![criticism on vijays sarkar first look, vijays sarkar - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/22/Vijay-Sethupathi-in-Idhaaba.jpg.webp?itok=Ccqe3XaX)
విజయ్ సేతుపతి
సిగరెట్ తాగుతూ ఉన్న విజయ్ లేటెస్ట్ సినిమా ‘సర్కార్’ ఫస్ట్ లుక్ తమిళనాడులో తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈ పోస్టర్ తప్పుదోవ పట్టించేలా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ – ‘‘సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. సినిమాలో పాత్రల కోసం యాక్టర్స్ ధూమపానం చేస్తారు తప్పితే కావాలని కాదు.
యువతను తప్పు దోవ పట్టించాలని ఉద్దేశం కూడా కాదు. మా నాన్నకి సిగరెట్ అలవాటు ఉండేది. ఆయన్ను చూసి నేను అలవాటు చేసుకోలేదే? చెడుని తీసుకోవాలా? వద్దా? అనే విషయం మన మీద ఆధారపడి ఉంటుంది. కేవలం పబ్లిసిటీ కోసం సినిమాల్లో పోస్టర్స్ గురించి మాట్లాడటం తప్పు. ఈ ప్రాబ్లమ్‌ని నిజంగా సాల్వ్ చేయాలనుకునేవాళ్లు సిగరెట్ తయారు చేసేవాళ్లను తప్పుపట్టండి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment