సికార్‌లో బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ
సికార్(రాజస్తాన్): రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అక్రమ, ఆర్థిక లావాదేవీల చిట్టా ఈ ‘రెడ్ డైరీ’లో ఉందంటూ బహిష్కృత మంత్రి రాజేంద్ర గుఢా చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ వంతపాడారు. ఈ ఆరోపణలకు దేశవ్యాప్తంగా 1.25 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితంచేసే కార్యక్రమం వేదికగా నిలిచింది.
సికార్‌లో జరిగిన ఈ వేడుకలో ఇంకొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘ బ్రిటిష్ వారు దేశాన్ని వదిలివెళ్లిపోవాలని గాం«దీజీ ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇవ్వాల్సిన నినాదం ‘అవినీతి క్విట్ ఇండియా, వారసత్వం క్విట్ ఇండియా, బుజ్జగింపు క్విట్ ఇండియా’.
కాంగ్రెస్ వారి కొల్లగొట్టే దుకాణంలో కొత్త సరుకే ఈ ‘రెడ్ డైరీ’. గెహ్లాట్ సర్కార్ పేపర్ లీక్ పరిశ్రమను నడుపుతోంది. కాంగ్రెస్ వారి అవినీతి రహస్యాలు అందులో దాగిఉన్నాయి. ఆ అవినీతి ఈసారి ఎన్నికల్లో వారిని ఓటమిపాలుచేయనుంది’ అని మోదీ అన్నారు. ‘ రెడ్‌డైరీ పేజీలు తెరిస్తే చాలా మంది పెద్ద తలకాయల బండారాలు బయటపడతాయని ప్రజలే చెబుతున్నారు’ అని ఆరోపించారు.
పేరు మార్చి ఏమార్చి..
‘ఇందిరాగాంధీ హయాంలో ఇందిరనే ఇండియా, ఇండియానే ఇందిర’ అని ప్రజల్ని ఏమార్చారు. తర్వాత యూపీయేనే ఇండియా, ఇండియానే యూపీయే’ అని మభ్యపెట్టారు. బ్రిటిష్ సంస్థకు ఇండియా పదాన్ని జోడించి దేశంలో అడుగుపెట్టి దోచుకున్న ఈస్టిండియా కంపెనీ సంగతి తెల్సిందే. ఇండియా పేరున్న సిమీపై నిషేధం విధించాక ఎఫ్‌పీఐ పేరిట మళ్లీ ఉగ్రవాదులు దాడులకు దిగారు.
ఇప్పుడు కాంగ్రెస్, దాని జట్టు పారీ్టలు ఇదే ఎత్తుగడతో తమ కూటమికి ఇండియా అని పేరుపెట్టుకున్నాయి’ అని మోదీ ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మోదీ పర్యటించడం గత ఆరునెలల్లో ఇది ఏడోసారి కావడం గమనార్హం. ‘ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతో విపక్షాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి’ అని గుజరాత్‌లోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అయిన రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారం¿ోత్సవంలో మోదీ విమర్శించారు.
గెహ్లాట్ ‘ఎరుపు’ దాడి
మోదీ విమర్శలపై సీఎం గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. ‘ఎరుపు(రెడ్) డైరీ ఊహాత్మకం. వాస్తవానికి అలాంటిది లేదు. మాజీ మంత్రిని పావుగా వాడి రాజకీయం చేస్తున్నారు. నిజానికి అదొకటి ఉంటే మీ చేతిలో కీలుబొమ్మలైన ఈడీ, ఐటీ, సీబీఐలు ఎందుకు ఇంతవరకు దాని వివరాలు తెల్సుకోలేకపోయారు? ఎర్ర సిలిండర్(ఎలీ్పజీ సిలిండర్) ఏకంగా రూ.1,150కి విక్రయిస్తూ అసలైన దోపిడీకి పాల్పడింది మోదీనే. ఎర్ర టమాటాలు రూ.150 పైగా ఎగబాకడానికి మీరే కారణం. ఇంత ధరకు సిలిండర్, టమాటాలు కొనాల్సిరావడంతో ఆగ్రహంతో ప్రజల ముఖాలు ఎర్రబడిపోయాయి.
రాజస్తాన్ ప్రజలు ఈసారీ బీజేపీకి ఎర్రజెండానే చూపిస్తారు’ అని అన్నారు.‘ రాష్ట్రానికి విచ్చేసిన మీకు మూడునిమిషాల ప్రసంగం ద్వారా ఆహా్వనం పలికే అవకాశాన్ని పీఎంఓ కార్యాలయం తొలగించింది. అందుకే ఇలా ట్వీట్ ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నా’ అని గెహ్లాట్ ట్వీట్‌చేశారు. దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ‘కాళ్లకు గాయాల కారణంగా మీరు హాజరుకావట్లేరని మీ కార్యాలయం నుంచి సమాచారం వచి్చనందుకే షెడ్యూల్ మార్చాం. అయినా రావాలనుకుంటే ఇదే మా ఆహా్వనం. వచ్చేయండి’ అని పీఎంఓ తేలి్చచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment