
మహబూబ్‌నగర్ జిల్లా: మద్యం మత్తులో ఆరుగురు యువకులు కన్నూ, మిన్నూ తెలియక అటవీశాఖాధికారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా అతనిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేశారు. కర్నూలు జిల్లా సున్నిపెంట వద్ద అటవీశాఖాధికారిపై ఆరుగురు యువకులు మంగళవారం రాత్రి దాడి చేశారు. అటవీ ప్రాంతంలో మద్యం తాగవద్దన్నందుకు వారు కోపంతో అటవీశాఖాధికారి చెంప చెల్లుమనిపించారు. అందులో ఒకరు తాను ఎమ్మెల్సీ కుమారుడినని, నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు.
అనంతరం అటవీశాఖాధికారి చేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ అడిగేలా చేశారు. ఇదంతా పక్కన ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన వారు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయం గురించి తోటి అటవీశాఖాధికారులకు సదరు బాధిత అటవీశాఖాధికారి తెలియజేయడంతో వారు వచ్చి ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కర్నూలు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment