AITUC leaders
-
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
సాక్షి,ఆదిలాబాద్: బేషరతుగా సమ్మె విరమించుకున్న ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి ఎస్.విలాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన యూనియన్ జిల్లా కౌన్సెలింగ్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమ్మె విరమించిన కార్మికులను డ్యూటీలోకి తీసుకోకుండా కాలయాపన చేయడం సమజసం కాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. అలాగే రిమ్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు సమానపనికి సమాన వేతనం అందించాలన్నారు. సీసీఐ ఫ్యాక్టరీని తెరిపించాలన్నారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన, ఆశా, కార్మికులకు కనీస వేతనం రూ.18 వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాన్ని నిలిపివేయాలన్నారు. వీఆర్ఎస్ పేరిట లక్షలాది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని మానుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు సిర్ర దేవేందర్, కుంటాల రాములు, రాజు, రఘునాథ్, ఉస్మాన్, నాందేవ్, ఆశన్న, కాంతరావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన ఆసిఫాబాద్: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారం నాటికి 49వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా స్థానిక బస్టాండు సమీపంలోని శిబిరంలో కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల పట్ల తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలన్నారు. సీఎం సూచన మేరకే కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు ప్రకటిస్తున్నారన్నారు. ప్రైవేటీకరణ వల్లనే ఆర్టీసీకి లాభాలు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పే విషయంలో వాస్తవం లేదన్నారు. దీక్షల్లో కార్మికులు ఉమేశ్, రాజేశ్వర్, లక్ష్మణ్, సురేశ్, జహూర్, తులసీరాం, రమేశ్, డేవిడ్‌తో పాటు పలువురు కూర్చున్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బూసి బాపు, దివాకర్, దేవపాల, శ్రీరాం వెంకటేశ్వర్ పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు -
సమస్యలపై ఆందోళనలు ఉధృతం
సింగరేణి(కొత్తగూడెం): గత అసెంబ్లీ ఎన్నికల ముందు, ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకై యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ అడ్వైజర్ దమ్మాలపాటి శేషయ్య ఆన్నారు. మంగళవారం ఏరియాలోని జీకేఓసీ గని వద్ద ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ హామీల అమలు కోసం ఈనెల 3న, 16వ తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న జీఎం, డిపార్ట్మెంట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యంలో చలనం లేదని, అందుకే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఓసీలలో బొగ్గు నాణ్యతకు ఇన్సెంటివ్ జతచేయటం సరైందికాదని, నాణ్యత తో ప్రమాణం లేకుండా కార్మికులకు ఇన్సెంటివ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన గ్రాట్యుటీ చెల్లింపు విషయంలో 10వ వేజ్‌బోర్డు అమలు నాటి నుంచి చెల్లించాలని ఏఐటీయూసీ స్టాండరైజేషన్ సమావేశంలో మాట్లాడామన్నారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ విషయంలో ఇప్పటి వరకు రెండు సమావేశాలు జరిగాయని, మళ్లీ ఈనెల 27న వారణాసిలో సమావేశం జరుగనుందని, ఈ సమావేశంలో పూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో సముద్రాల సుధాకర్, ఏ వీరమణ, ఎంవీరావు, ఎస్.వెంకటేశ్వర్లు, వట్టికొండ ప్రసాద్, ఎస్.శ్రీనివాస్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
తల్లాడ ఖమ్మం : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, వారి పాలిట శాపంగా మారిందని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సింగు నరసింహారావు అన్నారు. శుక్రవారం ఏఐటీయూ సీ బస్సు ప్రచార యాత్ర ఏన్కూరు మీదుగా తల్లాడ చేరుకుంది. ఈ సందర్భంగా బీజీ.క్లెమెంట్ అధ్యక్షతన రింగ్సెంటర్లో జరిగిన సభలో ఆయ న మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రేడ్ యూనియన్ చట్టాన్ని మారుస్తూ భవిషత్తులో పర్మినెంట్ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత లేకుండా పైర్ అనే విధానాన్ని ప్రవేశపెడుతూ శాశ్వత ఉద్యో గులు లేకుండా చర్యలకు పూనుకుంటున్నాయని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాం డ్ చేశారు. బంగారు తెలంగాణ సాధి స్తామని కేసీఆర్ ప్రగల్భాలు పలికి వాగ్ధానాలను అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యా రని విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించక పోతే ఈ ప్రభుత్వాలకు పతనం తప్పదని ఆయన హె చ్చరించారు. ఈ సందర్భంగా తల్లాడలో కార్మికులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జని రత్నాకర్‌రావు, రాష్ట్ర కార్యదర్శి ఎన్.కరుణకుమారి, సహాయ కార్యదర్శి బాలరాజు, ఏఐటీయూసీ డివిజన్ నాయుకులు నిమ్మటూ రి రామక్రిష్ణ, నల్లమోతు నరసింహరావు, టీ.వెంకటేశ్వర్రావు, తాళ్లూరి లక్ష్మీ, సుభద్ర, జయమ్మ, జే.వెంకటలక్ష్మీ, ఎం.పద్మ,సీత, కొల్లి నాగభూషణం, ఇనుపనూరి క్రిష్ణ పాల్గొన్నారు. -
‘ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’
నాగర్‌కర్నూల్‌రూరల్: గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాం డ్ చేశారు. మంగళవారం పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 50వేల మంది కార్మికులు, కారోబార్లు, ఎలక్ట్రిషియన్లు, స్వీపర్లు, కామటి తదితరు లకు కనీస వేతనం కల్పించా లని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ సహాయ కార్యదర్శి రామయ్య, పంచాయతీ కార్మికుల కృష్ణయ్య, చంద్రయ్య, నాగయ్య, స్వామి పాల్గొన్నారు. బిజినేపల్లిరూరల్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జి ల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ము భరత్ అన్నారు. మంగళవారం బిజినేపల్లిలో గ్రామ పంచాయతీ కార్మికులతో చేపట్టిన నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని రెండో రోజూ కొనసాగింది. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు నెలానెలా సబ్బు, నూనె అందించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీ ను, శుభాకర్, చంద్రమౌళి, కృష్ణాజీ, కార్మికులు వెంకటేష్, కతాల్, కృష్ణయ్య, శ్రీనివాసులు, రాము పాల్గొన్నారు. సీపీఐ, కాంగ్రెస్ మద్దతు తెలకపల్లి: తహసీల్దార్ కార్యాలయం వద్ద శిబిరంలో కాంగ్రెస్, సీపీఐ నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మామిళ్లపల్లి యాదయ్య, సీపీఐ మండల కార్యదర్శి గోపాస్ లక్ష్మణ్ మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రవికుమార్, జిల్లా కార్యదర్శి శంకర్‌గౌడ్, సాయిలు, వడ్డె రాములు, గోపాస్ లక్ష్మణ్, సుధాకర్, రషీద్, రాములు, ఉస్సేన్, మశమ్మ, పార్వతమ్మ, వెంకటమ్మ, రామస్వామి నాగయ్య, అక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. తాడూరు: కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మీకి వినతి పత్రం అందించారు. వేతనం రూ. 15వేలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించి కార్మికులకు వేతనాలు పెంచి రెగ్యూలర్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మికులు వెంకటయ్య, బంగారయ్య, అన్వర్ తదితరులున్నారు. రెండో రోజుకు చేరిన వీఓఏల ధర్నా నాగర్‌కర్నూల్‌రూరల్: జిల్లాలో పనిచేస్తున్న వీఓఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ధర్నా మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా తెలంగాణ ఐకేపీ వీఓఏల రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 18వేల వీఓఏలు ఏళ్ల తరబడి మహిళా సంఘాలకు వెట్టి చాకిరీ చేస్తే 2010లో నిర్వహించిన పోరాట ఫలితంగా రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారని, దీంతో తమ కుటుంబాలను వెళ్లదీయలేకపోతున్నామని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు జడ్చర్ల సభలో కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మహిళా సంఘాల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తామని పేర్కొన్నారని, కానీ రూ.5వేల వేతనం ఇస్తామని చెప్పి హామీని అమలు చేయలేదని ఆరోపించారు. జెడ్పీటీసీ కొండా మణెమ్మ వారికి మద్దతు తెలిపారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుమలత, బాలీశ్వర్, వెంకటయ్య, జగన్, యాదగిరి, రామస్వామి, భగత్‌సింగ్, భాగ్య, నర్సింహ, జీ లేఖ తదితరులు పాల్గొన్నారు. -
స్వామి అగ్నివేష్‌పై దాడి అమానుషం: సీపీఐ
నాగర్‌కర్నూల్‌రూరల్: స్వామి అగ్నివేష్‌పై దాడి అమానుషం, ఫాస్టిస్ట్ ధోరణులకు పరాకాష్ట అని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి భరత్ మాట్లాడుతూ హిందుత్వ అరా చక పాలన, స్వామి అగ్నివేష్‌పై దాడిని తీ వ్రంగా ఖండించారు. రాజకీయాల్లో నల్లధనం పెరుగుతోందని, కుల, మతాల పేరు న ఓట్లడితే దుస్థితి నెలకొందని అన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందన్నారు. 2018లో హిందూత్వ మతమౌఢ్యు లు 16మందిని చంపారని, భావ వ్యక్తీకరణను సహించలేకపోతున్నారని అన్నారు. 1979లో స్వామి అగ్నివేష్ ఐదు శతాబ్ధాలు గా మద్య నిషేధం, దళిత, గిరిజనుల అభ్యున్నతి, బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేస్తున్న అగ్నివేష్‌పై మతోన్మాదులు వందమంది భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. బీజేపీ అధికారం చేపట్టాక రచయితలు, జర్నలిస్టులు, ప్రజాస్వామికవాదులు, దళితులు, మైనార్టీలపై దాడులకు హిందుత్వ మూకలు పాల్పడుతున్నాయని అన్నారు. దాడులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచార ణ జరపాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చె ప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేత ఆనంద్జీ, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రమౌలి, ఖాజా, గోపిచారి, జక్కయ్య, పరుశరాములు, కుర్మయ్య పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కడప కార్పొరేషన్: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర గౌరవాధ్యక్షుడు ఏ. రామ్మోహన్, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, జీఓ నంబర్ 151ని రద్దు చేసి, 151 జీవో ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు గోపీ, గోవింద్, కేశవ, విజయ్‌భాస్కర్, రవి, హరి, జాన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వార్డు కార్యాలయాల ఎదుట.. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగర కార్పొరేషన్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఆర్టీయూ) జిల్లా కార్యదర్శి సుంకర రవి డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగర కార్పొరేషన్ పరిధిలోని వార్డు కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సిద్ధిరామయ్య, లక్ష్మీదేవి, కొండయ్య, కార్మికులు పాల్గొన్నారు. -
నిధుల దారి మళ్లీంపుపై పోరాటం
► 25న చలో విజయవాడను విజయవంతం చేయాలి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డు నిధులను చంద్రన్న బీమాకు మళ్లీంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐటీయూసీ, సీఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మునెప్ప, నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వెల్ఫేర్ బోర్డుకు చెందిన 234 కోట్ల రూపాయలను చంద్రన్న బీమాకు తరలించారని, వాటిని వెంటనే తిరిగి అప్పజెప్పాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కార్మిక సంఘాల ఐక్యమత్యంతో ఉద్యమానికి పిలుపునిచ్చాయని, అందులో భాగంగా ఈనెల 25న చేపట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. శనివారం కేకే భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ..40 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. రూ.117 కోట్లను చంద్రన్న బీమా ప్రచారం కోసం వాడుకోవడం దారుణమన్నారు. అలాగే 234 కోట్లను ఇతర పనులకు మళ్లీంచారని ఆరోపించారు. ఈ నిధులను వెల్లేర్ బోర్డుకు తిరిగి అప్పగించాలని, ప్రతీ కార్మికుడికి రూ.3000 పెన్షన్ ఇవ్వాలని కోరుతూ చేపడుతున్న చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా నుంచి వందల సంఖ్యలో కార్మికులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నరసింహులు, రాముడు పాల్గొన్నారు. -
హామీలను గాలికొదిలేశారు..?
వినాయక్‌నగర్ : మోడీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల తరువాత నల్లధనాన్ని దేశానికి తీసుకువచ్చి, ప్రతి పౌరుని జేబులో రూ.15లక్షలు పెడతానని చెప్పిన మాటలు గాలికి వదిలేసి, గాలిమోటార్లలో ఇతర దేశాలను చుట్టేస్తున్నాడని ఆల్ ఇండియా ట్రెడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహన్ విమర్శించారు. రెండు రోజుల మహాసభల్లో భాగంగా మెదటి రోజు శనివారం జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున శ్రద్ధానంద్ గంజ్ నుంచి రాజీవ్‌గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహన్ పా ల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మృత్యువాత పడుతున్నారని అన్నారు. కానీ ఆ రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలకు పలు రాయితీలిచ్చి అభివృద్ధి రాష్ట్రంగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రతీ ఎర్రజెండా కార్మిక సంఘం కాదని, ఏఐటీయూసీ 94 ఏళ్ల క్రితం పుట్టిందన్నారు. కార్మిక లోకానికి ఎనలేనిసేవలందించిన ఘనత ఏఐటీయూసీదే అని పేర్కొన్నారు. మిగతా ఎర్రజెండాల కార్మిక సంఘాలు డూప్లికేటువని ఆయన విమర్శించారు. మోడీ, కేసీఆర్‌లు అన్నదమ్ముళ్లుగా తయారయ్యారని ఆయన విమర్శించారు. వారికి ఏఐటీయూసీ తరపున నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తామని, వీటితో వారు బతుకగలరా అని ప్రశ్నించారు. మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తూ, ప్రతి కార్మికుడికి రూ.15వేలు కనీస వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణను ఇతర దేశల్లా మార్చడం కాదని, తమను తమలాగా బతకడానికి ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్కలు తిరుగుతున్నాయని, కానీ రోగులు మాత్రం వెళ్లడంలేదన్నారు. ఈ సమావేశానికి ఏఐటీయూసీ నాయకులు వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించగా, నాయకులు వై. ఓమయ్య. సుధాకర్, అన్ని అనుబంధ విభాగాల కార్మిక సంఘాల నాయకులు, సీపీఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య తదితరులు పాల్గొన్నారు.