‘మత హింస’ అమిత్‌ షా లక్షణం | BJP VS Congress now turned into CM Siddaramaiah VS Amit Shah | Sakshi
Sakshi News home page

‘మత హింస’ అమిత్‌ షా లక్షణం: సిద్ధరామయ్య

Published Mon, Feb 5 2018 3:57 AM | Last Updated on Mon, May 28 2018 3:58 PM

BJP VS Congress now turned into CM Siddaramaiah VS Amit Shah - Sakshi

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాపై విమర్శల తీవ్రతను పెంచారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం అమిత్‌ షాకు ఉన్న లక్షణమని సిద్ధరామయ్య ఆదివారం నాడిక్కడ విమర్శించారు. ‘కర్ణాటకలో మత హింసను రెచ్చగొట్టే చర్యల్ని మేం ఎంతమాత్రం అనుమతించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని సిద్ధరామయ్య హెచ్చరించారు. ‘ప్రధాని మోదీ కర్ణాటకకు వచ్చి మత ఉద్రిక్తతల్ని రెచ్చగొడుతున్నారని నేను చెప్పడం లేదు. అది అమిత్‌ షాకు ఉన్న లక్షణం. అది తప్ప షాకు మరొకటి తెలీదు. మత హింసనే అతను రాజకీయ వ్యూహంగా భావిస్తాడు’ అని విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement