![Statue of Unity, Mumbai Soho House find place in Time magazine top 100 - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/23/Untitled-5.jpg.webp?itok=xUfcOcUA)
న్యూయార్క్: గుజరాత్ తీరంలో ఏర్పాటైన 597 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ముంబైలోని సోహో హౌస్‌లకు ప్రఖ్యాత టైమ్ మేగజీన్ రూపొందించిన టాప్–100 ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్లి ఆస్వాదించదగిన ప్రాంతాల రెండో జాబితాలో చోటు లభించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 597 అడుగుల ఎత్తైన విగ్రహం గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో ఏర్పాటుచేయడం తెల్సిందే. అలాగే, అమెరికా, యూరప్‌లలో కాకుండా ఆసియాలోనే మొట్టమొదటి సారిగా ముంబైలో ఏర్పాటైన ఘనత సోహో హౌస్ సొంతం. సముద్ర తీరంలో 11 అంతస్తుల భవనంలో ఏర్పాటైన ఈ క్లబ్‌లో ఒక లైబ్రరీ, చిన్న సైజు సినిమా హాలు, రూఫ్‌టాప్ బార్, స్విమ్మింగ్‌పూల్ ఉన్నాయి. 200 కళాత్మక వస్తువులు ఈ ప్రైవేట్ క్లబ్ ప్రత్యేకతలు.
Comments
Please login to add a commentAdd a comment