
( ఫైల్ ఫోటో )
సాక్షి, డిండి(మహబూబ్‌నగర్) : ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 24 జెడ్ 0011 నంబరు గల బస్సు అచ్చంపేట నుంచి దేవరకొండ వైపు వెళ్తుంది.
ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మండలంలోని కాటికబండతండాకు చెందిన రాత్లావత్ రమేష్ ఎర్రారం గేటు వద్ద ఆర్టీసీ బస్సు ఆపలేదని ద్విచక్రవాహనంపై వెళ్లి బస్సును ఓవర్‌టేక్ చేసి డ్రైవర్ కేతావత్ పత్యానాయక్‌పై దాడి చేశాడు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ.శోభన్‌బాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment