illegal Business
-
డీజిల్ దందా అదుర్స్
-
విష సర్పాల వ్యాపారం గుట్టురట్టు.. 26 నాగుపాములు స్వాధీనం
భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా బలియాపాల్ తహసీల్ పంచుపాలి ప్రాంతంలో విష సర్పాల అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా అనుబంధ వర్గాలు చేపట్టిన దాడిలో ఈ ముఠా వ్యవహారం బట్టబయలైంది. అటవీ శాఖ అధికారులు ఆకస్మికంగా చేపట్టిన దాడుల్లో బుధవారం 26 నాగుపాములను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు తెలిపారు. బాలాసోర్ జిల్లా లంగేశ్వర్ అటవీ కార్యాలయానికి సమీపంలో ని ఈ అక్రమ వ్యాపార శిబిరం కొనసాగడం సంచలనం రేపింది. బాలాసోర్ అటవీ విభాగం మరియు స్నేక్ హెల్ప్‌లైన్ వర్గాలు ఉమ్మడిగా ఈ శిబిరంపై దాడి చేశాయి. పట్టుబడిన ముఠాలో ఉన్న దంపతు లు అంతర్ రాష్ట్ర రాకెట్‌ను నడుపుతున్నట్లు తేలింది. పలు ప్రాంతాలకు తరలింపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పాములను సేకరించి వాటి విషాన్ని తీసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు స్నేక్ హెల్ప్‌లైన్ కార్యదర్శి సువేందు మల్లిక్ మీడియాతో మాట్లాడారు. నాగుపాముల అక్రమ వ్యాపారం (స్మగ్లింగ్) గురించి విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. సమాచారం అందడంతో తక్షణమే భువనేశ్వర్ నుంచి తెల్లవారు జామున 3 గంటలకు బయల్దేరి విష సర్పాల అక్రమ వ్యాపార శిబిరానికి చేరినట్లు వివరించారు. విషయం స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారన్నారు. వీరి ఆధ్వర్యంలో జరిగిన దాడిలో 26 నాగుపాములకు స్వేచ్ఛ కల్పించి నట్లు పేర్కొన్నారు. పాములను రంధ్రాలతో ప్ర త్యేకంగా రూపొందించిన ప్లాస్టిక్ కంటైనర్లలో అక్రమార్కులు బందీచేసి ఉంచినట్లు దృష్టికి వచ్చిందన్నారు. ఈ వ్యవహారంలో మరింత మంది వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపా రు. దర్యాప్తు కొనసాగుతోందని బాలాసోర్ అటవీ విభాగం ఏసీఎఫ్ శోభన్ చాంద్ వెల్లడించారు. -
‘రెడ్ డైరీ’ కాంగ్రెస్‌ను ముంచేస్తుంది
సికార్(రాజస్తాన్): రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అక్రమ, ఆర్థిక లావాదేవీల చిట్టా ఈ ‘రెడ్ డైరీ’లో ఉందంటూ బహిష్కృత మంత్రి రాజేంద్ర గుఢా చేసిన ఆరోపణలకు ప్రధాని మోదీ వంతపాడారు. ఈ ఆరోపణలకు దేశవ్యాప్తంగా 1.25 పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలను జాతికి అంకితంచేసే కార్యక్రమం వేదికగా నిలిచింది. సికార్‌లో జరిగిన ఈ వేడుకలో ఇంకొన్ని అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘ బ్రిటిష్ వారు దేశాన్ని వదిలివెళ్లిపోవాలని గాం«దీజీ ‘క్విట్ ఇండియా’ పిలుపునిచ్చారు. ఇప్పుడు ఇవ్వాల్సిన నినాదం ‘అవినీతి క్విట్ ఇండియా, వారసత్వం క్విట్ ఇండియా, బుజ్జగింపు క్విట్ ఇండియా’. కాంగ్రెస్ వారి కొల్లగొట్టే దుకాణంలో కొత్త సరుకే ఈ ‘రెడ్ డైరీ’. గెహ్లాట్ సర్కార్ పేపర్ లీక్ పరిశ్రమను నడుపుతోంది. కాంగ్రెస్ వారి అవినీతి రహస్యాలు అందులో దాగిఉన్నాయి. ఆ అవినీతి ఈసారి ఎన్నికల్లో వారిని ఓటమిపాలుచేయనుంది’ అని మోదీ అన్నారు. ‘ రెడ్‌డైరీ పేజీలు తెరిస్తే చాలా మంది పెద్ద తలకాయల బండారాలు బయటపడతాయని ప్రజలే చెబుతున్నారు’ అని ఆరోపించారు. పేరు మార్చి ఏమార్చి.. ‘ఇందిరాగాంధీ హయాంలో ఇందిరనే ఇండియా, ఇండియానే ఇందిర’ అని ప్రజల్ని ఏమార్చారు. తర్వాత యూపీయేనే ఇండియా, ఇండియానే యూపీయే’ అని మభ్యపెట్టారు. బ్రిటిష్ సంస్థకు ఇండియా పదాన్ని జోడించి దేశంలో అడుగుపెట్టి దోచుకున్న ఈస్టిండియా కంపెనీ సంగతి తెల్సిందే. ఇండియా పేరున్న సిమీపై నిషేధం విధించాక ఎఫ్‌పీఐ పేరిట మళ్లీ ఉగ్రవాదులు దాడులకు దిగారు. ఇప్పుడు కాంగ్రెస్, దాని జట్టు పారీ్టలు ఇదే ఎత్తుగడతో తమ కూటమికి ఇండియా అని పేరుపెట్టుకున్నాయి’ అని మోదీ ఆరోపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మోదీ పర్యటించడం గత ఆరునెలల్లో ఇది ఏడోసారి కావడం గమనార్హం. ‘ప్రజల ఆకాంక్షలు నెరవేరడంతో విపక్షాలు ఆగ్రహంతో ఊగిపోతున్నాయి’ అని గుజరాత్‌లోని తొలి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అయిన రాజ్‌కోట్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారం¿ోత్సవంలో మోదీ విమర్శించారు. గెహ్లాట్ ‘ఎరుపు’ దాడి మోదీ విమర్శలపై సీఎం గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. ‘ఎరుపు(రెడ్) డైరీ ఊహాత్మకం. వాస్తవానికి అలాంటిది లేదు. మాజీ మంత్రిని పావుగా వాడి రాజకీయం చేస్తున్నారు. నిజానికి అదొకటి ఉంటే మీ చేతిలో కీలుబొమ్మలైన ఈడీ, ఐటీ, సీబీఐలు ఎందుకు ఇంతవరకు దాని వివరాలు తెల్సుకోలేకపోయారు? ఎర్ర సిలిండర్(ఎలీ్పజీ సిలిండర్) ఏకంగా రూ.1,150కి విక్రయిస్తూ అసలైన దోపిడీకి పాల్పడింది మోదీనే. ఎర్ర టమాటాలు రూ.150 పైగా ఎగబాకడానికి మీరే కారణం. ఇంత ధరకు సిలిండర్, టమాటాలు కొనాల్సిరావడంతో ఆగ్రహంతో ప్రజల ముఖాలు ఎర్రబడిపోయాయి. రాజస్తాన్ ప్రజలు ఈసారీ బీజేపీకి ఎర్రజెండానే చూపిస్తారు’ అని అన్నారు.‘ రాష్ట్రానికి విచ్చేసిన మీకు మూడునిమిషాల ప్రసంగం ద్వారా ఆహా్వనం పలికే అవకాశాన్ని పీఎంఓ కార్యాలయం తొలగించింది. అందుకే ఇలా ట్వీట్ ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నా’ అని గెహ్లాట్ ట్వీట్‌చేశారు. దీనిపై ప్రధాని కార్యాలయం స్పందించింది. ‘కాళ్లకు గాయాల కారణంగా మీరు హాజరుకావట్లేరని మీ కార్యాలయం నుంచి సమాచారం వచి్చనందుకే షెడ్యూల్ మార్చాం. అయినా రావాలనుకుంటే ఇదే మా ఆహా్వనం. వచ్చేయండి’ అని పీఎంఓ తేలి్చచెప్పింది. -
అక్రమ వ్యాపారాలకు కేరాఫ్ అచ్చెన్న అనుచరుడు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా పలు అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తూ పబ్బం గడుపుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అనుచరుడు కోరాడ సుబ్రహ్మణ్యం తాజాగా తన కారుకు నకిలీ పోలీసు నేమ్ బోర్డు పెట్టుకుని తిరుగుతూ ఒడిశా పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కోరాడ సుబ్రహ్మణ్యం కింజరాపు అచ్చెన్నాయుడికి ప్రధాన అనుచరుడు. ఈయన కొత్తపల్లిలో ఇనుము, సిమెంట్ వ్యాపారం చేస్తుంటాడు. చదవండి: ఆర్బీకేలు అద్భుతం.. వినూత్నం.. ఆసియా దేశాల ప్రతినిధులు ప్రశంసలు దీంతో పాటు ఫెర్టిలైజర్స్ డీలర్షిప్ ఉంది. ఒడిశా ప్రాంతం నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తుంటాడనే ఆరోపణలున్నాయి. టీడీపీ హయాంలో ఒడిశా నుంచి సిమెంట్, ఎరువులు, విత్తనాలను ఎటువంటి పత్రాలు లేకుండా లారీల్లో దిగుమతి చేస్తుండేవాడన్న వాదనలున్నాయి. 2021 ఆగస్టులో సుబ్రహ్మణ్యం గోడౌన్‌పై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్కడ ఈ–వే బిల్లులు లేకుండా ఒడిశా నుంచి సిమెంట్ రవాణా చేసినట్లు గుర్తించి రూ.48 వేల జరిమానా విధించారు. అలాగే సిమెంట్ అక్రమ నిల్వలున్నాయన్న సమాచారంతో గోడౌన్లో దాడులు నిర్వహించగా అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 122 యూరియా బస్తాలు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా.. ఏపీ 39 ఎల్డబ్ల్యూఎస్ 123 నంబర్ గల కారుకు పోలీసు నేమ్ బోర్డు పెట్టుకుని ఒడిశాలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో ఇటీవల యథేచ్ఛగా తిరుగుతున్నాడు. దీంతో బరంపురం పోలీసులకు అనుమానం వచ్చి ఆయనను విచారించడంతో నకిలీ పోలీసు నేమ్‌బోర్డు వ్యవహారమని తేలింది. దీంతో ప్రాథమిక విచారణలో భాగంగా ఈ నెల 2వ తేదీన వాహనాన్ని సీజ్ చేసి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించారు. 417, 419, 464 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడ్డగోలు వ్యాపారాల కోసమే ఒడిశాకు వెళ్లారని, ఎవరూ తమను అడ్డుకోరాదనే ఉద్దేశంతోనే పోలీసు నేమ్ బోర్డు పెట్టుకుని తిరుగుతున్నారని వాదనలు విన్పిస్తున్నాయి. -
అక్రమ వాణిజ్యం, ప్రభుత్వానికి రూ.58,521 కోట్ల నష్టం!
న్యూఢిల్లీ: అక్రమ వాణిజ్యం కారణంగా పెద్ద ఎత్తున పన్ను ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అక్రమ వాణిజ్యం కారణంగా రూ.58,521 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్టు వాణిజ్య మండలి ఫిక్కీ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, మొబైల్ ఫోన్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం రంగాల్లో అక్రమ వాణిజ్యాన్ని ప్రస్తావించింది. ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం 2019–20లో రూ.2.60 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిక్కీ అంచనా వేసింది. ఇందులో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల టర్నోవర్ 75 శాతంగా ఉంటుందని తెలిపింది. అక్రమ వాణిజ్యం కారణంగా ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ పరిశ్రమలో రూ.17,074 కోట్లు, ఆల్కహాల్ ఉత్పత్తుల వల్ల రూ.15,262 కోట్లు, పొగాకు ఉత్పత్తుల వల్ల రూ.13,331 కోట్లు, ఎఫ్ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్ గూడ్స్ విభాగంలో రూ.9,995 కోట్లు, మొబైల్ ఫోన్లలో రూ.2,859 కోట్ల మేర పన్ను నష్టం వాటిల్లినట్టు వెల్లడించింది. ‘అక్రమ మార్కెట్లు.. జాతి ప్రయోజనాలకు విరుద్ధం’ పేరుతో ఫిక్కీ ఈ నివేదికను తీసుకొచ్చింది. పొగాకు ఉత్పత్తులు, మద్యం ఉత్పత్తుల రూపంలో ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున పన్ను ఆదాయం వస్తుంటుంది. వీటిపై నియంత్రణలు కూడా ఎక్కువే కావడం గమనార్హం. అక్రమ వాణిజ్యం వల్ల ఖజానాకు కలిగిన నష్టంలో సగం పొగాకు, మద్యం ఉత్పత్తుల నుంచే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఉపాధికీ నష్టమే.. ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమలో అక్రమ వాణిజ్యం కారణంగా 7.94 లక్షల మంది ఉపాధికి నష్టం వాటిల్లింది. పొగాకు పరిశ్రమలో 3.7 లక్షల మంది, ఎఫ్ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్ గూడ్స్ పరిశ్రమలో 2.98 లక్షల మంది, ఆల్కహాల్ బెవరేజెస్‌లో 97,000 మంది, మొబైల్ ఫోన్ పరిశ్రమలో 35,000 మంది అక్రమ వాణిజ్యం కారణంగా ఉపాధి కోల్పోయారు. ‘‘ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే ఇతర రంగాలతో ఈ రంగాలకు అనుబంధం ఉండడం వల్లే’’అని ఫిక్కీ నివేదిక వివరించింది. తయారీని బలోపేతం చేయడం, అసలైన ఉత్పత్తులకు సంబంధించి డిమాండ్–సరఫరా మధ్య అంతరం లేకుండా చూడడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం, పన్ను టారిఫ్‌ల క్రమబద్ధీకరణ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం.. అక్రమ వాణిజ్య నిరోధానికి అవసరమని ఫిక్కీ నివేదిక సూచించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
'చిరుద్యోగి నుంచి ఏడాదికి రూ.20కోట్ల టర్నోవర్‌కు'
సాక్షి, నెల్లూరు(క్రైమ్): గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. వ్యాపారంలోని మెళకువలు నేర్చుకున్నాడు. ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని సాగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో పోలీసులు గ్యాంగ్‌సభ్యులను అరెస్ట్ చేసినా మూలాల్లోకి వెళ్లకపోవడంతో అతని వ్యవహారం బయటకు పొక్కలేదు. అదేక్రమంలో కొందరు పోలీసుల అండదండలు సైతం పుష్కలంగా ఉండటంతో మూడు గుట్కాలు, ఆరు ఖైనీలు అన్నచందాన వ్యాపారం సాగింది. అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా ఎదిగి చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పోలీసుల కథనమ మేరకు బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన అంజిబాబు ఉపాధి నిమిత్తం కొన్నేళ్లకిందట కటుంబంతో కలిసి చెన్నైకి వెళ్లాడు. అక్కడ ఉంటూనే ఓ గుట్కా తయారీదారుని వద్ద చిరుద్యోగిగా చేరారు. తనకున్న తెలివితేటలతో వ్యాపారాన్ని ఏపీలోని పలు జిల్లాలకు విస్తరింపజేశాడు. వ్యాపారంలో చురుకుగా ఉన్న వారితో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. చెన్నైతో పాటు ఢిల్లీ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా, ఖైనీలను వారికి సరఫరా చేసేవాడు. వారు వాటిని రిటైల్ వ్యాపారులకు విక్రయించేవారు. చెన్నైలో పోలీసుల దాడులు అధికమవడంతో పాటు వివిధ కారణాతో ఆయన తన మకాంను బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియాకు మార్చాడు. అక్కడ ఉంటూ ఆరేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఏడాదికి రూ.20కోట్ల మేర గుట్కాలను గ్యాంగ్‌కు సరఫరాచేసి వారి ద్వారా రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తూ అంతర్రాష్ట్ర గుట్కా డాన్‌గా ఎదిగారు. కొంతకాలంగా గంజాయిని సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్పీ భాస్కర్‌భూషణ్ గుట్కా విక్రయాలను, అక్రమరవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఐ. శ్రీనివాసన్ నేతృత్వంలోని సిబ్బంది డాన్‌తో పాటు అతని గ్యాంగ్ కదలికలపై దృష్టిసారించారు. శనివారం నేలటూరులో అంజిబాబుతో పాటు, గ్యాంగ్‌లోని ఐదుగురు సభ్యులను అరెస్ట్‌చేశారు. వారి వద్ద నుంచి రూ.1.32కోట్లు విలువచేసే గుట్కాలు, వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. అనంతరం వారిని రహస్యప్రాంతానికి తరలించి తమదైన శైలిలో విచారించగా విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమ వ్యాపారానికి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని నిందితులు ఆరోపించినట్లు తెలిసింది. అందుకు గాను సదరు పోలీసులకు నెలవారీ నజరానాలు ముట్టచెబుతున్నామని పేర్కొనట్లు తెలిసింది. ఈ విషయం ఎస్పీ భాస్కర్‌భూషణ్ దృష్టికి వెళ్లడంతో లోతైన దర్యాప్తు చేయాలని, అక్రమాలకు సహకరిస్తున్న వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆదిశగా టాస్క్ఫోర్సు పోలీసులు విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు పేర్లను సైతం ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిసింది. పరారీలో మరికొందరు గ్యాంగ్‌లో మరో 18మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. డాన్‌ను టాస్‌్కఫోర్సు పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే సమాచారం తెలుసుకున్న గ్యాంగ్‌లోని సభ్యులు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. పరారీలో ఉన్న వ్యక్తుల్లో కొందరు గతంలో పోలీసులకు చిక్కిజైలుపాలై ఉన్నారు. వ్యాపారుల్లో వణుకు... పోలీసుల దాడుల నేపథ్యంలో జిల్లాలో గుట్కా, ఖైనీ విక్రయ వ్యాపారుల వెన్నులో వణుకు మొదలైంది. మొత్తంమీద ఆరేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్రాష్ట్ర గుట్కాడాన్, అతని గ్యాంగ్‌లోని సభ్యులను అరెస్ట్ చేయడంతో కొంతకాలం ఈ అక్రమవిక్రయాలు, రవాణాకు అడ్డుకట్టపడనుంది. గ్యాంగ్‌లోని మిగిలిన సభ్యులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ భాస్కర్‌భూషణ్ తెలిపారు. -
టీడీపీ నేత.. జీడిపిక్కల దందా
రణస్థలం: విజిలెన్స్ అధికారులకు గతంలో ఒకమారు పట్టుబడినా ఓ టీడీపీ నాయకుడి వక్ర బుద్ధి మారలేదు. దర్జాగా తన అక్రమ వ్యాపార దందా సాగిస్తున్న అతడిపై గట్టిగా నిఘా పెట్టి మరోమారు దాడుల అస్త్రం ప్రయోగించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 1,876 జీడిపిక్కల బస్తాలు బయటపడ్డాయి. మొత్తం 93 టన్నులున్న వీటి విలువ మార్కెట్లో దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రణస్థలం మండలం కోష్ట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పిషిణి జగన్నాథం ఏడెనిమిది ఏళ్లుగా జీడిపిక్కల వ్యాపారం చేస్తున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలిచ్చి అక్రమంగా జీడిపిక్కల గొడౌన్ ఏర్పాటు చేశాడు. ఇందుకు తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటూ దర్జాగా లాభాలు ఆర్జిస్తున్నాడు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించలేదు. అప్పట్లో ఓ మంత్రి అండదండలు కూడా ఈయనకు పుష్కలంగా ఉండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో గత జూన్‌లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, అదే నెలలో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. దాదాపు లక్ష రూపాయల వరకు జరిమానా విధించారు. అయినా పద్ధతి మారకపోవడంతో ఇతని బాగోతంపై విజలెన్స్ అధికారులు మరోమారు పక్కా నిఘా పెట్టి శుక్రవారం ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సిబ్బంది, ఏఎంసీ సెక్రటరీ చిన్నికృష్ణ, గ్రామ రెవెన్యూ అధికారి ఎల్వీ అప్పలనాయుడు ఉన్నారు. ఏ ఒక్కటికీ అనుమతి లేదు.. దీనిపై జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ అప్పలనాయుడు మాట్లాడుతూ మొత్తం స్వాధీనం చేసుకున్న సరుకుకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని పేర్కొన్నారు. కనీసం వ్యవసాయ మార్కెట్ కమిటీకి పన్నులు కూడా చెల్లించలేదన్నారు. జీడి పిక్కల నిల్వ ఉంచేందుకు గొడౌన్‌కు సంబంధించి ఎటువంటి అనుమతి పత్రాలు కూడా ప్రభుత్వం నుంచి పొందలేదని తెలిపారు. స్వాధీనం చేసుకున్న సరుకును శనివారం లావేరు మండలం బెజ్జిపురం వ్యవసాయ మార్కెట్‌కు తరలించామన్నారు. -
‘రైస్ పుల్లర్స్’ మాయగాడు అరెస్టు
సాక్షి, కొందుర్గు: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగంలోనైనా కష్టపడి పనిచేస్తేనే తప్పా జీవనం సాగించేది కష్టంగా మారింది. కానీ సంపాదనకు ఓ రాజామార్గం ఉందని, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే వారంలో కోటి రూపాయలు సంపాదించవచ్చని అమాయకులను నమ్మించి మోసం చేసి రూ.కోట్లు గడించిన ఓ మాయగాడు గురువారం జిల్లేడ్‌చౌదరిగూడ పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా వీరబల్లి మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములుగౌడ్ తన చిన్నతనంలో కుటుంబాన్ని విడిచి కేరళ వెళ్లాడు. మతం మార్చుకొని రెహమాన్ సాబ్‌గా పేరు మార్చుకొని ఎత్తి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ జాతకరాళ్ల వ్యాపారం చేసేవాడు. అతడి కూమారుడు మహ్మద్ ఆసిఫ్ తన మామ స్వగ్రామం వరంగల్ వచ్చి సెంటు, అల్వా బిజినెస్ చేసేవాడు. అనంతర జాతకరాళ్ల వ్యాపారం చేసేవాడు. కాలక్రమేణ హైదరాబాద్ బహద్దూర్‌పూరాలో సూర్యప్రకాష్ అనే వ్యక్తితో ఆసిఫ్‌కు పరిచయం ఏర్పడింది. అతడి సలహా మేరకు పాతకాలం లోహపుకాయిన్ వస్తువులకు అతీతమైన శక్తి ఉంటుందని, దీంతో అపారంగా సంపాదించవచ్చని భావించారు. ఈ లోహపు వస్తువే రైస్ పుల్లర్‌గా చలామణి చేస్తూ రైస్ పుల్లర్‌తో కోట్ల రూపాయలు సంపాదించవచ్చని ఎందరో వ్యక్తులను నమ్మించి వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ మోసం చేయడం మొదలెట్టాడు. ఇదే క్రమంలో జిల్లేడ్‌చౌదరిగూడ మండలం పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి ఇతడి వలలోపడి ఉన్న భూమిని తాకట్టుపెట్టి లక్షలు నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు, ముంబాయి, బెంగళూర్, తదితర ప్రాంతాల్లోని ఎందరో అమాయకులు ఇతడి వలలో పడి మోసపోయారు. మంత్రులు, ఐఏఎస్ అధికారులు కూడా ఇతడి మాయలోపడ్డారంటే అతిశయోక్తిలేదు. ఇతడి మాయమాటలు నమ్మి మోసపోయిన వారంతా మహ్మద్ ఆసిఫ్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేశారు. ఇతడి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాలో రూ. 60,20,73,000 జమచేయడం జరిగిందని షాద్‌నగర్ రూరల్ సీఐ రామకృష్ణ గురువారం విలేకరులకు వెల్లడించారు. ఐదు పోలీసుస్టేషన్లలో కేసులు.. నిందితుడు మహమ్మద్ ఆసిఫ్‌పై ఇప్పటికే జిల్లేడ్ చౌదరిగూడతో పాటు షాద్‌నగర్, షాబాద్, కడప, బాలానగర్ పోలీస్ స్టేషన్లలో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. పద్మారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కక్కులూర్ అనంతస్వామి, ఎల్కగూడెం భూపాల్‌రెడ్డి, షాద్‌నగర్ వెంకటేష్, హేమాజీపూర్ శంకర్, షాద్‌నగర్ మారుతి, నాగప్ప, జైపాల్‌రెడ్డి, మాణిక్యం, అన్వర్, జడ్చర్ల శ్రీనివాసురెడ్డి, కాటేదాన్ కుమారస్వామి తదితరులు ఆసిఫ్‌ను నమ్మి మోసపోయినవారే. ఎట్టకేలకు చిక్కిన నిందితుడు.. జిల్లేడ్‌చౌదరిగూడ పోలీసులు 2018 జనవరి 8న ఇతడిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఇతడి కోసం గాలింపులు చేపట్టారు. కానీ, ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు గురువారం నిందితుడు పట్టుకున్నారు. పద్మారం గ్రామానికి చెందిన భూపాల్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి వద్దకు మహ్మద్ ఆసిఫ్ వెళ్తుండగా లాల్‌పహాడ్ వద్ద పోలీసులకు చిక్కినట్లు సీఐ రామకృష్ణ వెల్లడించారు. నిం దితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతడు ఇంతకాలం అమాయకులను నమ్మించి మోసం చేసి సంపాదించిన డబ్బుతో లగ్జరీ జీవితం గడిపాడని, ఎలాంటి స్థిరాస్తులు లేవని, ఇతడిపై పీడీయాక్ట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. -
బినామీ డీలర్ల బియ్యం దందా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బినామీ రేషన్ డీలర్ల హవా కొనసాగుతోంది. వివిధ కారణాలతో ఖాళీ అయిన రేషన్ డీలర్ల స్థానాలను భర్తీ చేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుపడుతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సొంత జిల్లా గుంటూరులోనే 310 మంది బినామీ డీలర్లు ఉండడం గమనార్హం. బినామీ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిని తొలగించి, రెగ్యులర్ డీలర్లను నియమించాలని కలెక్టర్ల సదస్సులో పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి బి.రాజశేఖర్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బినామీలను పక్కనపెట్టి, రెగ్యులర్ డీలర్లను నియమించేందుకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల అనుచరులే బినామీ డీలర్ల అవతారం ఎత్తారు. సబ్సిడీ బియ్యం అక్రమ వ్యాపారంలో కొందరు తెలుగు తమ్ముళ్లకు నేరుగా భాగస్వామ్యం ఉండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. బినామీ డీలర్లు రేషన్ దుకాణాల్లోనే లబ్ధిదారుల నుండి సబ్సిడీ బియ్యాన్ని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వ్యాపారులు ఆ బియ్యాన్ని పాలిష్ చేసి, అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందాలో ఎవరికి దక్కాల్సిన వాటాలు వారికి దక్కుతున్నాయి. విదేశాలకు తరలుతున్న సబ్సిడీ బియ్యం రాష్ట్రంలో 1.44 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డుదారులు ఉన్నారు. ప్రతినెలా రెండు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం రేషన్‌కార్డుదారులకు సరఫరా చేస్తోంది. ఇందులో ప్రతినెలా 50 వేల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యాన్ని బినామీ రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు సబ్సిడీ బియ్యానికి పాలిష్ చేసి, మళ్లీ మార్కెట్లోకి తెచ్చి కిలో రూ.45 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. కొందరు వ్యాపారులు సబ్సిడీ బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా సబ్సిడీ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
ప్రైవేటు కనికట్టు.. ఇంటర్ బోర్డు తాకట్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డును ఓ ప్రైవేటు సంస్థకు తాకట్టు పెట్టారు. అధికారులు, ప్రైవేటు సంస్థ ప్రతినిధులు కుమ్మక్కై బోర్డు అధికారిక వెబ్సైట్ నుంచే వ్యాపారానికి దారులు వేశారు. విద్యార్థుల వేలి ముద్రలు సేకరించే బయోమెట్రిక్ మెషీన్ల విక్రయాలకు బోర్డు వెబ్సైట్ ద్వారానే రాచబాట వేసి భారీగా దండుకుంటున్నారు. అసలు అవసరమే లేని.. ఒక్కోటి రూ.2 వేల విలువైన బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు వెబ్సైట్ ద్వారా రూ.5 వేల చొప్పున కాలేజీలతో వేలాదిగా కొనుగోలు చేయించారు. అన్నీ అడ్డగోలు వ్యవహారాలే.. ఏటా 10 లక్షల మంది విద్యార్థుల సమాచారం, అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాల వెల్లడి వంటి వ్యవహారాలను ఇంటర్ బోర్డు సొంతంగా చేసుకునేలా ఓ సాఫ్ట్వేర్ సంస్థకు వచ్చిన ఆలోచనను అధికారులు ఆచరణలో పెట్టారు. తమకు భారీగా కమీషన్లు వస్తాయని ఉద్దేశంతో ఓకే చెప్పేశారు. ఇందులో భాగంగా విద్యార్థుల డేటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్ పనులను సదరు సంస్థకు అప్పగించారు. ఏటా రూ.20 లక్షలే ఆ పనులకు ఖర్చవుతున్నా.. సదరు సంస్థ రూ.4.5 కోట్లతో ఇచ్చిన ప్రతిపాదనలకు అనుమతిచ్చేశారు. డేటా ప్రాసెస్ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) నుంచి తొలగించి ఆ సంస్థకు అప్పగించారు. పనులు దక్కించుకున్న సదరు సంస్థ తమ పనితీరును నిరూపించుకునేందుకు డేటా, రిజల్ట్స్ ప్రాసెసింగ్ టెస్టింగ్‌ను ఉచితంగా చేయాలి. కానీ అధికారులు టెస్టింగ్ కోసం కూడా రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే టెస్టింగ్ ఏమైందో ఎవరికీ తెలియదు. ఒకటి తేలకుండానే ఇంకోటి.. టెస్టింగ్ ప్రాసెస్ తేలకముందే ఇంటర్ బోర్డు అదే సంస్థకు మరో పని అప్పగించింది. 2018–19కి సంబంధించి విద్యార్థుల ప్రవేశాలు, డేటా క్యాప్చర్ వంటి పనులను అప్పగించింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్లైన్ చేసేందుకు సదరు సంస్థ చర్యలు చేపట్టింది. సాఫ్ట్వేర్ లేకపోవడం, ప్రోగ్రాం సరిగ్గా రూపొందించుకోని కారణంగా వీటిని సక్రమంగా చేయలేకపోయింది. సీజీజీ నుంచి గత ఏడాది ఆన్లైన్ ప్రవేశాల ప్రాసెస్ ప్రోగ్రాం మోడల్స్ తెచ్చుకొని కొంత మేర ఆన్లైన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే అదీ కూడా సరిగ్గా చేయలేదు. ప్రభుత్వ కాలేజీల్లో రీ అడ్మిషన్లు, 37 వేల మంది సీబీఎస్ఈ విద్యార్థుల ప్రవేశాలు, ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి వెళ్లే విద్యార్థుల ప్రవేశాలు ఆన్లైన్ చేయలేకపోయింది. ప్రైవేటు కాలేజీల విద్యార్థుల ఆన్లైన్ ప్రవేశాలను ప్రాసెస్ చేయలేదు. మరో 30 రోజులు గడువు కావాలని కోరింది. దీంతో ఇంటర్ బోర్డు.. ప్రవేశాల వ్యవహారాలను తిరిగి సీజీజీకి అప్పగించింది. ప్రభుత్వ విధానాన్ని అడ్డుపెట్టుకొని.. విద్యార్థులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని, ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందే వారికే తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బయోమెట్రిక్ మెషీన్లను బోర్డు కొనుగోలు చేసింది. దీన్ని అడ్డుపెట్టుకొని సదరు సంస్థ రంగంలోకి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ మెషీన్లు కొనుగోలు చేయాలని కాలేజీలకు ఆ సంస్థ సమాచారం పంపింది. కాలేజీల సమాచారం ఆ సంస్థకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు అర్థం కావడం లేదు. ఆ సమాచారమంతా ఇంటర్ బోర్డు, సీజీజీ, ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ వద్దే ఉంది.ఆ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థనే కాలేజీల సమాచారాన్ని బయోమెట్రిక్ మెషీన్ల కంపెనీకి ఇచ్చి ఉంటుందని బోర్డు అధికారు లు అనుమానిస్తున్నారు. బోర్డు వెబ్సైట్లో (http:// acad.tsbie.telangana.gov.in) కాలేజీలు లాగి న్ అయ్యాక.. ‘మెషీన్లను బోర్డు గుర్తించింది. వాటినే కొనుగోలు చేయాలి’ అని కనిపించేలా మార్పులను ఆ ప్రైవేటు సంస్థే చేసిందని భావిస్తున్నారు. భారీ కుట్ర! బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే బయోమెట్రిక్ మెషీన్లను కొనుగోలు చేయాలనే పేజీ కనిపించదు. కాలేజీ యాజమాన్యాలు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తో వెబ్సైట్లో లాగిన్ అయ్యాక మాత్రం ప్రత్యేకంగా ఓ పేజీనే ప్రత్యక్షమయ్యేలా కుట్రపన్నారు. పైగా అవి బోర్డు ధ్రువీకరించిన మెషీన్లని, వాటిని కొనుగోలు చేయాలంటూ వెబ్సైట్లోనే మార్పులు చేసి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇలా ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ సంస్థ చేసిన మోసంతో యాజమాన్యాలు మెషీన్లను కొనుగోలు చేసి నష్టపోయా యి. రూ.కోట్ల వ్యవహారంలో బోర్డు అధికారులు కమీషన్ల రూపంలో భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో రహస్యంగా ఉండాల్సిన విద్యార్థుల సమాచారా న్ని, బోర్డు ఆన్లైన్ వ్యవహారాలను కనీస గోప్యత పాటించని సంస్థకు అప్పగించడం వెనుక భారీ కుట్ర ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థ మెషీన్ కొనుగోలు పేజీ -
గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల హస్తం!
చింతూరు: ఒడిశా నుంచి తెలంగాణకు లారీలో తరలిస్తున్న గంజాయి లోడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని రత్నాపురం గ్రామంలో ఆదివారం రోజు తనిఖీలు చేసిన పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,125 కిలోల గంజాయితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 63.70 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ రవాణకు సహకరిస్తున్న ఓ సీఐ, కానిస్టేబుల్ పై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. ఒడిశా నుంచి తెలంగాణకు భారీగా గంజాయి తరలించడానికి సహకరించిన మారేడుమిల్లి సీఐ అంకబాబుతో పాటు కానిస్టేబుల్ సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు చింతూరు ఓఎస్డీ డాక్టర్ కే. ఫకీరప్ప విలేకరులకు తెలిపారు. -
కళ్లెం ఎక్కడ?
* ఆగని ఇసుక అక్రమ రవాణా * సీఎం నివాసం సమీపంలోనే తవ్వకాలు * కూలీల స్థానంలో యంత్రాలతో తోడేస్తున్న వైనం * అధికారుల దాడులను లెక్కచేయని ఇసుకాసురులు * చక్రం తిప్పుతున్న ఓ ప్రజాప్రతినిధి సోదరుడు సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని పరిధిలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. సీఎం నివాసం సమీపంలోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. కూలీలతో అయితే తవ్వకాలు ఆలస్యమవుతున్నాయని యంత్రాలను రంగంలోకి దించారు. తాత్కాలిక సచివాలయం పేరుతో రాత్రింబవళ్లూ ఇసుక తోడేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు తరలించి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. నెలవారీ మామూళ్లు తీసుకుని అధికారులు అటువైపు వెళ్లడం లేదు. ఎప్పుడైనా వెళ్తే అధికారి పార్టీ నేతలు మండిపడుతున్నారు. దీంతో చేసేదేమీ లేక వెనక్కి వెళ్లిపోతున్నారు. ఈ ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఆ మూడు రీచ్‌లలో అంతులేని అక్రమాలు.. తుళ్లూరు మండలంలోని బోరుపాలెం, లింగాయపాలెం, వెంకటపాలెం రీచ్‌లలో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఇసుక అక్రమంగా తవ్వేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు తాత్కాలిక సచివాలయం పేరుతో భారీ స్కెచ్ వేశారు. ఈ మేరకు రోజు బోరుపాలెం రీచ్ నుంచి వెయ్యికి పైగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. లింగాయపాలెం, వెంకటాయపాలెం రీచ్‌ల నుంచి మరో వెయ్యికి పైగా లారీల ఇసుక తవ్వేస్తున్నారు. ఈ మూడు రీచ్‌లలో సగటున నెలకు 60వేల లారీల ఇసుక తోడేస్తున్నారు. లారీ సామర్థ్యాన్ని బట్టి మూడు యూనిట్ల నుంచి ఆరు యూనిట్ల వరకు ఇసుక లోడ్ చేస్తారు. రోజుకు రెండు వేల లారీలకు సగటున 9 వేల యూనిట్ల ఇసుక తవ్వేస్తున్నారు. నెలకు 2.70 లక్షల యూనిట్ల ఇసుకను కృష్ణమ్మ గర్భం నుంచి తోడేస్తున్నారు. స్థానిక అవసరాలకు ఇంత భారీగా వినియోగిస్తారా.. అంటే అధికారులు సైతం సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలించే ఒక్కో లారీకి సామర్థ్యాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారు. రోజుకు రూ.75 లక్షల వరకు ఆర్జిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులకు నెలవారీ మాముళ్లు వెళ్తుండటంతో వారు అక్రమ రవాణాకు రెడ్ కార్పెట్ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలపై విమర్శలు వచ్చినప్పుడు, పత్రికల్లో వార్తలు ప్రచురించినప్పుడు మాత్రమే అధికారులు ఇసుక రీచ్‌లలో దాడులు చేసి 10 నుంచి 20 లారీలను పట్టుకున్నామని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. దాడులు చేసిన సమయంలో రాత్రిళ్లు ఇసుక తవ్వకాలు సాగించాలని అధికారులే సలహాలు ఇస్తున్నట్లు సమాచారం. ఒక్క రీచ్‌లో 400 లారీలు.. లింగాయపాలెం రీచ్‌కు శనివారం ‘సాక్షి’ ప్రతినిధి వెళ్లగా.. అక్కడ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. భారీ యంత్రాలతో వందలాది లారీలకు ఇసుక నింపుతున్నారు. సుమారు 400 లారీలకు యంత్రాలతో ఇసుక నింపటం కనిపించింది. ఇవన్నీ రాజధాని ప్రాంత అవసరాల కోసం తరలిస్తున్నాయా.. అని ఆరా తీస్తే.. సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఈ రీచ్ నుంచి నిత్యం 500కు పైగా లారీల్లో ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. లింగాయపాలెం రీచ్ వద్ద ఆందోళన.. లింగాయపాలేనికి చెందిన 150 మంది దళితులు క్వారీ అసోసియేషన్ పేరుతో రిజిష్టర్ చేయించుకుని రీచ్ వద్ద లోడింగ్ పనులు చేసుకుంటున్నారు. తాజాగా ఇసుక తవ్వకాలకు యంత్రాలను వినియోగించడతోపై రీచ్ వద్ద స్థానిక దళితులు శనివారం ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా కృష్ణమ్మను నమ్ముకోని జీవనం సాగిస్తున్న తమను పచ్చ నేతలు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తమ కూలీలను కాదని భారీ యంత్రాలతో ఇసుకు తొడేస్తూ ఆ రీచ్ వైపు రానివ్వకుండా చేస్తున్నారని వాపోయారు. కూలీలు ఆందోళన చేస్తుండగా, పోలీసులు వచ్చి సర్దిచెప్పి పంపించారు. -
'సాక్షి' కథనాలపై స్పందించిన చంద్రబాబు
విజయవాడ: ఇసుక అక్రమ రవాణాపై 'సాక్షి' టీవీ అందించిన కథనాలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు పోలీసు, రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమ దందా చేస్తున్న వారిపై శనివారం విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా లింగాయపాలెం, వెంకటపాలెం, మరికొన్ని ఇసుక రీచ్ లపై ఆకస్మిక దాడులు చేసి ఇసుక అక్రమంగా తరలిస్తున్న కొందరు వ్యక్తులను ఆరెస్ట్ చేసి, 20 ఇసుక లోడ్ లారీలను సీజ్ చేశారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ఇంటి పక్కనే జరుగుతున్న అక్రమ దందాను సాక్షి మీడియా బయటపెట్టిన విషయం తెలిసిందే. ఈ కథనాలపై స్పందించిన చంద్రబాబు ఇసుక అక్రమ దందాపై చర్యలకు ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న రీచ్ లపై పోలీసులు, రెవెన్యూ సిబ్బంది దాడులు కొనసాగుతున్నాయి. -
జర్నలిస్టుపై టీడీపీ నేత దౌర్జన్యం!
విశాఖపట్నం: విశాఖలో పచ్చ తమ్ముళ్లు దాష్టీకానికి పాల్పడుతున్నారు. విశాఖ జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో ఓ టీడీపీ నేత దౌర్జన్యానికి దిగాడు. స్థానిక చెరువులో మట్టి తవ్వి అక్రమంగా ఇసుక రవాణా వ్యాపారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన సాక్షి టీవీ ప్రతినిధి చెరువు దగ్గరికి వెళ్లి అక్కడ జరుగుతున్న అక్రమాలను చిత్రీకరించేందుకు యత్నించాడు. ఆగ్రహించిన టీడీపీ నేత అప్పలనాయుడు తన భాగోతాలను చిత్రీకరిస్తున్న జర్నలిస్టుపై దాడికి దిగి అతడ్ని గాయపరిచారు. తనపై టీడీపీ నేత అప్పలనాయుడు దాడికి పాల్పడ్డాడంటూ బాధిత విలేకరి గొలుగొండ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
రెండు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
చిత్తూరు(రామకుప్పం): రామకుప్పం మండలం పేరూరు వద్ద మంగళవారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న రెండు టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి కర్ణాటకకు వాహనంలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుప్పంలో జోరుగా అక్రమ వ్యాపారాలు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత నియోజక వర్గంలో భారీగా అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయి. సీఎం సొంత నియోజక వర్గం కావడంతో ఏమీ చేయలేమని అధికారులు అంటున్నారు. తెలుగు తమ్ముళ్లకు ఈ విషయంలో అదుపు లేకుండా పోయింది. ఇసుక నుంచి బియ్యం వరకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇదేంటని ఎదురు తిరిగిన అధికారులను ఇరుకున పెడుతున్నారు. -
మీడియా పేరుతో దందా
* రూ.20 వేలు తీసుకున్నారంటూ తాలూకా * పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఒంగోలు : ‘మీరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు.. మీ గుట్టు రట్టుచేస్తాం.. మిమ్మల్ని బజారుకీడుస్తాం.. మర్యాదగా రూ.40 వేలు ఇవ్వండి.. లేకుంటే జైలుకెళ్లక తప్పదు’... అని మీడియా పేరుతో ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. వారిదెబ్బకు బెంబేలెత్తి రూ.20 వేలు ముట్టజెప్పి బయటపడిన బాధితుడు శనివారం ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ సంఘటన తమ పరిధిలోది కాదని తాలూకా పోలీసులు స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందంటే... మూడు రోజుల క్రితం చీమకుర్తి మండలం గోగినేనివారిపాలెంలో ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఆ గ్రామం మొత్తానికి తెలిసినా పోలీసుల దృష్టికి మాత్రం రాలేదు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన డ్రైవర్ జె.శ్రీనుయాదవ్, క్లీనర్ షేక్ ఫజుల్లాలు ఒంగోలులోని ఓ డీజిల్ ట్యాంకర్‌కు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడురోజుల క్రితం స్థానిక సూరారెడ్డిపాలెం ఐవోసీ కార్యాలయం నుంచి ట్యాంకర్ ఆళ్లగడ్డకు బయలుదేరింది. సూరారెడ్డిపాలెం, ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, బేస్తవారిపేట, గిద్దలూరు మీదుగా ఆళ్లగడ్డ వెళ్లాల్సి ఉండగా, మెయిన్‌రోడ్డును వదిలి చీమకుర్తి మండలం గోగినేనివారిపాలెం చేరుకుంది. దందా ఇలా... ట్యాంకర్ దారితప్పిందని ముగ్గురు వ్యక్తులు గమనించారు. రెండు మోటారు బైకులపై నేరుగా గోగినేనివారిపాలెం చేరుకున్నారు. అక్కడ వీడియో కెమేరాలో షూట్చేస్తూ దందా ప్రారంభించారు. అక్రమ వ్యాపారం చేస్తున్నారని, జాతీయ చానళ్లలో చూపించాల్సి వస్తుందని డ్రైవర్, క్లీనర్లను బెదిరించారు. తాము భోజనం చేసేందుకు గ్రామంలో తమకు తెలిసిన చిన్నా ఇంటికి వచ్చామని డ్రైవర్ వారించినా వినిపించుకోలేదు. దీంతో చిన్నా అనే వ్యక్తి కల్పించుకుని దందా చేస్తున్న వారితో చర్చించారు. వారు రూ.40 వేలు డిమాండ్ చేయగా, రూ.20 వేలు ఇప్పించాడు. ప్రస్తుతం మరో రూ.5 వేలు కూడా ఇవ్వాలని డ్రైవర్‌కు ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో ట్యాంకర్ యజమాని దృష్టికి డ్రైవర్ తీసుకెళ్లాడు. సంబంధిత యజమాని ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనేక అనుమానాలు... ఈ సంఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్నా ఎవరు.? అతనికి, ట్యాంకర్ డ్రైవర్‌కు సంబంధం ఏంటి.? మీడియా పేరుతో ట్యాంకర్‌ను వెంబడించిన వారు ఎవరు.? నిజంగా మీడియాలో పనిచేసేవారేనే..కాదా..? వారు బెదిరిస్తే డబ్బు ఎందుకు ఇచ్చారు.? లాంటి ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ సమాధానం లేదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించాల్సిన పోలీసులు.. తమ పరిధిలోది కాదని చేతులెత్తేయడం పలు విమర్శలకు తావిస్తోంది. -
ఢూం..ఢాం!
జోరుగా టపాసుల జీరో దందా * అక్రమార్కులకు దీపావళే..! * సర్కార్ ఖజానాకు భారీ గండి * కళ్లుమూసుకున్న ఆ నాలుగు శాఖలు * చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రూ.కోట్లకు కోట్ల దీపావళి సరుకు దిగుతోంది. అంతా అక్రమ దందా... జీరో మాల్. ఈ మాల్‌ను పట్టుకోవడానికి మన అధికారులు మాటేశారు. అవి టపాసులు కదా..! కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతేదో కమ్ముకొచ్చింది. ఆ కాంతికే వాణిజ్య పన్నులు, పోలీసు, మన్సిపల్, అగ్నిమాక, రెవిన్యూ శాఖల అధికారుల కళ్లు మూతలు పడుతున్నాయి. కళ్లు నలుసుకొని తెరిచి చూసే సరికి కంటి ముందు నోట్ల కట్టలు. ఇంకేముందు సార్లకు కాళ్లు కదలట్లేదు. నోళ్లు పెగలట్లేదు. నోట్ల కట్టలు లెక్కపెట్టుకుంటూ జీరో మాల్‌ను వదిలేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు పన్ను రూపంలో వచ్చే రూ కోట్లకు గండి కొడుతున్నారు. ఆయన కన్ను గీటితే... దీపావళికి జిల్లాలో 2 వేల టపాసుల దుకాణాలు వెలుస్తాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో రూ.30 కోట్ల వ్యాపారం సాగుతుంది. ఇదంతా అనధికారిక లెక్క. జీరో దందా. జిల్లా వాణిజ్య పన్నుల శాఖ, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు కళ్లు మూసుకోవడంతో సాగుతున్న అక్రమ వ్యాపారం. అలాగని చిన్నా చితక చిల్లర కొట్టు వ్యాపారులు లాభపడుతున్నది లేదు. ఒకే ఒక వ్యాపారి గుప్పిట్లోనే ఈ దందా నడుస్తోంది. రామచంద్రాపురానికి చెందిన ఈ వ్యాపారి కన్ను గీటితే... వాణిజ్య పన్నులు, పోలీసు, మన్సిపల్, అగ్నిమాపక శాఖల అధికారులు కళ్లు మూసుకుంటున్నారు. సంగారెడ్డి, మెదక్, పటాన్చెరు, జహీరాబాద్, అందోల్, సదాశివపేట, సిద్దిపేట, నారాయణఖేడ్ పట్టణాల్లో దుకాణాల లెసైన్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ అధికారులు అనుమతులు ఇవ్వకుండా హోల్‌సేల్ వ్యాపారి అడ్డుకుంటున్నాడు. వాస్తవానికి పటాన్చెరు,సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట పట్టణాల్లో టపాసులకు మంచి గిరాకీ ఉంటుంది. అందుకే ఇక్కడ వందల్లో దుకాణాలు వెలుస్తాయి. కానీ ఒక్క దుకాణానికి కూడా లెసైన్స్ ఉండదు. అక్రమ దందా దీపావళి పండగ సందర్భంగా టపాసులు విక్రయించాలనుకునేవారు దుకాాణాల ఏర్పాటుకు పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆధారంగానే రెవెన్యూ శాఖ అధికారులు (జిల్లా కలెక్టర్) క్యాజువల్ ట్రేడ్ లెసైన్సులు జారీ చేస్తారు. కానీ జిల్లాలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న దుకాణాల్లో కొన్నింటికి మాత్రమే లెసైన్సులు ఉంటాయి. మిగతా వాటికి లెసైన్సులు తీసుకోకుండానే నిర్వహిస్తారు. తెచ్చిన సరుకుకు లెక్కాపత్రం ఉండదు. టకాపాయల అమ్మకాలను బట్టి వాణిజ్య పన్నుల శాఖకు 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ. 4 కోట్ల వరకు వాణిజ్య పన్నుల రూపంలో ఆదాయం రావాల్సి ఉంది, కానీ రూ. 4 లక్షల ఆదాయం కూడా సమకూరటం లేదు. నో అబ్జెక్షన్తోనే సరి దుకాణదారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌తోనే వ్యాపారం కొనసాగిస్తున్నారు. నిజానికి ఇలా అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలపై నాలుగు శాఖల అధికారులు ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ వాటిని నియంత్రించాల్సి ఉంటుంది. కానీ ఏ అధికారి కూడా వారి వైపు కన్నెత్తి చూడడం లేదు. కారణం ఏమిటంటే అక్రమ వ్యాపారం సక్రమంగా సాగేందుకు ప్రతి దుకాణానికి రూ.25 వేలు వసూలు చేసి అధికారుల జేబులు నింపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వంలోనైనా అధికారులు టపాసుల వ్యాపారంపై వచ్చే వాణిజ్య పన్నుల మీద దృష్టిపెడితే భారీగా ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చే అవకాశం ఉంది. -
బ్లాక్ మార్కెట్ నిజరూపాన్ని బయటపెట్టండి
విశాఖ పర్యటనలో అభిమానులకు పవన్ కల్యాణ్ పిలుపు విశాఖపట్నం సిటీ: సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుందామనుకునే అక్రమ వ్యాపారస్తుల నిజరూపాన్ని బయటపెట్టాలని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు బుధవారం విశాఖలోని ఫిషింగ్ హార్బర్, పెదజాలారీ పేటల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కష్టకాలంలో ఉన్నపుడు ప్రజలకు సేవ చేయాలేగానీ ధరలు పెంచి దోపిడీ చేయడం మహా పాపం అన్నారు. నిత్యావసరాలను అక్రమ మార్గాలకు మళ్లించొద్దని అలాంటివి చేస్తే అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తుపాను బాధితుల కష్టాలను ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
బెల్టు తీస్తారా!
బెల్టు దుకాణాల రద్దుకు అడ్డంకులెన్నో - నాలుగు రోజుల్లో ఏడు కేసులతో సరి - ఎక్సైజ్ శాఖలో వాహనాల కొరత - అద్దె వాహనాలకు 16 నెలలుగా అందని బిల్లులు కర్నూలు: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రుణమాఫీపై మెలిక పెట్టి తన నైజాన్ని చాటుకున్నాడు. అదే రోజు బెల్టు దుకాణాల రద్దు ఫైల్‌పై సంతకం చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ అధికారులకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సంపూర్ణ మద్యాపానాన్ని విధిస్తే..ఆయన దగ్గర నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు మద్యాపాన నిషేదాన్ని ఎత్తివేసి వీధివీధికి బెల్టు షాపు వెలిసేలా చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెల్టు దుకాణాలను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం జీవో జారీ చేసి నాలుగు రోజులు గడిచినా ఇప్పటి వరకు నందికొట్కూరులో 2, ఎమ్మిగనూరులో 2.. కర్నూలు, కోసిగి, కోడుమూరులో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే కేసులు నమోదయ్యాయి. వేధిస్తున్న వాహనాలు, సిబ్బంది కొరత.. ఎక్సైజ్‌శాఖలో వాహనాలు, సిబ్బంది కొరత వేధిస్తోంది. మద్యం అక్రమ వ్యాపారంపై నిఘాకు ఈ శాఖలో డీటీఎఫ్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు అత్యంత కీలకం. ఈ విభాగాలకు సంబంధించిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించేందుకు అవసరమైన సంఖ్యలో వాహనాలు లేకపోవడంతో వీరి పనితీరు నామమాత్రమవుతోంది. డీటీఎఫ్‌లో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌తో పాటు సీఐ, ఎస్ఐ, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు పని చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో ఏఈఎస్ పోస్టు ఏడాది నుంచి ఖాళీగా ఉంది. ముగ్గురు ఎస్ఐలకు గాను ఇద్దరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఐదుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 18 మంది కానిస్టేబుళ్లు ఉండగా.. ఒక్క వాహనమే గతి. కర్నూలు ఎక్సైజ్ పరిధిలో 13, నంద్యాల ఎక్సైజ్ పరిధిలో 10 అద్దె వాహనాలను అధికారులు వినియోగిస్తున్నారు. వీటికి నెలకు కనీసం రూ.6 లక్షలు చొప్పున 16 నెలలకు సంబంధించి ప్రభుత్వం దాదాపు కోటి రూపాయలు బకాయి పడింది. ఈ కారణంగా అద్దె వాహనాల వినియోగానికి ఎక్సైజ్ శాఖ అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో రూ.5 లక్షల బడ్జెట్ విడుదలైనా అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో నిధులు వెనక్కి మళ్లింది. బెల్టు దుకాణాల తనిఖీకి వెళ్లాలంటే రోజూ కనీసం రూ.2 వేలకు పైగా ఖర్చవుతుందని అధికారుల అంచనా. వాహనానికి డీజిల్, డ్రైవర్ బత్తా, వెంట వచ్చిన సిబ్బందికి భోజనం ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో అధికారులు తనిఖీలంటేనే జంకుతున్నారు. మారిన వేళలు.. ఎక్సైజ్ అధికారులు తనిఖీలకు వస్తారనే భయంతో జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న బెల్టు దుకాణాదారులు సమయపాలన మార్చుకున్నారు. గతంలో రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగ వ్యాపారం సాగింది. ప్రస్తుతం దాడులు ముమ్మరం చేయడంతో కర్నూలు చుట్టూ ఉన్న పడిదెంపాడు, మునగాలపాడు, భూపాల్‌నగర్, ఆర్.కొంతలపాడు, సుంకేసుల, ఎదురూరు, ఉల్చాల, దిగువపాడు, పూడూరు, గొందిపర్ల గ్రామాల్లో బెల్టు దుకాణాల ద్వారా రాత్రి వేళల్లో బెల్టు షాపులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.