డ్రగ్స్‌ రహిత దేశమే లక్ష్యం..   | Amit Shah Says Aiming For A Drug Free Country | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత దేశమే లక్ష్యం..  

Published Sat, Mar 25 2023 2:52 AM | Last Updated on Sat, Mar 25 2023 2:52 AM

Amit Shah Says Aiming For A Drug Free Country - Sakshi

సాక్షి బెంగళూరు/అమరావతి: డ్రగ్స్‌ రహిత దేశమే లక్ష్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. జాతీయ భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రాంతీయ సదస్సు శుక్రవారం బెంగళూరులోని ఒక ప్రైవేటు హోటల్‌లో జరిగింది. అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు ఐదు దక్షిణాది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందన్నారు. సమాజానికి ప్రమాదకరంగా మారిన ఈ డ్రగ్స్‌ మాఫియాకు అడ్డుకట్టవేయాలని.. ఇందుకు అన్ని రాష్ట్రాలు, ప్రజలు సహకరించాలని కోరారు. కేంద్రం డ్రగ్స్‌ నియంత్రణకు కదం తొక్కుతోందన్నారు. గత ప్రభుత్వాలు డ్రగ్స్‌ నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాయని.. అందువల్లే ప్రస్తుతం అవి విస్తరించాయని ఆరోపించారు. మన పిల్లలను డ్రగ్స్‌ మహమ్మారి నుంచి రక్షించుకోవాల్సి ఉందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని సూచించారు.

డ్రగ్స్‌ నియంత్రణకు కఠిన చట్టాలు, శిక్షలు ఉండాలని చెప్పారు. అలాగే ఎన్‌డీపీఎస్‌ చట్టాన్ని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్‌ నియంత్రణ కోసం కేంద్రం గతేడాది జూన్‌ 1 నుంచి 75 రోజుల పాటు దేశవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు నిర్వహించిందని గుర్తు చేశారు. డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి వెళుతున్నాయనే విషయంపై దర్యాప్తు జరగాలన్నారు. ఇప్పటివరకు రూ.22 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చాలావరకు ఇవి పాకిస్తాన్‌ నుంచి సరఫరా అవుతున్నాయన్నారు. సుమారు 60–70 శాతం మాదకద్రవ్యాలు సముద్ర మార్గాల ద్వారా తరలి వెళుతున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో దేశ సముద్ర తీరాలను పటిష్టం చేయాలన్నారు. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారడంతో పాటు 2025 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారత్‌ మారే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే డ్రగ్స్‌ రహిత సమాజం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వందితా శర్మ, డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ తదితరులు పాల్గొన్నారు.  

ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటాం: సీఎం వైఎస్‌ జగన్‌ 
జాతీయ భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై బెంగళూరులో జ­రు­­గుతున్న ప్రాంతీయ సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపా­రు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం వీడియో కా­న్ఫ­రెన్స్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ ఈ స­దç­Ü్సు­లో పాల్గొన్నారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లును ఆమోదించాల్సి ఉండటంతో సదస్సుకు హాజరుకాలేకపోయానని సీఎం చెప్పా­రు. అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్నానన్నారు. తమ ప్రభు­త్వం తరఫున డీ­జీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారని తెలిపారు. కా­గా, ఈ సదస్సుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement