న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు అమెరికా 44వ అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా ట్విట్టర్‌లో, ‘‘నేను గత రెండు రోజులుగా గొంతు సమస్యతో బాధపడుతున్నను. కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. అయితే నా భార్య మిచెల్‌కు నెగిటివ్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. నేను బాగానే ఉన్నాను. వ్యాక్సిన్ కూడా తీసుకున్నాను". అని పేర్కొన్నారు.
అంతేకాదు కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోని వాళ్లు ఎవరైన ఉంటే తీసుకోండి అని సూచించారు. ఒబామ ట్వీట్‌కి ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ... "ఒబామ త్వరితగతిన కోలుకోవాలి. మీరు, మీ కుటుంబం, మంచి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు. కరోనాతో అత్యధికంగా ప్రభావితమైన అమెరికాలో ఇప్పటివరకు సుమారు 79 మిలియన్ల పైగా కరోనా భారిన పడ్డారు, దాదాపు 9 లక్షల మరణాలు సంభవించడం గమనార్హం.
(చదవండి: మళ్లీ విజృంభిస్తున్న కరోనా!... 79 కొత్త కోవిడ్ కేసులు)
Comments
Please login to add a commentAdd a comment