స్వామి అగ్నివేష్‌పై దాడి అమానుషం: సీపీఐ | Attack On Swami Agnivesh Strike | Sakshi
Sakshi News home page

స్వామి అగ్నివేష్‌పై దాడి అమానుషం: సీపీఐ

Published Sat, Jul 21 2018 12:36 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Attack On Swami Agnivesh Strike - Sakshi

రాస్తారోకో చేస్తున్న నాయకులు

నాగర్‌కర్నూల్‌రూరల్‌: స్వామి అగ్నివేష్‌పై దాడి అమానుషం, ఫాస్టిస్ట్‌ ధోరణులకు పరాకాష్ట అని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి భరత్‌ మాట్లాడుతూ హిందుత్వ అరా చక పాలన, స్వామి అగ్నివేష్‌పై దాడిని తీ వ్రంగా ఖండించారు. రాజకీయాల్లో నల్లధనం పెరుగుతోందని, కుల, మతాల పేరు న ఓట్లడితే దుస్థితి నెలకొందని అన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు. 2018లో హిందూత్వ మతమౌఢ్యు లు 16మందిని చంపారని, భావ వ్యక్తీకరణను సహించలేకపోతున్నారని అన్నారు. 1979లో స్వామి అగ్నివేష్‌ ఐదు శతాబ్ధాలు గా మద్య నిషేధం, దళిత, గిరిజనుల అభ్యున్నతి, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేస్తున్న అగ్నివేష్‌పై మతోన్మాదులు వందమంది భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుమాలిన చర్య అని అన్నారు.

బీజేపీ అధికారం చేపట్టాక రచయితలు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, దళితులు, మైనార్టీలపై దాడులకు హిందుత్వ మూకలు పాల్పడుతున్నాయని అన్నారు. దాడులపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచార ణ జరపాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చె ప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేత ఆనంద్‌జీ, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమౌలి, ఖాజా, గోపిచారి, జక్కయ్య, పరుశరాములు, కుర్మయ్య పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement