ప్రకటించిన మ్యాట్ గెయిట్జ్
వాషింగ్టన్: అమెరికా తదుపరి అటార్నీ జనరల్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎంపికచేసిన రిపబ్లికన్ నేత మ్యాట్ గెయిట్జ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 2017–2020కాలంలో పలు డ్రగ్స్–సెక్స్ పార్టీలు నిర్వహించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 42 ఏళ్ల మ్యాట్ అత్యంత కీలకమైన పదవికి అనర్హుడంటూ ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయనే స్వయంగా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.
అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎంపికచేయగా పదవి చేపట్టకముందే గెయిట్జ్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం.‘‘ట్రంప్ రెండోదఫా సుపరిపాలనకు నా నియామకం పెద్ద అవరోధంగా మారకూడదు. ట్రంప్ ప్రభుత్వం కొలువుతీరిన మొదటి రోజు నుంచే అద్భుతంగా పాలించాలి. అందుకే నేను ఉపసంహరణకే మొగ్గుచూపా’అని గెయిట్జ్ గురువారం ప్రకటించారు. సెనేట్‌లోని సొంత రిపబ్లికన్ పార్టీ సభ్యులే గెయిట్జ్‌కు మద్దతు పలకలేదని తెలుస్తోంది.
తీరా సెనేట్‌లో ఓటింగ్‌వేళ మెజారిటీ ఓట్లు పడకపోతే అవమానభారంతో వెనుతిరిగేబదులు ముందే తప్పుకుంటే మంచిదని గెయిట్జ్ భావించారని అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. అమెరికా పార్లమెంట్ దిగువసభలో సభ్యుడైన గెయిట్జ్ ఇటీవల అటార్నీ జనరల్‌గా నామినేషనల్ సాధించడంతో గత వారమే తన సభ్యత్వానికి రాజీనామా చేశారు.
గెయిట్జ్‌పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారించి నివేదిక సిద్ధంచేసింది. గతంలో డ్రగ్స్–సెక్స్ పారీ్టలో 17 ఏళ్ల టీనేజీ బాలికతో శృంగారం జరిపాడని గెయిట్జ్‌పై ఆరోపణలున్నాయి. వీటిని ఆయన కొట్టిపారేశారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వంలో నూతన అటార్నీ జనరల్‌గా ట్రంప్ ఎవరిని ఎంపికచేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. మెరుపువేగంతో నూతన నియామకాలు చేపట్టేబదులు ట్రంప్ సంయమనంతో స్రత్పవర్తన గల నేతలనే కీలక పదవులకు ఎంపిక చేస్తే మంచిదని సెనేట్‌లో రిపబ్లికన్ సభ్యుడు సింథియా లూమిస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment