Financial resources
-
అల్పాదాయ దేశాలకు ఆర్థిక వనరులు అందించాలి
న్యూఢిల్లీ: సాంకేతిక సహాయం, ఇతరత్రా సర్వీసుల ద్వారా అల్పాదాయ సభ్య దేశాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా తోడ్పాటు అందించాలని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌కి (ఏఐఐబీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించే విధానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్‌లో ఏఐఐబీ బోర్డు గవర్నర్ల 9వ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంక్ ప్రెసిడెంట్ జిన్ లికున్‌తో భేటీ సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మైక్రో బ్లాగింగ్ సైటు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రుణ కార్యకలాపాలను ఏఐఐబీ వేగవంతంగా విస్తరించిందని మంత్రి ప్రశంసించారు. అలాగే సంస్థ గవర్నెన్స్ ప్రమాణాలు పాటించడంలోను, వృద్ధి సాధనలోను భారత్ కీలకపాత్ర పోషిస్తోందని బ్యాంకు తెలిపింది. మరోవైపు, ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీతో కూడా సీతారామన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఏఐఐబీలో భారత్ రెండో అతి పెద్ద వాటాదారు, అతి పెద్ద క్లయింట్‌గాను ఉంది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక వనరులను అందించే బహుళపక్ష డెవలప్మెంట్ బ్యాంకుగా, బీజింగ్ కేంద్రంగా ఏఐఐబీ ఏర్పడింది. ఇందులో చైనాకు అత్యధికంగా 2,97,804 షేర్లు ఉండగా, భారత్‌కు 83,673 షేర్లు ఉన్నాయి. -
‘రెడ్ డైరీ’ కాంగ్రెస్‌ను ముంచేస్తుంది
సికార్(రాజస్తాన్): రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అక్రమ, ఆర్థిక లావాదేవీల చిట్టా ఈ ‘రెడ్ డైరీ’లో ఉందంటూ బహిష్కృత మంత్రి రాజేంద్ర గుఢా చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ వంతపాడారు. ఈ ఆరోపణలకు దేశవ్యాప్తంగా 1.25 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితంచేసే కార్యక్రమం వేదికగా నిలిచింది. సికార్‌లో జరిగిన ఈ వేడుకలో ఇంకొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘ బ్రిటిష్ వారు దేశాన్ని వదిలివెళ్లిపోవాలని గాం«దీజీ ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇవ్వాల్సిన నినాదం ‘అవినీతి క్విట్ ఇండియా, వారసత్వం క్విట్ ఇండియా, బుజ్జగింపు క్విట్ ఇండియా’. కాంగ్రెస్ వారి కొల్లగొట్టే దుకాణంలో కొత్త సరుకే ఈ ‘రెడ్ డైరీ’. గెహ్లాట్ సర్కార్ పేపర్ లీక్ పరిశ్రమను నడుపుతోంది. కాంగ్రెస్ వారి అవినీతి రహస్యాలు అందులో దాగిఉన్నాయి. ఆ అవినీతి ఈసారి ఎన్నికల్లో వారిని ఓటమిపాలుచేయనుంది’ అని మోదీ అన్నారు. ‘ రెడ్‌డైరీ పేజీలు తెరిస్తే చాలా మంది పెద్ద తలకాయల బండారాలు బయటపడతాయని ప్రజలే చెబుతున్నారు’ అని ఆరోపించారు. పేరు మార్చి ఏమార్చి.. ‘ఇందిరాగాంధీ హయాంలో ఇందిరనే ఇండియా, ఇండియానే ఇందిర’ అని ప్రజల్ని ఏమార్చారు. తర్వాత యూపీయేనే ఇండియా, ఇండియానే యూపీయే’ అని మభ్యపెట్టారు. బ్రిటిష్ సంస్థకు ఇండియా పదాన్ని జోడించి దేశంలో అడుగుపెట్టి దోచుకున్న ఈస్టిండియా కంపెనీ సంగతి తెల్సిందే. ఇండియా పేరున్న సిమీపై నిషేధం విధించాక ఎఫ్‌పీఐ పేరిట మళ్లీ ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఇప్పుడు కాంగ్రెస్, దాని జట్టు పారీ్టలు ఇదే ఎత్తుగడతో తమ కూటమికి ఇండియా అని పేరుపెట్టుకున్నాయి’ అని మోదీ ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మోదీ పర్యటించడం గత ఆరునెలల్లో ఇది ఏడోసారి కావడం గమనార్హం. ‘ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతో విపక్షాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి’ అని గుజరాత్‌లోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయిన రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారం¿ోత్సవంలో మోదీ విమర్శించారు. గెహ్లాట్ ‘ఎరుపు’ దాడి మోదీ విమర్శలపై సీఎం గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. ‘ఎరుపు(రెడ్) డైరీ ఊహాత్మకం. వాస్తవానికి అలాంటిది లేదు. మాజీ మంత్రిని పావుగా వాడి రాజకీయం చేస్తున్నారు. నిజానికి అదొకటి ఉంటే మీ చేతిలో కీలుబొమ్మలైన ఈడీ, ఐటీ, సీబీఐలు ఎందుకు ఇంతవరకు దాని వివరాలు తెల్సుకోలేకపోయారు? ఎర్ర సిలిండర్(ఎలీ్పజీ సిలిండర్) ఏకంగా రూ.1,150కి విక్రయిస్తూ అసలైన దోపిడీకి పాల్పడింది మోదీనే. ఎర్ర టమాటాలు రూ.150 పైగా ఎగబాకడానికి మీరే కారణం. ఇంత ధరకు సిలిండర్, టమాటాలు కొనాల్సిరావడంతో ఆగ్రహంతో ప్రజల ముఖాలు ఎర్రబడిపోయాయి. రాజస్తాన్ ప్రజలు ఈసారీ బీజేపీకి ఎర్రజెండానే చూపిస్తారు’ అని అన్నారు.‘ రాష్ట్రానికి విచ్చేసిన మీకు మూడునిమిషాల ప్రసంగం ద్వారా ఆహా్వనం పలికే అవకాశాన్ని పీఎంఓ కార్యాలయం తొలగించింది. అందుకే ఇలా ట్వీట్ ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నా’ అని గెహ్లాట్ ట్వీట్‌చేశారు. దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ‘కాళ్లకు గాయాల కారణంగా మీరు హాజరుకావట్లేరని మీ కార్యాలయం నుంచి సమాచారం వచి్చనందుకే షెడ్యూల్ మార్చాం. అయినా రావాలనుకుంటే ఇదే మా ఆహా్వనం. వచ్చేయండి’ అని పీఎంఓ తేలి్చచెప్పింది. -
పటిష్ట ఆర్థిక వనరులపై దృష్టి
ముంబై: మునిసిపల్ కార్పొరేషన్లు (ఎంసీ) తమ ఆర్థిక వనరులను పెంచుకోవడానికి వినూత్న రీతిలో వివిధ బాండ్, ల్యాండ్ ఆధారిత ఫైనాన్సింగ్ యంత్రాంగాలను అన్వేషించాల్సిన అవసరం ఉంద ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. ఆస్తిపన్ను వసూళ్లు, ప్రభుత్వ ఉన్నత శ్రేణుల నుండి పన్నులు, గ్రాంట్ల పంపిణీ మునిసిపల్ కార్పొరేషన్ల ఆదాయాలకు ప్రస్తుతం ప్రధా న వనరులు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ అంశాల కు సంబంధించి ఎంసీలకు ఆర్థిక స్వయంప్రతిపత్తి కొరవడిందని ఈ అంశంపై విడుదల చేసిన నివేదిక పేర్కొంది. భారతదేశంలోని మునిసిపల్ బడ్జెట్ల పరిమాణం ఇతర దేశాల్లోని కార్పొరేషన్లతో పోల్చి తే చాలా తక్కువగా ఉందని కూడా సూచించింది. అన్ని రాష్ట్రాల్లోని 201 ఎంసీల బడ్జెట్ డేటా సంకలనం, విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ‘మునిసిపల్ కార్పొరేషన్ల కోసం ప్రత్యామ్నాయ వనరుల’ థీమ్‌గా ఈ నివేదిక రూపొందింది. నివేదికలో మరికొన్ని అంశాలు పరిశీలిస్తే.. ► వివిధ ఆదాయాలు, వ్యయ అంశాలపై ఎంసీలు సరైన పర్యవేక్షణ, డాక్యుమెంటేషన్‌తో మంచి, పారదర్శకమైన అకౌంటింగ్ పద్ధతులను అవలంబించాలి. తమ వనరులను పెంచుకోవడానికి విభిన్న వినూత్న బాండ్, భూమి ఆధారిత ఫైనాన్సింగ్ విధానాలను అన్వేషించాలి. ► తమ వనరుల లోటును పూడ్చుకోడానికి పలు ఎంసీలు బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రుణాలపై ఆధారపడుతున్నాయి. మునిసిపల్ బాండ్ల వంటి పటిష్ట మార్కెట్ నుంచి నిధుల సమీకరణ పరిస్థితులు లేని లోటు ఇక్కడ కనిపిస్తోంది. ► వ్యవస్థీకృత, పాలనా వ్యయాలు, వడ్డీ, ఫైనాన్స్ చార్టీల రూపంలో వ్యయాలు పెరుగుతున్నాయి. మూలధన వ్యయం తక్కువగా ఉంటోంది. ► 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎంసీల రెవెన్యూ వ్యయాలు–మూలధన వ్యయాల నిష్పత్తి 2.4 శాతం. కేంద్రం విషయంలో 7.1 శాతం, రాష్ట్రాల విషయంలో 5.9 శాతంగా ఈ నిష్పత్తులు ఉన్నాయి. ► మునిసిపల్ కార్పొరేషన్ల పరిమాణం, జనాభా సాంద్రత, సొంత రాష్ట్ర ప్రభుత్వ వ్యయ స్వభావం వంటి వివిధ అంశాలు దేశంలోని మునిసిపల్ కార్పొరేషన్ల వ్యయాలను ప్రభావితం చేస్తున్నాయి. ► 2017–18లో ఎంసీల రాబడి (స్వంత పన్ను రాబడి, స్వంత పన్నుయేతర ఆదాయం, ప్రభుత్వాల నుంచి బదిలీ అయిన మొత్తం) జీడీపీలో 0.61 శాతంగా అంచనా. అయితే ఇది 2019–20లో కేవలం 0.72 శాతానికి ఎగసింది. ► అధ్యయన కాలంలో ఎంసీల మొత్తం ఆదాయంలో ఆస్తిపన్ను, నీటి పన్ను, టోల్ పన్ను, ఇతర స్థానిక పన్నులు 31–34% శ్రేణిలో ఉన్నాయి. ► ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్‌లలోని ఎంసీలు దేశంలోని ఇతర ఎంసీలతో పోలిస్తే అధిక పన్నులను వసూళ్లు జరుపుతున్నాయి. ఈ విషయంలో రాష్ట్రాల మధ్య అధిక వ్యత్యాసం కనిపిస్తోంది. -
ఆ విధానాలను అధ్యయనం చేయండి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సమీక్ష చేపట్టారు. అదనపు ఆదాయాలకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎస్ఓఆర్(రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలన్నారు. తద్వారా రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని.. వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి దృష్టిపెట్టాలని సీఎం పేర్కొన్నారు. ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖలకు చెందిన అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని సీఎం పేర్కొన్నారు. చదవండి: కడప జిల్లా పర్యటనకు సీఎం జగన్.. ముమ్మర ఏర్పాట్లు ‘‘ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలి. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలి. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్ఓపీలను పాటించాలి. పెండింగ్‌లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలి. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి... తగిన మార్పులు, చేర్పులు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగుచూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించకూడదు. ఆ మేరకు పటిష్టమైన ఎస్ఓపీలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలకు భారీ లబ్ధి: ►ఉచితంగా రిజిస్ట్రేషన్లు వల్ల భారీగా పేదలకు భారీగా లబ్ధి చేకూరిందన్న అధికారులు ►ఓటీఎస్ పథకం ద్వారా, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు ఇప్పటివరకూ రూ.400.55 కోట్ల లబ్ధి చేకూరిందన్న అధికారులు ►టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్ల రూపేణా పేదలకు మరో రూ.1230 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్న అధికారులు ►గతంలో ఎన్నడూకూడా ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో పేదలకు ఇంతటి ప్రయోజనం జరగలేదన్న అధికారులు -
మౌలిక వసతుల రంగానికి కేంద్రం పెద్ద పీట
-
10 శాతంపై ఇక లెక్క.. పక్కా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మొండికేసిన రియల్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం పైచేయి సాధించింది. లేఅవుట్లలో పది శాతం ఖాళీ స్థలాలను పంచాయతీలకు బదలాయించకుండా అట్టిపెట్టుకున్న జాగాలను ఎట్టకేలకు స్వాధీనం చేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో ఏకంగా రూ.5 వేల కోట్ల విలువైన భూములను తన అధీనంలోకి తెచ్చుకుంది. ఇప్పటి వరకు 1,764.07 ఎకరాలను గుర్తించిన యంత్రాంగం.. వీటిపై యాజమాన్య హక్కులు పొందే దిశగా అడుగులు వేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించి.. ఏదేనీ వెంచర్/లేఅవుట్ అభివృద్ధి చేస్తే మొత్తం విస్తీర్ణంలో పది శాతం ఓపెన్ ఏరియాను స్థానిక గ్రామ పంచాయతీకి తప్పనిసరిగా అప్పగించాలి. ఈ స్థలాన్ని గిఫ్ట్ డీడ్ రూపేణా రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే, ఈ నిబంధన క్షేత్రస్థాయిలో అమలవ్వడం లేదు. లేఅవుట్లలో ఖాళీ స్థలంగా పేర్కొన్న జాగాలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకూడదనే ఆంక్షలు ఉన్నప్పటికీ రియల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా వీటిని అమ్మేస్తున్నారు. ఈ స్థలాలను కాపాడాల్సిన పంచాయతీ కార్యదర్శులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో వీటికి రెక్కలొస్తున్నాయి. ఇలా ఎక్కడికక్కడ భూములను కొల్లగొడుతుండటంతో నగరీకరణ నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న కాలనీల్లో పచ్చదనం లేకుండా పోతోంది. ప్రజావసరాలకే ఉపయోగించాలి హెచ్ఎండీఏ లేదా డీటీసీపీ లేఅవుట్ల ప్లాన్లలో పది శాతం భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరత్రా అవసరాలకు వినియోగించరాదు. ఒకవేళ భూ వినియోగ మార్పిడి జరగాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ స్థలంలో పచ్చదనం లేదా సామాజిక అవసరాలకు అది కూడా కలెక్టర్ ఆమోదంతో చేపట్టాలి. అయితే, ఇవేవీ పట్టించుకోని వ్యాపారులు వీటిని కూడా అమ్మేస్తున్నారు. నగర శివార్లలో భూముల విలువలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో కారుచౌకగా లభించే ఈ స్థలాలను ల్యాండ్ మాఫియా కొట్టేస్తోంది. మరోవైపు కొన్ని చోట్ల ఈ స్థలాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో ఇలా కైంకర్యమవుతున్న స్థలాలను కాపాడాలని భావించిన జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి.. లేఅవుట్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తద్వారా రియల్టర్ల కబంధ హస్తాల్లో చిక్కుకున్న వేలాది ఎకరాలకు విముక్తి కల్పించారు. భారీగా భూ నిధి.. పది శాతం స్థలాలపై పట్టు బిగించిన జిల్లా యంత్రాంగం.. ఇందులో 837 ఎకరాలను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది. జిల్లావ్యాప్తంగా భారీగా ల్యాండ్ బ్యాంక్(భూ నిధి)ను సమకూర్చుకున్న పంచాయతీలకు భవిష్యత్తులో ప్రజావసరాలకు సరిపడా స్థలాలు దక్కాయి. కాగా, విలువ ప్రకారం చెప్పుకుంటే రాజేంద్రనగర్‌లో అత్యంత ఖరీదైన స్థలాలు గ్రామ పంచాయతీల వశమయ్యాయి. ఈ మండలంలో ఏకంగా 97 ఎకరాలు సేకరించిన అధికారగణం.. వీటి ఖరీదు రూ.1,400 కోట్లపైనే ఉంటుందని లెక్కగట్టింది. మహేశ్వరంలో స్వాధీనం చేసుకున్న 440 ఎకరాల విలువ దాదాపు రూ.450 కోట్లు ఉంటుందని అంచనా వేస్తోంది. ఇదిలావుండగా, అక్రమ లేఅవుట్లు పుట్టుకురాకుండా చర్యలు తీసుకుంటోంది. పంచాయతీల వారీగా భూ రికార్డులను తయారు చేస్తోంది. పార్కులుగా అభివృద్ధి చేస్తాం సేకరించిన స్థలాలను పార్కులుగా అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే 1.95 లక్షల మొక్కలు నాటాం. ఆర్థిక వనరులు బాగా ఉన్న గ్రామాల్లో ఆ స్థలాలకు ప్రహరీలు నిర్మిస్తున్నాం. ఇంకా స్థలాలు అప్పగిం చని, అమ్ముకున్నట్లు తేలిన రియల్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. – డీపీవో పద్మజారాణి -
స్వచ్ఛభారత్ కోసం పన్నులు!
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్‌ను సమర్థవంతంగా అమలుచేసేందుకు అవసరమయ్యే ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు పెట్రోల్, డీజిల్, టెలికం సర్వీసుల వంటివాటిపై సెస్ వసూలు చేయాలని నీతి ఆయోగ్ పరిధిలో ఏర్పాటైన స్వచ్ఛభారత్ మిషన్ సబ్‌గ్రూప్ కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను సబ్ గ్రూప్ కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమ్రంతి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రధాని నరేంద్రమోదీకి సమర్పించారు. సిఫారసులపై ప్రజెంటేషన్ ఇచ్చారు. స్వచ్ఛ్భారత్ పని కష్టమైనదైనప్పటికీ అసాధ్యమేమీ కాదని మోదీ ఈ సందర్భంగా అన్నారు. నివేదికలోని ప్రధాన సిఫారసులు * ప్రజల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై సానుకూల అలవాట్లను ప్రోత్సహించాలి. ఇందుకు వీలుగా మిషన్‌లో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్(ఐఈసీ) అనే అంశం కింద నిధులను కేటాయించాలి. * పరిశుభ్రతపై పాఠశాలలు, కాలేజీల్లో పాఠ్యప్రణాళికలు ఉండాలి. విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచాలి. * ఈ మిషన్ కింద కేంద్ర, రాష్ట్రాల వాటా 75ః25 నిష్పత్తిలో ఉండాలి. ఆర్థిక వనరుల సమీకరణకు బాండ్లను జారీ చేయాలి. * ఆర్థిక వనరుల కోసం పెట్రోల్, డీజిల్, టెలికం సర్వీసులపై, ఖనిజ వ్యర్థాలను వెలువరించే ప్రాజెక్టులపై సెస్ వేయాలి. రసాయన ఎరువులపై సబ్సిడీ తగ్గించాలి. సేంద్రియ ఎరువులపై సబ్సిడీ పెంచాలి. * ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని(పీపీపీ) ఆకర్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలి. ఇందులో భాగంగా వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి ప్లాంట్లను నెలకొల్పాలి. * పంచాయతీలు, మండలాలు, బ్లాకుల మధ్య పోటీతత్వం పెరిగేందుకు ఆర్థిక ప్రోత్సహకాలు ఇవ్వాలి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న సాయాన్ని రూ. 15,000 లకు పెంచాలి. బాబును కలిసిన కేజ్రీవాల్ స్వచ్ఛభారత్ మిషన్ నివేదిక సిఫార్సులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఏపీభవన్‌లో ఆయన చంద్రబాబును కలిశారు. నవంబరు 22న ఢిల్లీలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి చంద్రబాబును ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. -
స్మార్ట్ సిటీల్లో యూజర్ చార్జీలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీల పథకానికి ఆర్థిక వనరుల కోసం ఆ సిటీల్లో యూజర్ చార్జీలను వసూలు చేయనున్నారు. ఈ దిశగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని జీవన విధానాన్ని మెరుగుపర్చడం కోసం వీటిని సిద్ధం చేస్తున్న ఆ శాఖ అధికారులు వెల్లడించారు. స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపికైన నగరంలో 24 గంటలు కరెంటు సరఫరా చేయడానికి నిర్వహణ ఖర్చుల కింద యూజర్ చార్జీలు వసూలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ ఫర్ రెజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ (ఏఎంఆర్టీయూ) పథకం కింద వసతులు కల్పించాల్సి ఉంది. ఇప్పటికే దీనిపై అనేక వర్క్‌షాపులు నిర్వహించింది. ఈ నగరాల్లో నివసించే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు నీటి సరఫరా ఆధారిత టారిఫ్‌లతో మోడల్ డాక్యుమెంట్ తయారు చేసినట్లు సమాచారం. మోడల్ డాక్యుమెంట్లో పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్లకు భాగస్వామ్యం కల్పిస్తారు. మేయర్లు, మున్సిపల్ చైర్ పర్సన్లు, కమిషనర్లతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలందిస్తామన్నారు. మంచి సౌకర్యాలున్నప్పుడే ప్రజలు అభివృద్ధికి సహకరిస్తారని వివరించారు. -
ఇదేం ఆర్థిక క్రమశిక్షణ బాబూ?!
తాత్కాలిక కార్యాలయంలో సీసీ కెమెరాలకు రూ. 1.08 కోట్లు లేక్‌వ్యూ అతిథిగృహంలో ఏర్పాటుకు నేడో, రేపో ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన హైటెక్కు పాలన ఇంకా మరిచిపోలేదు. లోటు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చుకునే వరకు క్రమశిక్షణ పాటించాల్సిందేనంటూ జీవోలిచ్చిన టీడీపీ సర్కారు.. స్వీయ ఆచరణలో మాత్రం ఇవేవీ కానరావడం లేదు. చెట్ల కింద కూర్చొనైనా పాలన సాగిస్తామని చెప్తున్న చంద్రబాబు.. ఇప్పుడు తన కార్యాలయానికి హంగుల కోసం ఏకంగా కోట్లు కుమ్మరించేస్తున్నారు. తన తాత్కాలిక క్యాంపు కార్యాలయంగా వినియోగించుకుంటున్న లేక్‌వ్యూ అతిథిగృహానికి కేవలం సీసీ కెమెరాల ఏర్పాటు నిమిత్తమే ఏకంగా రూ. 1.08 కోట్లు వెచ్చించనున్నారు. ఇందుకు ఆర్థికశాఖ ఆమోదం కూడా పూర్తయింది. నిధుల మంజూరు వ్యవహారం ఆర్ అండ్ బీకి చేరింది. ఇందుకు సంబంధించి మంగళ, బుధవారాల్లో జీవో విడుదల కానుంది. రెండు నెలల్లో ఏపీ పాలన మొత్తం విజయవాడ నుంచే సాగుతుందని అటు మంత్రులు, ఇటు సీఎం సైతం ప్రకటనలు చేస్తున్నారు. తాత్కాలిక రాజధానిగా విజయవాడను ఎంపిక చేసినట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రభుత్వ విభాగాధిపతులు తమ కార్యాలయాల్ని తరలించాలని ఉన్నత స్థాయిలోనే సూచనలు అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలలు తాత్కాలిక కార్యాలయం కోసం ఇంత మొత్తంలో నిధుల వెచ్చింపుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.