
పాక్‌పై నటి రమ్య పొగడ్తలు !
మాజీ పార్లమెంటు సభ్యురాలు, శాండిల్‌వుడ్ నటి రమ్య పాకిస్తాన్‌ను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
రాజుకుంటున్న వ్యాఖ్యలు
బెంగళూరు : మాజీ పార్లమెంటు సభ్యురాలు, శాండిల్‌వుడ్ నటి రమ్య పాకిస్తాన్‌ను మెచ్చుకుంటూ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వివరాలు... నటి రమ్య పాకిస్తాన్‌లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో మండ్యలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...‘ పాకిస్తాన్‌కు వెళితే నరకానికి వెళ్లినట్లు అని రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్ పేర్కొనడం సరికాదు.
మనం ఇక్కడ ఎలా నివసిస్తున్నామో అక్కడి ప్రజలు కూడా అలాగే నివశిస్తున్నారు. అది చాలా మంచి దేశం. అక్కడి వెళ్లిన వారిని చాలా బాగా చూసుకున్నారు.’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల పట్ల రాష్ట్ర బీజేపీతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.