నిరుపేదగా మొదలై ప్రధానిగా..
వాషింగ్టన్: ప్రధాని నరేంద్రమోదీని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రముఖ మేగజిన్ టైమ్ మ్యాగజైన్లో మోదీ గొప్పతనాన్ని, సామర్థ్యాన్ని, జీవితాన్ని స్పృష్టిస్తూ 'ఇండియాస్ రిఫార్మర్ ఇన్ చీఫ్' అనే పేరిట ఓ వ్యాసం రాశారు. భారత దేశంలో సంస్కరణలు ప్రవేశ పెట్టినవారిల్లోనే మోదీ అగ్రగణ్యుడు అని కొనియాడారు. మోదీ జీవితం డైనమిజంతో నిండుకొని ఉన్నదని చెప్పారు. భారత్ను ఆర్థికశక్తిగల దేశంగా నిర్మిస్తుండటంలో ఆయన పాత్ర గొప్పదని చెప్పారు.
చిన్నవయసులో ఉన్నప్పుడు మోదీ తన తండ్రికి చాయ్ అమ్మడంలో సాయం చేశాడని.. ఇప్పుడు మాత్రం ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడయ్యాడని చెప్పారు. ఆయన జీవితం పేదరికం నుంచి ప్రధాని వైపుగా సాగిందని తెలిపారు. ఇదంతా భారత డైనమిజాన్ని, శక్తిసామర్ధ్యాలను చూపిస్తోందని ఒబామా చెప్పారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా వంటి మోదీ తెచ్చిన పలు సంస్కరణలు ఆయన ఆర్టికల్లో ఒబామా ప్రస్తావించారు. కాగా, ఒబామాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.