
సాక్షి, అమరావతి: ఆర్యసమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ (80) మృతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. సాంఘిక దురాచారాలకు, వెట్టి చాకిరి నిర్మూలనకు స్వామి అగ్నివేశ్ గారు ఎంతో పోరాటం చేశారని తెలిపారు. అగ్నివేశ్ గారు చేసిన సామాజిక సేవల వల్ల సమాజంలో చాలా మంది స్పూర్తి పోందారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
స్వామి అగ్నివేశ్ కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్)లో మంగళవారం నుంచి చికిత్స పొందుతున్నారు. కీలక అవయవాల వైఫల్యంతో వెంటిలేటర్‌పై ఉన్న స్వామి అగ్నివేశ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు మరణించారని వైద్యులు తెలిపారు. అగ్నివేశ్ 1939, సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు.