తెలంగాణలో టీఆర్‌ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే అధికార పార్టీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు.
యాదిగిరిగుట్ట: తెలంగాణలో టీఆర్‌ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే అధికార పార్టీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. గత రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ప్రచార కార్యక్రమాన్నిఈ నెల 30న నల్లగొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రారంభిస్తారని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చే దిశగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు సంకినేని వివరించారు.