదాపు 14 నెలలపాటు ఆయన జైళ్లలో గడిపారు. 2011 ఫిబ్రవరిలో మావోయిస్టులు అపహరించిన అయిదుగురు పోలీసులను ఆయన చర్చల ద్వారా విడిపించారు. మతోన్మాదం, మూఢవిశ్వాసాల విమర్శకుడు ఇటీవలి కాలంలో ఆయన మతపర సహనం, విశ్వాసాల మధ్య సామరస్యతపై గళం విప్పారు. అనేక అంతర్జాతీయ వేదికలపై ముస్లిం కమ్యూనిటీపై సానుభూతి చూపాలని, ఇస్లాంను అర్థం చేసుకోవాలని అనేక చర్చల్లో వాదిస్తూవచ్చారు. కొద్దిమంది వ్యక్తులు చేసే తప్పుపనులకు మొత్తం కమ్యూనిటీనే దోషిని చేయడం చాలా తప్పు అని బహిరంగ సభల్లోనే వాదించేవారు. అయితే, కొన్నిసార్లు తాను నమ్ముతున్న సిద్ధాంతాలను తీవ్రమైన భాషతో ఆయన వ్యక్తీకరించినప్పుడు మధ్యేవాదులమైన నాలాంటి వాళ్లకు మద్దతివ్వడం కష్టంగా ఉండేది. ఐక్యరాజ్యసమితి నంబర్‌వన్ ఉగ్రవాది అని ఆయన వర్ణించడం నాకు సులభంగా జీర్ణమయ్యేది కాదు. కానీ తన విశ్వాసాలు, భావాల విషయంలో మధ్యేమార్గంతో వ్యవహరించడం అగ్నివేశ్‌కు సాధ్యమయ్యే వనికాదు. జీవితాంతం ఆయన తన భావాలతో రాజీపడకుండానే గడిపారు. మత దురభిమానం, మత పక్షపాతంపై తీవ్ర విమర్శ చేసే అగ్నివేశ్ కొన్ని హిందూ బృందాల ఆగ్రహానికి గురయ్యేవారు. పూరీ జగన్నాథ్ ఆలయాన్ని హిందూయేతరులకు కూడా తెరవాలని సూచించడం, లక్షలాది శివభక్తులు పూజించే అమర్నాథ్ శివలింగంపై చేసిన వ్యాఖ్యలు వీటిలో కొన్ని. చివరకు అమర్నాథ్ శివలింగంపై ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే పదాలను వాడేముందు వెనుకాముందూ ఆలోచించుకోవాలని హితవు చెప్పాల్సి వచ్చింది. అనేకమంది ఆదర్శవాదుల్లాగే స్వామి అగ్నివేశ్ కొన్ని సార్లు తాను వ్యక్తీకరించిన భావాల తీవ్రత పరంగా చిక్కుల్లో పడ్డారు. కానీ అయన ఎప్పటికీ స్వామి అగ్నివేశ్‌లాగే ఉండేవారు. తన స్వప్నాలను సాకారం చేసుకునేందుకు తన జీవితాన్ని, సమయాన్ని, శక్తిని ఒకే మార్గంలో సిద్ధం చేసుకుంటూ వచ్చారు. దశాబ్దాలుగా తన విశ్వాసాలకు గాను తింటూ వచ్చిన దెబ్బలన్నీ ఆయన నిజాయితీకి, సాహసప్రవృత్తికి గీటురాళ్లుగా నిలిచాయి. మానవ చైతన్యాన్ని నిశ్చింతగా, నిర్భీతిగా కలవరపర్చిన ఈ దీపశిఖను నేను కోల్పోయాను. ఓం శాంతి. (ది క్వింట్ సౌజన్యంతో) వ్యాసకర్త : శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ, మాజీ దౌత్యవేత్త -
‘స్వామి అగ్నివేశ్ మేక వన్నె పులి’
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతూ.. నివాళులర్పిస్తున్నారు. అయితే రిటైర్డ్ పోలీసు అధికారి ఒకరు ఇంటర్నెట్ వేదికగా స్వామి అగ్నివేశ్‌ని ఉద్దేశిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాషాయ వస్త్రాలలోని హిందూ వ్యతిరేకి అని.. ఆయన మరణాన్ని మంచి పనిగా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం. నాగేశ్వరావు.. స్వామి అగ్నివేశ్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘స్వామి అగ్నివేశ్ మీరు కాషాయ వస్రాలు ధరించిన హిందూ వ్యతిరేకి. మీరు హిందూ మతానికి అపారమైన నష్టం చేశారు. మీరు తెలుగు బ్రాహ్మణుడిగా జన్మించినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మీరు మేక వన్నె పులి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు ఎందుకు ఇంత సమయం తీసుకున్నాడా అని నేను ఆవేదన చెందుతున్నాను’ అంటూ ట్వీట్ చేశారు నాగేశ్వర రావు. (చదవండి: దేవుళ్ల రథాలపై మరింత నిఘా..) GOOD RIDDANCE @swamiagnivesh You were an Anti-Hindu donning saffron clothes. You did enormous damage to Hinduism. I am ashamed that you were born as a Telugu Brahmin. మేక వన్నె పులి गोमुख व्याग्रं Lion in sheep clothes My grievance against Yamaraj is why did he wait this long! https://t.co/5g7oKL62pO — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) September 11, 2020 ఈ వ్యాఖ్యల పట్ల నెటిజనులతో పాటు డిపార్ట్మెంట్కు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమే కాక మానవ జీవితానికి సిగ్గు చేటు అన్నారు. ఇక పోలీస్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ‘రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఓ వ్యక్తి ఇటువంటి ద్వేషపూరిత సందేశాలను ట్వీట్ చేస్తూ.. అతను ధరించిన పోలీసు యూనిఫామ్‌ను అపవిత్రం చేశాడు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అతను దేశంలోని మొత్తం పోలీసు బలగాలను, ముఖ్యంగా యువ అధికారులను నిరుత్సాహపరిచాడు’ అంటూ ట్వీట్ చేసింది. GOOD RIDDANCE @swamiagnivesh You were an Anti-Hindu donning saffron clothes. You did enormous damage to Hinduism. I am ashamed that you were born as a Telugu Brahmin. మేక వన్నె పులి गोमुख व्याग्रं Lion in sheep clothes My grievance against Yamaraj is why did he wait this long! https://t.co/5g7oKL62pO — M. Nageswara Rao IPS (@MNageswarRaoIPS) September 11, 2020 -
స్వామి అగ్నివేశ్ మృతికి ఏపీ సీఎం సంతాపం
సాక్షి, అమరావతి: ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) మృతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సాంఘిక దురాచారాలకు, వెట్టి చాకిరి నిర్మూలనకు స్వామి అగ్నివేశ్ గారు ఎంతో పోరాటం చేశారని తెలిపారు. అగ్నివేశ్ గారు చేసిన సామాజిక సేవల వల్ల సమాజంలో చాలా మంది స్పూర్తి పోందారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. స్వామి అగ్నివేశ్ కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో మంగళవారం నుంచి చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మరణించారని వైద్యులు తెలిపారు. అగ్నివేశ్ 1939, సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. -
స్వామి అగ్నివేశ్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) తుదిశ్వాస విడిచారు. కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో మంగళవారం నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మరణించారని వైద్యులు తెలిపారు. అగ్నివేశ్ 1939, సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్ కాలేజ్ నుంచి లా, కామర్స్ డిగ్రీ పొందారు. స్వామి అగ్నివేశ్ గతంలో ఆర్యసభ పేరిట రాజకీయ పార్టీని స్ధాపించి హరియాణా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆర్యసమాజ్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన ఆర్యసభ పార్టీని నడిపారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులతో జరిగిన చర్చలకు ఆయన మధ్యవర్తిత్వం వహించారు. భిన్న మతాల మధ్య పలు అంశాలపై ఆయన వారధిగా పనిచేశారు. అగ్నివేశ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
అర్బన్ నక్సల్స్ అసలు లక్ష్యం!
కొంత కాలం క్రితం బెంగళూరు నగరంలో జరిగిన నిరసన ప్రదర్శనలో బహిరంగంగా సినీ నటుడు రచయిత కవి గిరీష్ కర్నాడ్, స్వామి అగ్నివేశ్ మరికొందరు మేమూ అర్బన్ నక్సల్స్ అంటూ మెడలో ప్లే కార్డులు ధరిం చారు. ‘అర్బన్ నక్సల్స్’, ‘హాఫ్ మావోయిస్ట్స్’ అనే పదాలు నేడు దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. నగర ప్రాంతాలలో స్థావరాల గురించి ఒకటిన్నర దశాబ్దం క్రితం మావోయిస్టులు కన్న కల ఇప్పుడు ఫలిస్తున్నది. ఉగ్రవాద ధోరణులకు జనామోదం సమకూర్చడమే అర్బన్ నక్సల్స్ ప్రథమ కర్తవ్యం. వీరి అర్బన్ పర్స్పెక్టివ్ పత్రం ప్రకారం పట్టణాలలో, నగరాలలో అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలి. కార్యకర్తలను సేకరించడంతో పాటు, నాయకత్వాన్ని అభివృద్ది చేసే పని జరగాలి. సెక్యులర్ శక్తులను, పీడనకు గురి అవుతున్న అల్పసంఖ్యాక వర్గాలను హిందూ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఏకం చేయాలి. 2004లో నాటి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటి నుంచి నగరాలు, పట్టణాలపై దృష్టి కేంద్రీకరించడం కోసం నక్సల్స్ అధినాయకత్వం శ్రమిస్తూనే ఉంది. పథకం ప్రకారం ఎంపిక చేసిన తమ నాయకులను కొందరిని జనజీవన స్రవంతిలో కలిపి దేశవ్యాప్తంగా తమ పోరాట పంథాను మార్చి భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో వివిధ ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహిస్తూ భారత ప్రభుత్వంపై తమ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. సంఘ పరివార సంస్థలపై అక్కసును వెళ్లగక్కడం అర్బన్ నక్సల్స్ వ్యూహం. రచయితలను, మేధావులను విద్యార్థులను ‘బ్రెయిన్ వాష్’ చేసి అడవులకు పంపే ప్రయత్నంలో అర్బన్ నక్సల్స్ సఫలీకృతం అవుతున్నారా అనిపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఒకప్పటి రాడికల్ విద్యార్థి సంఘం పాత్రను అధ్యాపకులు, మేధావుల రూపంలో కొందరు అర్బన్ నక్సల్స్ పోషిస్తున్నారు. నక్సలైట్ల ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైన మొదటి రోజుల నుంచే ఇప్పటి అర్బన్ నక్సల్స్ కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. వీరు గతంలో హక్కుల ఉద్యమకారులుగా చెలామణీ అయ్యారు. సకల వ్యవహారాలను చట్టాలకతీతంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముసుగులో కోర్టుల బయట రాజకీయ రచ్చ ద్వారా తేల్చుకుంటామని భావిస్తున్నారు. మరోవైపున చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళే మార్గంలో అర్బన్ నక్సల్స్ సమస్యకు సరైన పరి ష్కారాలు లభిస్తాయని ఆశిద్దాం. -కొట్టె మురళీకృష్ణ, కరీంనగర్ మొబైల్ : 94417 26741 -
ఇది ముమ్మాటికీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమే
హైదరాబాద్: భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమేనని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ ఎద్దేవా చేశారు. సంఘ్ ప్రచారక్ నుంచే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారని, ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత ఎవరికీ తెలియని ప్రచారక్ వ్యక్తులను హర్యానా, మహారాష్ట్ర సీఎంలుగా చేయడమే కాకుండా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొస్తూ అధికారాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫాసిస్టు దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి అగ్నివేష్ మాట్లాడారు. ప్రధాని మోదీని రోడ్డుషోలో చంపటానికి విరసం నేత వరవర రావు పథకం వేశారని ప్రభుత్వం కుట్ర పన్ని అక్రమ కేసులకు పాల్పడుతోందన్నారు. దివంగత ప్రధాని వాజ్‌పేయి మృతదేహాన్ని చూడటానికి వెళ్లిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ మూకలు తనపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. మహిళా హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంధ్యపై సైతం సోషల్ మీడియాలో దాడులకు పాల్పడుతూ ఆమెను మానసిక వేదనకు గురి చేస్తున్నారని విమర్శించారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే ఇప్పుడు సమావేశమైన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కూడా సభలు జరుపుకునే పరిస్థితి ఉండదని అగ్నివేశ్ జోష్యం చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ దేశం ప్రమాదకర పరిస్థితిలో ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు సభకు అధ్యక్షత వహించారు. -
వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం
-
వాజ్‌పేయికి నివాళి; స్వామి అగ్నివేష్‌పై దాడి
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. కడసారి వాజ్‌పేయిని దర్శించుకునేందుకు వచ్చిన అగ్నివేష్‌పై బీజేపీ కార్యకర్తలు సామూహికంగా దాడి చేశారు. ఈ విషయం గురించి అగ్నివేష్ మాట్లాడుతూ ‘వాజ్‌పేయి గారికి నివాళులర్పించేందుకు నేను ఇక్కడకు వచ్చాను. కానీ పోలీసు బందోబస్తు ఉండటం వల్ల నడుచుకుంటూ వస్తున్నాను. ఇంతలో ఉన్నట్టుండి కొందరు యువకులు వచ్చి నా మీద దాడి చేయడం ప్రారంభించారు. మేము ఇద్దరం, ముగ్గరమే ఉన్నాం.. కానీ వాళ్లు గుంపుగా వచ్చారు. వాళ్లు నా తలపాగాను పడేసి, మమ్మల్ని తిడుతూ, మా పై దాడి చేశార’ని తెలిపారు. అంతేకాక ‘వారిలో కొందరు నన్ను ఉద్దేశిస్తూ అతను దేశద్రోహి.. కొట్టండి, కొట్టండి అంటూ నా మీద దాడికి పురిగొల్పార’ని అగ్నివేష్ తెలిపారు. అయితే అగ్నివేష్‌పై దాడి జరగడం ఇది రెండో సారి. గతంలో ఒకసారి జార్ఖండ్‌లో బీజేపీ కార్యకర్తలు అగ్నివేష్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. -
స్వామి అగ్నివేష్‌పై దాడి అమానుషం: సీపీఐ
నాగర్‌కర్నూల్‌రూరల్: స్వామి అగ్నివేష్‌పై దాడి అమానుషం, ఫాస్టిస్ట్ ధోరణులకు పరాకాష్ట అని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి భరత్ మాట్లాడుతూ హిందుత్వ అరా చక పాలన, స్వామి అగ్నివేష్‌పై దాడిని తీ వ్రంగా ఖండించారు. రాజకీయాల్లో నల్లధనం పెరుగుతోందని, కుల, మతాల పేరు న ఓట్లడితే దుస్థితి నెలకొందని అన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు. 2018లో హిందూత్వ మతమౌఢ్యు లు 16మందిని చంపారని, భావ వ్యక్తీకరణను సహించలేకపోతున్నారని అన్నారు. 1979లో స్వామి అగ్నివేష్ ఐదు శతాబ్ధాలు గా మద్య నిషేధం, దళిత, గిరిజనుల అభ్యున్నతి, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేస్తున్న అగ్నివేష్‌పై మతోన్మాదులు వందమంది భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. బీజేపీ అధికారం చేపట్టాక రచయితలు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, దళితులు, మైనార్టీలపై దాడులకు హిందుత్వ మూకలు పాల్పడుతున్నాయని అన్నారు. దాడులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచార ణ జరపాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చె ప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేత ఆనంద్జీ, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమౌలి, ఖాజా, గోపిచారి, జక్కయ్య, పరుశరాములు, కుర్మయ్య పాల్గొన్నారు. -
స్వామి అగ్నివేశ్‌పై దాడి అమానుషం
హిమాయత్‌నగర్ : గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై మూకుమ్మడి దాడులు పెరుగుతున్నాయని, హిందూత్వ మత మౌఢ్యాన్ని వ్యతిరేకించేవారిపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్న పరిస్థితి ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీల్లో కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ.. ఏపీలో తటస్తుల పేరుతో నారా చంద్రబాబు నాయుడు కోటీశ్వరులను ఎన్నికల బరిలోకి దించి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. హిందూత్వ అరాచక పాలనను, స్వామి అగ్నివేష్‌పై అమానుష దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. 2018లో హిందూ మతమౌఢ్యులు 16మందిని చంపారన్నారు. భావ వ్యక్తీకరణను, ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తేనే లౌకికతత్వం నిలుస్తుందని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన వి.లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ.. స్వామి అగ్నివేష్ 1939లో ఏపీలో జన్మించి, హరియాణాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఐదేళ్లు వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మద్య నిషేధం అమలు కోసం, గిరిజనులు, దళితుల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్న పోరాటయోధుడన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 79 ఏళ్ల ఉద్యమకారునిపై.. ఆరెస్సెస్, బీజేపీ యువమోర్చాకు చెందిన అరాచక శక్తులు భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయనపై జరిగిన దాడికి ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐజేయూ గౌరవ సలహాదారులు కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించేతత్వాన్ని పెంపొందిస్తేనే సమాజం ముందుకెళ్తుందన్నారు. తాత్విక చింతనను ప్రోత్సహించాలన్నారు. సీపీఎం కార్యదర్శి వర్గసభ్యులు డి.జి.నరసింగరావు ప్రసంగిస్తూ.. స్వామి అగ్నివేష్‌పై దాడి మనువాద మూర్ఖుల దాడేనన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కె.అమర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, ప్రముఖ మహిళా నేత రమా మెల్కొటే, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, ప్రగతిశీల మహిళ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, శ్రామిక మహిళా నేత పావని, ఎంవీ ఫౌండేషన్ నేత ప్రకాష్, అప్సా కోఆర్డినేటర్ శివరాణి, జన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్, ప్రముఖ హేతువాది కె.వి.రెడ్డి, ప్రముఖ విశ్లేషకులు దేవి తదితరులు పాల్గొన్నారు. స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఖండించారు. -
స్వామి అగ్నివేష్‌పై సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్(78)పై బీజేపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. పాపులారిటీ కోసమే అగ్నివేష్.. తనపై తానే దాడి చేయించుకున్నారని జార్ఖండ్ మంత్రి సీపీ సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘దాడికి స్పాన్సర్ ఆయనే. పేరు కోసమే స్వయం ప్రేరేపిత దాడి చేయించున్నారు. ఆయన ఓ మోసగాడు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు. కశ్మీర్ వేర్పాటువాదులు, ఉగ్రవాదులకు మద్దతిస్తుంటారు. అలాంటి వ్యక్తిని పట్టించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు’ అని తెలిపారు. ‘ఆయన ట్రాక్ రికార్డు ఓసారి పరిశీలించండి. వివాదాస్పద వ్యాఖ్యలు, వైఖరి ఆయనకు కొత్తేం కాదు. బహుశా అది మనసులో పెట్టుకునే ఎవరైనా ఆ పని చేసి ఉండొచ్చు’ అని మరో బీజేపీ నేత చెబుతున్నారు. (బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకిలా...?) అయితే సీపీ సింగ్ 'వింత భాష్యం'పై ప్రతిపక్షాలు, అగ్నివేష్ మద్ధతుదారులు మండిపడుతున్నారు. జార్ఖండ్‌లోని పకూర్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం జరిగిన కార్యక్రమానికి అగ్నివేశ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన బయటకు వస్తుండగా.. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ అల్లరిమూక అగ్నివేష్‌పై పిడిగుద్దులు గుప్పించింది. తనను హత్య చేసేందుకే ప్రణాళిక ప్రకారం ఈ దాడి జరిగిందని అగ్నివేష్ చెబుతున్నారు. ఈ ఘటనపై రాంచీ హైకోర్టు రిటైర్జ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. ఆర్ఎస్ఎస్, బీజేవైఎం కార్యకర్తలు తనపై దాడి చేసినట్టు రాంచీ పోలీస్ స్టేషన్లో.. ఈ స్వయం ప్రకటిత ఆధ్యాత్మికవేత్త స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీసహా పలువురు అగ్నివేష్‌కు సంఘీభావం తెలిపారు. మరోవైపు ఘటన అనంతరం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. -
అగ్నివేష్ పై దాడి చేసింది ఎవరోకాదు...
-
‘కార్పొరేట్లకు తలవంచుతా.. నేనెవర్ని?’
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్(79)పై అల్లరిమూక దాడిచేసిన ఘటనపై ప్రధాని మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శలు గుప్పించారు. మోదీ తీరును పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘నేను దేశంలో శక్తిమంతమైన కార్పొరేట్లకు తలవంచుతాను. బలం, అధికారమే నాకు ముఖ్యం. నేను ప్రజల్లో భయం, విద్వేషం వ్యాప్తిచేసి అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తా. బలహీనుల్ని తొక్కిపడేస్తా. నాకు ఎంతమేరకు ఉపయోగపడతారన్న దాన్ని బట్టే చుట్టూ ఉన్నవారిని గౌరవిస్తా. నేనెవర్ని?’ అని రాహుల్ ట్వీట్ చేశారు. స్వామి అగ్నివేశ్‌పై అల్లరిమూక దాడి వీడియో క్లిప్‌ను ఈ ట్వీట్‌కు జతచేశారు. జార్ఖండ్‌లోని పకుర్‌లో హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఓ అల్లరిమూక అగ్నివేశ్‌పై మంగళవారం దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. బీజేపీ అనుబంధ బీజేవైఎం, ఏబీవీపీ కార్యకర్తలే తనపై దాడిచేశారని అగ్నివేశ్ ఆరోపించారు. -
బీజేపీ సీఎంలపై స్వామి అగ్నివేష్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చండీఘఢ్ : సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన చిత్రం ‘పద్మావతి’పై వివాదాల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా కోవలోకి ప్రమఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేష్ చేరారు. అయితే స్వామి అగ్నివేష్ పద్మావతి చిత్రానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం విశేషం. దేశంలో సినిమా, సమాచార ప్రసార సాధనాలు, సోషల్ మీడియాపై పరిమిలు విధించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం పద్మావతిపై జరగుతున్న వివాదాన్ని.. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే చూడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. పద్మావతి చిత్ర వివాదం.. నిషేధం, వివాదాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నాయని.. వీటికి గుజరాత్ ఎన్నికల దృష్టిలో చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని స్వామి అగ్నివేష్ చెప్పారు. ఇటేవంటి చర్యల వల్ల బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకేచోటకు చేరే అవకాశం ఏర్పడుతుందని.. అందుకు ‘పద్మావతి’ చిత్రం సహకరించేలా ఉందని ఆయన చెప్పారు. పద్మావతి చిత్రాన్ని ఆయా రాష్ట్రాల్లో నిషేధించిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్తాన్ ముఖ్యంత్రి వసుంధర రాజే సింధియా, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లు.. ముందు సినిమా చూడాలని ఆయన హితవు పలికారు. -
పోలీసుల అదుపులో మేథాపాట్కర్
మంద్సౌర్: మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సామాజిక కార్యకర్తలు మేథాపాట్కర్, స్వామి అగ్నివేశ్, స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు రైతులు మృతిచెందారు. మృతుల కుటుంబాలను కలిసేందుకు వస్తుండగా మంద్సౌర్ బయట ధోల్‌దార్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేసినందున ఇపుడిపుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని, ఇపుడు వీరి పర్యటన వల్ల శాంతికి విఘాతం కలిగే ప్రమాదముందని పోలీసులు పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున అక్కడికి వెళ్లడానికి వీల్లేదని వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాహౌ-నీముచ్ జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. వీరితో పాటు మరో 30మందిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. -
'ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం'
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు అనైతికమని ప్రముఖ సామాజికవేత్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ... న్యూఢిల్లీలోని జేఎన్‌యూలో విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు పెట్టడం అన్యాయమన్నారు. కన్హయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకున్నా దేశద్రోహం కేసు పెట్టారని అగ్నివేశ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోహిత్ విషయంలో బీజేపీ కేంద్రమంత్రులు అత్యుత్సాహం చూపారని స్వామి అగ్నివేశ్ చెప్పారు. -
వారి బాటలోనే కేసీఆర్ సర్కార్
ఆదివాసీల హక్కుల పరిరక్షణలో సర్కారు విఫలం సారాకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలి పీవైఎల్ సభలో సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత ప్రభుత్వాల బాటలోనే కేసీఆర్ సర్కార్ పయనిస్తోందని సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. 3 రోజులపాటు ఖమ్మంలో జరిగే పీవైఎల్ రాష్ట్ర మహాసభల్లో భాగంగా తొలిరోజు సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆశించారని, పేదలకు చేతినిండా పని, కడుపు నిండా భోజనం లభించని దుస్థితి ఉందన్నారు. కార్మికులకు కనీస వేతనం చెల్లించకపోవడం వారి చేత వెట్టి చాకిరీ చేయించుకున్నట్లే అవుతోందన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలకు తాను అండగా ఉంటానని తెలిపారు. ఆదివాసీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ప్రజల చేత ప్రభుత్వాలు బలవంతంగా తాగిస్తున్న సారాయికి వ్యతిరేకంగా మహిళలు మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సైతం ప్రజల పక్షాన నిలవడం లేదని, కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలవరం ఆదివాసీలను ముంచే ప్రాజెక్టని, దీనిపై ప్రభుత్వాలు పట్టుదలకు వెళ్తున్నాయి... తప్ప ఆదివాసీల మనుగడను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. . బూటకపు ఎన్కౌంటర్లతో ఉద్యమకారులను మట్టుపెట్టే పరిస్థితి ఇంకా కొనసాగుతోందన్నారు. సభలో తెలంగాణ జేఏసీ కో-చైర్మన్, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పీవైఎల్ రాష్ట్ర కన్వీనర్ ఎ.రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, బయ్యారం జెడ్పీటీసీ గౌని ఐలయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి ముక్తార్‌పాషా, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండలి వెంకన్న పాల్గొన్నారు. -
అందరినీ బతకనివ్వండి: స్వామి అగ్నివేశ్
నాంపల్లి: అల్ట్రా సౌండ్ పరీక్షల ద్వారా తల్లి కడుపులోనే ఆడ శిశువులను గుర్తించి హత్య చేస్తున్నారని, ఇలాంటి చర్యలు ఉగ్రవాదానికికంటే ప్రమాదకరమని స్వామీ అగ్నివేశ్ అన్నారు. ఉగ్రవాదులు ఎక్కడో ఒక చోట దాడులు చేస్తే, ఆల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా ప్రతి రోజూ వేలాది భ్రూణ హత్యలు చేస్తున్నారన్నారు. పి.ఆర్.ఓ.బి.ఇ(ప్రోబ్) ఆధ్వర్యంలో ఆదివారం తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీఆర్ కళా మందిరంలో ‘ఉగ్రవాదం నుంచి మానవత్వాన్ని రక్షించండి’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టే బిడ్డ ఆడైనా మగయైనా ఒక్కటేనని, పూర్వం ఆడ పిల్లలను తల్లిదండ్రులు చదివించే వారు కాదన్నారు. జన్మతో ఎవరూ ఉన్నతులు కాలేరని, జీవనంతోనే ఉన్నతులవుతారని పేర్కొన్నారు. మను ష్యులందరూ సమానమైనప్పుడు, మనతో పాటు భూమిపై జీవించే పశుపక్ష్యాదులను హరించడం ఎందుకన్నారు. ఏటా వంద కోట్ల పక్షులు, జంతువులను చంపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గోవధ మానుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడి రూ.4.5 కోట్లతో బంగారం దారాలతో నేసిన కోటును ధరించడం భావ్యం కాదన్నారు. పేద వాడు నూలుతో వడికిన వస్త్రాన్ని ధరించినప్పుడు ప్రధాని అంత విలువైన దుస్తులెందుకని ప్రశ్నించారు. ఇలాంటి వ్యత్యాసాల మీద ప్రజలందరూ పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో సేవలందిస్తున్న లవణం, సంఘ సేవకులు చలసాని రాజారామ్ మోహన్ రావు, ఇస్లామి ఫిఖ్ అకాడమీ ప్రధాన కార్యదర్శి మౌలానా ఖాలిద్ సైఫుల్లా రెహమానిలకు అంతర్జాతీయ మానవత్వ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రోబ్ సంస్థ అధ్యక్షులు శ్రీశైలం అధ్యక్షతన జరిగిన సభలో శ్రీరామానుజ మిషన్ ట్రస్టు చెన్నై మేనేజింగ్ ట్రస్టీ ఎస్ఎఆర్.ప్రసన్న వెంకటాచారియార్ చతుర్వేది స్వామి, విఠల్ రావు, విల్సన్ మెకో తదితరులు పాల్గొన్నారు. -
మద్య నిషేధాన్ని కోరుతూ దేశవ్యాప్త యాత్ర
ప్రముఖ సామాజిక ఉద్యమకర్త స్వామి అగ్నివేష్ వెల్లడి హైదరాబాద్: మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ వ్యాప్త యాత్రను చేపడుతున్నానని, దానికి కుల, మత, పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు ఉన్నదని ప్రముఖ సామాజిక ఉద్యమ కర్త స్వామి అగ్నివేష్ తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆప్సా, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ ‘కల్లు మానండోయ్ - కళ్లు తెరవండోయ్’ అని ఉద్యమాలు చేపడితే నేటి ప్రభుత్వాలు మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. గుజరాత్లో మద్యం ఆదాయం లేకుండానే అభివృద్ధి పథంలో ఉందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, రాజస్థాన్ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు. స్త్రీలపై అత్యాచారాలు.రోడ్డు ప్రమాదాలు, నేరాలతో పాటు అవినీతికి కూడా మద్యమే కారణమన్నారు. మద్యం పరిశ్రమలకు ప్రభుత్వాలిచ్చే రుణాలు నిలిపేయాలన్నారు. సిగరెట్, పొగాకు, ఇతర మత్తు మందులనూ నిషేధించాలని డిమాండ్ చేశారు. గతంలో తాను తెలంగాణకు వచ్చినప్పుడు నేటి సీఎంతో మద్యాన్ని నిషేధించాలని కోరినప్పడు సరేనన్నారని, నేడు మాట తప్పుతున్నారని విమర్శించారు. కేసీఆర్ స్పృహలోకి వచ్చే విధంగా ఇక్కడ మద్య నిషేధ ఉద్యమాలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ సభకు అధ్యక్షత వహించిన జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎక్సైజ్ పాలసీని రూపొందించాలన్నారు. పీవోడబ్ల్యూ నేత వి. సంధ్య మాట్లాడుతూ జూన్1 నుంచి వస్తున్న ప్రభుత్వ సారాయిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల లోపు మద్యంపై ప్రభుత్వం నిర్ణయం చేయకుంటే ఆమరణ నిరహార దీక్ష చేపడతానని ఆటో వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటి చైర్మన్ అమానుల్లాఖాన్ హెచ్చరించారు. సభలో సీపీఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్, అప్సా డెరైక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, మహిళా సంఘ నేతలు గజానని, శారద గౌడ్ పాల్గొన్నారు. -
మంటల్లో చేతులు పెడుతున్నారు
⇒ 8 నెలలకే ఆశ, అహంకారం పెరిగితే ఎలా? ⇒ ప్రజామోదం లేని ఏ పనీ లక్ష్యం చేరదు ⇒ అదే జరిగితే జాతీయస్థాయి ఉద్యమం ⇒ రైతులకు ఇష్టం లేకుండా భూ సేకరణ సాధ్యం కాదు ⇒ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ స్పష్టీకరణ సాక్షి, విజయవాడ బ్యూరో: ‘ఏపీ సీఎం చంద్రబాబు.. మంటల్లో చేతులు పెడుతున్నాడు. ఇలాగైతే భవిష్యత్తు రాజకీయం ఉండదు. 8 నెలలకే ఇంత ఆశ, అహంకారమైతే ఎలా? ప్రజామోదం లేకుండా చేపట్టే ఏ పనీ లక్ష్యం చేరదు. దీన్ని గుర్తిస్తే సరి, లేదంటే పతనమే. రాజధాని రైతులకు ఇష్టం లేకుండా భూ సేకరణ సాధ్యంకాదు. అలా జరిపితే విజయవాడ కేంద్రంగా మహోద్యమాన్ని మొదలు పెడతాం’ అని జాతీయ స్థాయి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేశ్ హెచ్చరించారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన భూ సేకరణ ఆర్డినెన్స్‌పై పార్లమెంటులో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆర్డినెన్స్‌ను చూసి భయపడుతున్న ఏపీ రాజధాని ప్రాంత రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు అగ్నివేశ్ విజయవాడ వచ్చారు. వెట్టిచాకిరీ, బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థపై దశాబ్దకాలంగా ప్రజా ఉద్యమాలు చేస్తున్న ఆయన రాకతో రాజధాని రైతుల్లో స్థైర్యం పెరిగింది. ఈ సందర్భంగా అగ్నివేశ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఇలా.. సాక్షి: భూ సమీకరణ నిర్ణయం సమర్థనీయమేనా? అగ్నివేశ్: ముమ్మూటికీ కానేకాదు. మట్టిని నమ్ముకుని బతికే శ్రమజీవులకు అన్యాయం చేసేలా పెద్ద ఎత్తున భూ సమీకరణ చేయడం సబబు కాదు. చండీగఢ్, రాయపూర్ రాజధానులకు 5 వేల ఎకరాలు మాత్రమే సేకరించగా, ఇక్కడ మాత్రం 30 నుంచి లక్ష ఎకరాలు ఎందుకో అర్థం కావడం లేదు. సాక్షి: ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అగ్నివేశ్: సారవంతమైన భూములున్న ఎర్రబాలెం, పెనుమాక గ్రామాలకు వెళ్లాను. పొలాలు చేజారి పోతున్నాయన్న ఆందోళన అక్కడి వారిలో కనిపించింది. నేను ప్రశ్నించే లోగా.. ‘ప్రాణాలైనా ఇస్తాం గానీ పొలాలు మాత్రం ఇవ్వలే’మన్నారు. నేలతల్లితో వారికున్న అనుబంధం అలాంటిది. అప్పుడే అనుకున్నా వీరికి అండగా నిలబడాలని. ఎంతటి ఉద్యమానికైనా సిద్ధం కావాలని. సాక్షి: రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని సీఎం అంటున్నారు ? అగ్నివేశ్: ఇది భారత్. భారతదేశంగానే ఉండాలి. మన సంప్రదాయాలు, ఆచారాలు, నమ్మకాలు దెబ్బతినకూడదు. సింగపూర్‌గా ఎందుకు మార్చడం?ఎవరికి ప్రయోజనం? రియల్ వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు బాగుపడతాయంతే. సాక్షి: ప్రపంచస్థాయి రాజధాని నగరం అవసరమా? అగ్నివేశ్: డబ్బుల్లేవంటూనే ప్రపంచస్థాయి రాజధాని ఎందుకట? సుందరమైన చిన్న రాజధాని సరిపోతుంది కదా. ఇందుకు పెట్టే ఖర్చును తగ్గించి పరిశ్రమలు, వ్యవసాయ రంగాలను వృద్ధి చేసుకుంటే ఆర్థికాభివృద్ధి పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. సాక్షి: రాష్ట్రంలో బాబు, కేంద్రంలో మోదీ ఒకే బాటలో వెళ్తున్నారా? అగ్నివేశ్: ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. భూ సేకరణ ఆర్డినెన్సును కేంద్రంలో అన్ని పార్టీలూ వ్యతిరేకించాయి. యూపీ, పంజాబ్‌లతో పాటు రాంవిలాస్‌పాశ్వాన్, శివసేన పార్టీలు కూడా ఆర్డినెన్సును వ్యతిరేకించాయి. కానీ.. మోదీ, చంద్రబాబు మాత్రమే దీన్ని సమర్థించారు. దీన్నిబట్టి ఈ ఆర్డినెన్సును చంద్రబాబు కోసమే తెచ్చారన్నది సుస్పష్టం. సాక్షి: రైతులకు మీభరోసా ? అగ్నివేశ్: వారి కోసం నిలబడతాం. ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరిస్తే ప్రతిఘటిస్తాం. జాతీయ స్థాయి నాయకులను తీసుకొస్తాం. అన్నాహజారే, మేథాపాట్కర్ వంటి ఉద్యమకారులూ వస్తారు. హర్యానా, యూపీ, ఢిల్లీల నుంచి ఎంతో మంది తరలివస్తారు. ప్రభుత్వం ఎంత మంది పోలీసులను పెట్టినా, తపాకీ గుళ్లు పేలినా వెనుకంజ వేయం. విజయవాడ కేంద్రంగా జాతీయ స్థాయి ఉద్యమం హోరెత్తేలా చేస్తాం. -
ల్యాండ్ పూలింగ్తో జీవితాలు తాకట్టు
* ప్రజా ఉద్యమ జాతీయ కూటమి ఆందోళన * ఆంధ్రప్రదేశ్ విధానంతో ఆహార భద్రతకూ ముప్పే * గాంధీ స్ఫూర్తితో పోరాటాలు చేయాలన్న శరద్‌యాదవ్ * చంద్రబాబు.. తాకట్టు విధానాలు వీడాలన్న స్వామి అగ్నివేశ్ సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ నూతన రాజధాని నిర్మాణం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ పూలింగ్ కేవలం ప్రజల జీవితాలను తాకట్టు పెట్టేలా ఉందని ప్రజా ఉద్యమాల జాతీయ కూటమి(ఎన్ఏపీఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల అనుమతి, సంప్రదింపులు లేకుండా, పర్యావరణ అనుకూలతలు పట్టించుకోకుండా, శివరామకృష్ణన్ కమిటీ నివేదికపైనా కనీసం చర్చించకుండా టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగుతోందని కూటమి దుయ్యబట్టింది. సింగపూర్ తరహా రాజధాని అంటూ ఆకాశంలో చందమామను చూపి భూములను మింగేస్తున్నారని విమర్శించింది. రాజధాని నిర్మాణంపై ఏపీ అవలంబిస్తున్న వైఖరిని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని, అవసరమైతే ప్రజా ఉద్యమాలు చేపట్టాలని కూటమి తీర్మానించింది. ఈ మేరకు ఎన్ఏపీఎం జాతీయ కన్వీనర్ రామకృష్ణరాజు, మాజీ ఐఏఎస్ అధికారి దేవసహాయం అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో ‘ఏపీ గ్రీన్ ఫీల్డ్ రాజధాని, భూసేకరణ చట్టం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జేడీయూ అధినేత శరద్‌యాదవ్, సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యుడు డి.రాజా, ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, సామాజికవేత్త స్వామి అగ్నివేశ్‌తో పాటు వివిధ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు. రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ‘చట్ట ప్రకారం ఎలాంటి భూమినైనా ఎంతటి అవసరాల కోసమైనా ప్రజలతో సంప్రదింపులు జరపకుండా సేకరించరాదు. ఆహార భద్రతకు ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా వ్యవసాయ భూముల సేకరణ జరగాలి. కానీ ‘ఫుడ్ బౌల్ ఆఫ్ ఏపీ’గా ఉన్న వీజీటీఎం(విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) ప్రాంతాన్ని రాజధాని పేరిట నాశనం చేస్తున్నారు. గ్రామీణ నిర్మాణ వికాసాన్ని చెదరగొట్టి.. ప్రభుత్వం చెబుతున్న ‘మేకిన్ ఇండియా’ ఎలా సాధిస్తారు?’ అని వక్తలు ప్రశ్నించారు. ఆహార భద్రతకు భరోసా లేనప్పుడు జాతీయ భద్రత ఎక్కడుందన్నారు. ఈ సందర్భంగా దేవసహాయం పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పేరిట ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నది, వారిని దెబ్బతీసే యత్నాలు ఎలా జరుగుతున్నాయి వంటి అంశాలను వివరించారు. ‘120 రకాల పంటలు, ఏడాదికి రూ.1000 కోట్ల వ్యవసాయోత్పత్తి ఉన్న భూములను పూలింగ్ పేరిట లాక్కొంటూ ప్రజలను ఫూల్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. బాధిత ప్రజలకు అండగా ఉంటాం: శరద్‌యాదవ్, జేడీయూ అధినేత కేంద్రం తెచ్చిన భూసేకరణ బిల్లు దేశం మొత్తాన్నీ లూఠీ చేసేలా ఉందని జేడీయూ అధినేత శరద్‌యాదవ్ విమర్శించారు. ఆవో.. లూటో.. కమావో (రండి..దోచుకోండి..సంపాదించండి) అన్న తరహాలో వ్యవహరిస్తూ కార్పోరేట్ కంపెనీలకు దాసోహం పలుకుతోందని నిప్పులు చెరిగారు. ఒక్క ఏపీలోనే కాకుండా దేశమంతటా ఇలాంటి కొల్లగొట్టే చర్యలే జరుగుతున్నాయన్నారు. రైతులకు నష్టం కలగనీయకుండా మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఉద్యమించాల్సి ఉందన్నారు. ఏపీ రాజధాని బాధిత రైతులకు అండగా ఉంటామన్నారు. వారి కోసం పార్లమెంటు లోపలా, బయటా కూడా పోరాడతామని నొక్కి చెప్పారు. బాబువి తాకట్టు విధానాలు: అగ్నివేశ్ ఏపీ సీఎం చంద్రబాబు.. తన తాకట్టు విధానాలను కొనసాగిస్తున్నారని సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ అన్నారు. ‘ప్రజాభిప్రాయానికి తిలోదకాలిస్తూ భూసేకరణ చేస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో సింగపూర్ ప్రతినిధులకు తెలియదు. వారి చేతిలో రాజధాని నిర్మాణం పెట్టి అభివృద్ధి అంటే అది గ్రామీణ వ్యవస్థను వినాశనం చేయడమే. శివరామకృష్ణన్ కమిటీ సైతం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సూచించింది. వాటిని ఉల్లంఘించి ముందుకెళితే ఉద్యమం తప్పదు’ అని హెచ్చరించారు. గొంతు నొక్కారు: రామచంద్రయ్య రాజధాని నిర్మాణం విషయంపై శాసనసభ, మండలిలో సీఎం చంద్రబాబు.. విపక్షం గొంతు నొక్కి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య తెలిపారు. విజయవాడ చుట్టూ 180 కిలోమీటర్ల పరిధి అంత సురక్షిత ప్రాంతం కాదని జియోలాజికల్ శాఖ తేల్చిచెప్పినా సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. సింగపూర్ తరహా రాజధానిపై కేబినెట్లోని మంత్రులకే తెలియదని, ఎమ్మెల్యేలకు ల్యాండ్ పూలింగ్‌పై కనీస అవగాహనా లేదని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోలీసులతో కవాతులు చేయిస్తున్నారన్నారు. ‘అక్కడేమైనా జిహాదీలు తిరుగుతున్నారా?’ అని ప్రశ్నించారు. ఇలాంటి రాక్షస నిర్ణయాలు దేశానికి ముప్పని వ్యాఖ్యానించారు.