కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న జేఏసీ నాయకులు
కడప కార్పొరేషన్: మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫెడరేషన్ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించా రు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర గౌరవాధ్యక్షుడు ఏ. రామ్మోహన్, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు వేణుగోపాల్ మాట్లాడుతూ మున్సిపల్ సమస్యలు పరిష్కరించాలని కొన్నేళ్లుగా వివిధ రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, జీఓ నంబర్ 151ని రద్దు చేసి, 151 జీవో ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు గోపీ, గోవింద్, కేశవ, విజయ్‌భాస్కర్, రవి, హరి, జాన్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వార్డు కార్యాలయాల ఎదుట..
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగర కార్పొరేషన్‌లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (ఆర్‌టీయూ) జిల్లా కార్యదర్శి సుంకర రవి డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నగర కార్పొరేషన్ పరిధిలోని వార్డు కార్యాలయాల ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సిద్ధిరామయ్య, లక్ష్మీదేవి, కొండయ్య, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment