న్యూఢిల్లీ: ఐఎస్ ఏజెంట్లు, ద్రోహులు జాతీయవాదుల ముసుగులో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రపన్నుతున్నారని పరోక్షంగా బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కుల, మత ప్రాతిపదికన భారత్‌లో చీలికలు సృష్టిస్తున్న కాషాయ పార్టీ...దేశాన్ని విభజించాలన్న పాకిస్తాన్ కలను తన మూడేళ్ల పాలనలోనే నిజం చేసిందని ఎద్దేవా చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఐదో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘పాకిస్తాన్, ఐఎస్‌లు 70 ఏళ్లలో చేయలేని దాన్ని బీజేపీ మూడేళ్లలోనే చేసి చూపించింది. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టి భారత్‌ను విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విచ్ఛిన్న భారత్ కాక పాక్‌కు ఉన్న పెద్ద లక్ష్యం మరేంటి?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment