top 100 list
-
ఐదేళ్ల తర్వాత...
న్యూఢిల్లీ: నిరీక్షణ ముగిసింది. ఐదేళ్ల తర్వాత అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్–100లో మళ్లీ భారత ప్లేయర్ పేరు కనిపించింది. ఆదివారం ముగిసిన చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన సుమిత్ నగాల్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి తొలిసారి టాప్–100లోకి దూసుకొచ్చాడు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 26 ఏళ్ల సుమిత్ 630 పాయింట్లతో కెరీర్ బెస్ట్ 98వ ర్యాంక్‌లో నిలిచాడు. 2019లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తర్వాత ఓ భారత టెన్నిస్ ప్లేయర్ ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–100లోకి రావడం విశేషం. 1973లో ఏటీపీ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టాక భారత్ నుంచి టాప్–100లో నిలిచిన పదో ప్లేయర్‌గా సుమిత్ నగాల్ గుర్తింపు పొందాడు. ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్‌కే చెందిన రోహన్ బోపన్న వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... గతంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ విభాగంలో సానియా మీర్జా కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్‌లో, డబుల్స్ విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచింది. -
టైమ్ 100 అగ్రస్థానంలో బాలీవుడ్ బాద్షా
న్యూఢిల్లీ: ‘పఠాన్’సినిమాతో మాంచి ఊపుమీదున్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(57)కు ఓ అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజీన్ 2023 సంవత్సరానికి నిర్వహించిన ప్రభావశీల వ్యక్తుల జాబితా 100లో అత్యధిక ఓట్లతో ఆయన అగ్రస్థానంలో నిలిచారు. ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ, ప్రిన్స్ హ్యారీ–మేఘన్ దంపతులు, ఆస్కార్ విజేత మిచెల్ యియోహ్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌లకు మించి ఆయనకు ఓట్లు పడ్డాయని టైమ్ మ్యాగజీన్ తెలిపింది. ఈ ఏడాది ప్రభావశీల వ్యక్తుల జాబితాలో అర్హులుగా ఎవరుండాలని అను కుంటున్నారన్న ప్రశ్నకు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్పందించారని పేర్కొంది. మొత్తం 12 లక్షల ఓట్లలో ‘పఠాన్’స్టార్‌కు 4%పైగా ఓట్లు పోలయ్యాయని వెల్లడించింది. ఈ నెల 13న తమ ఎడిటర్స్ టాప్100 జాబితాపై అభిప్రాయాలను వెల్లడించాక అంతిమ ఫలితాన్ని ప్రకటిస్తామని తెలిపింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత లీడ్ రోల్లో షారుఖ్ నటించిన పఠాన్ సినిమా జనవరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్ద హిట్టయ్యింది. ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది. టాప్ 100 రెండో స్థానంలో కఠిన ఇస్లామిక్ పాలన నుంచి స్వే చ్ఛ కావాలని ఉద్యమిస్తున్న ఇరాన్ మహిళలకు 3 శాతం ఓట్లు పోలయ్యాయి. టైమ్ 2022 జాబితాలోనూ హీరోస్ ఆఫ్ ది ఇయర్‌ను ఇరాన్ మహిళలే గెలుచుకోవడం గమనార్హం. ఆ తర్వాత బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు 1.9% ఓట్లతో వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. గత ఏడాది ఖతార్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనాకు చారిత్రక విజయం సాధించి పెట్టిన లియోనల్ మెస్సీ 1.8% ఓట్లతో ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ప్రముఖుల్లో ఈ ఏడాది ఆస్కార్ ఉత్తమ నటి విజేత యియోహ్, టెన్నిస్ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్, జుకర్‌బర్గ్, బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్వా ఉన్నారని టైమ్ మేగజీన్ తెలిపింది. -
ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ 2022 భారతదేశపు 100 మంది సంపన్నుల జాబితా విడుదలైంది.దీని ప్రకారం భారతదేశంలోని 100 మంది సంపన్నుల సంపద 25 బిలియన్ డాలర్లు పెరిగి 800 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఏడాదితోపోలిస్తే స్టాక్ మార్కెట్ స్వల్పంగా తగ్గినప్పటికీ బిలియనీర్ల సంపద మాత్రం మరింత వృద్ధి చెందింది. ఈజాబితాలో అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ టాప్ ప్లేస్‌ను కైవసం చేసుకోగా, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ 2వ స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ టైకూన్ గౌతమ్ అదానీ రికార్డ్-బ్రేకింగ్ ఫీట్‌తో 2008 తర్వాత మొదటిసారిగా అగ్రస్థానంలో ఉన్న క్రమాన్ని మార్చింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ ఆదానీ 150 బిలియన్ డాలర్ల (రూ. 1,211,460.11 కోట్లు) ఆదాయంతో టాప్‌లో, 88 బిలియన్ డాలర్ల (రూ.710,723.26 కోట్లు)తో ముఖేశ్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. టాప్ -10 జాబితా: ఈ పది మంది సంపాదన 350 బిలియన్ డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్ తెలిపింది. రాధాకిషన్ దమానీ:డీమార్ట్ రిటైల్ సూపర్‌మార్కెట్ డీమార్ట్ యజమాని రాధాకిషన్ దమనీ రూ. 222,908.66 కోట్ల సంపాదనతో మూడోస్థానంలో ఉన్నారు. సైరస్ పూనావాలా: ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ సైరస్ పూనావాలా (రూ.173, 642.62 కోట్లు) నాలుగో ప్లేస్ సాధించారు. శివ్ నాడార్: టెక్దిగ్గజం హెచ్‌సీఎల్ సంస్థ యజమాని శివ్ నాడార్ (రూ. 172,834.97కోట్లు) ఐదో ప్లేస్‌లో ఉన్నారు. ఈ సంవత్సరం విద్య సంబంధిత అవసరాల నిమిత్తం 662 మిలియన్ డాలర్లు విరాళంగా అందించడంతో ఆయన నికర విలువ భారీగా తగ్గింది. కానీ టాప్ 10లో తన ప్లేస్‌ను నిలుపుకోవడం విశేషం. సావిత్రి జిందాల్: ఓపీ జిందాల్ ఛైర్ పర్సన్ సావిత్రి జిందాల్ రూ. 132, 452.97 కోట్ల ఆదాయంతో ఆరో ప్లేస్ దక్కించుకున్నారు. దిలీప్ షాంఘ్వీ: సన్‌ఫార్మాసూటికల్స్ స్థాపకుడు దిలీప్ సంఘ్వీ రూ.125,184.21కోట్లుతో ఏడో స్థానాన్ని ఆక్రమించారు. హిందూజా బ్రదర్స్: హిందూజ బ్రదర్స్ (రూ.122,761.29కోట్లు) ఎనిమిదో ప్లేస్‌లో నిలిచారు. 1914లో పరమానంద్ దీప్‌చంద్ హిందూజా ప్రారంభించారు. నలుగురు బ్రదర్స్, శ్రీచంద్, గోపీచంద్, ప్రకాష్ , అశోక్ బహుళజాతి సమ్మేళనాన్ని నియంత్రిస్తున్నారు. కుమార్ బిర్లా: టెక్స్టైల్స్-టు-సిమెంట్ సమ్మేళనం ఛైర్మన్ ఆదిత్య బిర్లా గ్రూప్ నికర విలువ రూ.121,146.01 కోట్లు. బజాజ్ కుటుంబం: 40 కంపెనీల నెట్వర్క్ తో ఉన్న బజాజ్ గ్రూప్. రూ.117,915.45 కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. .1926లో ముంబయిలో జమ్నాలాల్ బజాజ్ వ్యాపారాన్ని ప్రారంభించారు. బజాజ్ ఆటో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ద్విచక్ర, మూడు చక్రాల తయారీదారులుగా పాపులర్ అయింది. -
Dr Soosan Jacob: రికార్డు కళ్లు
సూసన్ జాకబ్.. ప్రపంచంలోనే పేరుపొందిన కంటి వైద్యులలో ఒకరు. 2021 పవర్ లిస్టులో టాప్ 100 మందిలో ర్యాంకు సాధించారు... కేవలం కంటి వైద్యులకు సంబంధించిన ఈ జాబితాను ‘ద ఆప్తాల్మాలజిస్ట్’ అనే అంతర్జాతీయ పత్రికలో ఏటా ప్రకటిస్తారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ... ఇతర వైద్యులకు ఆదర్శంగా నిలిచే వారి ఈ జాబితాలో సూసన్ జాకబ్ పేరు చేరింది ఇప్పుడు. డాక్టర్ జాకబ్ ‘అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్’లో 21 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కంటికి సంబంధించిన విభాగాలలో స్పెషలైజేషన్ చేశారు. కటింగ్ ఎడ్జ్ క్యాటరాక్ట్, గ్లకోమా వంటి వాటిలో నిపుణులు. ‘‘ఈ లిస్టులో నా పేరు ఉండటం నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను. మహిళలు కట్టుబాట్లు అనే గాజు అద్దాలను పగలగొట్టి, తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలి. ఇటువంటి వేదికల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని పొందవచ్చు’ అంటున్నారు జాకబ్. జాకబ్ చేసిన పరిశోధనలు ఎంతోమంది కంటి రోగుల జీవితాలను మార్చేశాయి. కార్నియా, రెఫ్రక్టివ్ సర్జికల్ రంగంలో జాకబ్ అనేక పరిశోధనలు చేసిన జాకబ్ యాభైకి పైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. క్రిట్జింగర్ మెమోరియల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ జాకబ్. ఆమె తమిళం, ఇంగ్లీషు, హిందీ, మలయాళ భాషలు మాట్లాడగలరు. -
టైమ్ 100లో భీంఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్
న్యూయార్క్: ట్విట్టర్ ఉన్నతస్థాయి న్యాయవాది విజయ గద్దెతో యూకె ఆర్థిక మంత్రి రిషి సునక్ సహా, భారతీయ సంతతికి చెందిన సామాజిక కార్యకర్తకు టైమ్ మ్యాగజైన్ వార్షిక ‘’ఎమర్జింగ్ లీడర్స్హూ ఆర్ షేపింగ్ ద ఫ్యూచర్’’జాబితాలో చోటు సంపాదించుకున్నారు. భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ ఎదుగుతోన్న 100 మంది ప్రపంచ స్థాయి అత్యంత ప్రతిభావంతమైన నేతల పేర్లను 2021 టైమ్ 100 జాబితా ప్రకటిస్తుంది. ‘‘ఈ జాబితాలో చేరిన వ్యక్తులంతా చరిత్రసృష్టిస్తారు. నిజానికి చాలా మంది ఆ పనిచేసే ఉంటారు’’. టైమ్ 100 ఎడిటోరియల్ డైరెక్టర్ డాన్మాక్సై చెప్పారు. ♦ టైమ్ 100 జాబితాలో పేరు దక్కించుకున్న మిగిలిన భారతీయ సంతతికి చెందిన నేతలు ఇన్‌స్టాకార్ట్ వ్యవస్థాపకులు, సీఈఓ అపూర్వ మెహతా, డాక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘గెట్ ఆన్ పీపీ ఈ’శిఖా గుప్తా, మరో స్వచ్ఛంద సంస్థకు చెందిన రోహన్ పావులూరి ఉన్నారు. ♦ భీంఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ కూడా ప్రపంచస్థాయి ప్రముఖ నేతల సరసన చేరారు’’ఇక టైమ్ మ్యాగజైన్. బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్ ప్రొఫైల్‌లో ‘‘కొద్దికాలం క్రితం ఈ 40 ఏళ్ల బ్రిటన్‌లోని చాలా తక్కువ మందికి తెలిసిన జూనియర్ మినిస్టర్ అతి స్వల్పకాలంలోనే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు నేతృత్వం వహించే స్థాయికి ఎదిగారు’అని రాశారు. సునాక్ దేశంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన రాజకీయ వేత్త ’’అని పేర్కొనడం గమనార్హం. ♦ జనవరి 6న క్యాపిటల్ ఎటాక్ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఎకౌంట్‌ని రద్దు చేస్తున్నట్టు ట్విట్టర్ సీఈఓ జాక్ డార్సేకి చెప్పింది విజయ గద్దె అన్న విషయాన్ని ప్రస్తావించిన టైమ్ ప్రొఫైల్, అత్యంత శక్తివంతమైన ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్ విజయ గద్దెని ప్రశంసించింది. ♦ భీం ఆర్మీ నాయకుడు 34 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ నడుపుతోన్న పాఠశాలలు విద్య ద్వారా దళితుల్లో పేదరికాన్ని పారదోలేందుకు కృషి చేస్తున్నాయి. కులపరమైన అణచివేత, హింసపై గళం విప్పుతూ, వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది’అంటూ భీం ఆర్మీ నాయకుడిని గురించి టైం ప్రస్తావించింది. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంపై భీంఆర్మీ ఉద్యమాన్ని టైమ్ గుర్తించింది. ♦ వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్‌లో గుప్తా లేకపోయినప్పటికీ, ఆయన అత్యంత కీలక కోవిడ్ సంక్షోభకాలంలో వైట్‌హౌస్ లో నాయకత్వ లేమిని పూరిస్తూ, దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులకు అవసరమైన ఆరోగ్య పరికరాలను సమకూర్చారు. గుప్తా సారథ్యంలో 6.5 మిలియన్ల పీపీఈ కిట్లను ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి అందించగలిగారు. ♦ 25 ఏళ్ల పావులూరి ఫ్రీ ఆన్లైన్ టూల్‌కి ఆద్యుడు. కోవిడ్–19 సంక్షోభంలో అగ్రరాజ్యం అమెరికా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటి నుంచి బయటపడేందుకు పావులూరి తయారుచేసిన యాప్ సమర్థంగా పనిచేసింది. -
అక్షయ్ 2 రజనీ 13 ప్రభాస్ 44
ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రతి ఏడాది టాప్ 100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది విడుదల చేసిన ‘ఇండియన్ టాప్ 100’ సెలబ్రిటీల జాబితాలో సినీ రంగం నుంచి 293.25 కోట్ల ఆర్జనతో రెండో స్థానంలో నిలిచారు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్. 2017లో నాలుగు, 2018లో మూడు స్థానాలను కైవసం చేసుకున్న అక్షయ్ ఈసారి మరో మెట్టు పైకి ఎక్కి రెండో స్థానం సంపాదించడం విశేషం. ఇక 2017, 2018 సంవత్సరాల్లో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్న బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ 229.25 కోట్ల ఆర్జనతో ఈ ఏడాది మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంకా హిందీ పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్ (4,) షారుఖ్ ఖాన్ (6), రణ్వీర్ సింగ్ (7), ఆలియా భట్ (8), దీపికా పదుకోన్ (10) టాప్ టెన్ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ఇక వందకోట్ల సంపాదనతో ఈ జాబితాలో 13వ స్థానంలో నిలిచి దక్షిణాది స్టార్స్‌లో అందరికంటే ముందు ఉన్నారు రజనీకాంత్. గత ఏడాది ఫోర్బ్ జాబితాలో రజనీది 14వ స్థానం. ఈ ఏడాది ఏఆర్ రెహమాన్ 16, మోహన్‌లాల్ 27వ స్థానాల్లో నిలిచారు. మరోవైపు మన తెలుగు పరిశ్రమ నుంచి ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో నిలిచిన వారిలో ప్రభాస్ ముందు వరుసలో ఉన్నారు. 2017లో 22వ స్థానం, గత ఏడాది అసలు ఈ లిస్ట్‌లోనే లేని ప్రభాస్ 2019 లిస్ట్‌లో 44వ ర్యాంక్‌లో నిలిచి టాలీవుడ్ హీరోల తరఫున ఈ లిస్ట్‌లో బోణీ కొట్టారు. ఇక 2017లో 37, 2018లో 33 ర్యాంకర్‌గా నిలిచిన మహేశ్‌బాబు ఈ ఏడాది 54వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా 68వ స్థానంలో తాప్సీ, 77వ స్థానంలో త్రివిక్రమ్ నిలిచారు. ఇక క్రీడా రంగంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఇతర స్టార్ క్రికెటర్స్ ఎమ్ఎస్. ధోనీ (05), సచిన్ టెండూల్కర్ (09) టాప్‌టెన్ జాబితాలో ఉన్నారు. మరో క్రికెటర్ రోహిత్ శర్మ 11వ స్థానంలో నిలిచారు. బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పీవీ సింధు (63), సైనా నెహ్వాల్ (81) కూడా లిస్ట్‌లో ఉన్నారు. క్రికెటర్ మిథాలీ రాజ్ 88వ స్థానం దక్కించుకున్నారు. సెలబ్రిటీల క్రేజ్, ప్రింట్, సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీ వంటి కొన్ని అంశాల ఆధారంగా ఈ ర్యాంక్‌లు నిర్ణయించినట్లు ఫోర్బ్స్ ప్రతినిధులు తమ వెబ్సైట్లో పేర్కొన్నారు. అలాగే కొంతమంది సంపాదన అధికంగా ఉన్నప్పటికీ వారి ఫేమ్‌ని దృష్టిలో ఉంచుకుని ర్యాంక్‌లను కేటాయించినట్లు ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ఆలియా భట్, దీపికా పదుకోన్, తాప్సీ -
టాప్–100 రచయితల్లో మనవాళ్లు
లండన్: ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇంగ్లిష్ నవలలు రాసిన మొదటి 100 మందిలో.. ప్రముఖ భారతీయ రచయితలు ఆర్కే నారాయణ్, అరుంధతి రాయ్, సల్మాన్ రష్దీ, విక్రమ్ సేత్‌లకు చోటు దక్కింది. బీబీసీ నిపుణులు ఎంపిక చేసిన ప్రపంచ ప్రఖ్యాత రచయితల జాబితాలో వీరి పేర్లున్నాయి. బీబీసీ నియమించిన నిపుణుల కమిటీ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన సంప్రదాయ సాహిత్యం నుంచి సమకాలీన సాహిత్యం వరకు 100 రచనల్ని ఎంపిక చేసి వాటిని ప్రేమ, రాజకీయం, అధికారం, బాలసాహిత్యం, సమాజం వంటి పది కేటగిరీలుగా విభజించింది. ఒక్కో కేటగిరీ కింద ఏడాది పాటు శ్రమించి కొన్ని పుస్తకాలను ఈ బృందం ఎంపిక చేసింది. ఇందులో అరుంధతి రాయ్ రాసిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’పుస్తకం ఐడెంటిటీ కేటగిరీలోను, ఆర్కే నారాయణ్ ‘స్వామి అండ్ ఫ్రెండ్స్’కమింగ్ ఆఫ్ ఏజ్ సెక్షన్లో, సల్మాన్ రష్దీ రాసిన ‘ది మూర్స్ లాస్ట్ సై’రూల్ బ్రేకర్స్ విభాగంలో ఎంపికయ్యాయి. విక్రమ్ సేథ్ రాసిన నవల ‘ఎ స్యూటబుల్ బోయ్’ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్షిప్ కేటగిరీ, వీఎస్ నైపాల్ రచించిన ‘ఎ హౌస్ ఆఫ్ మిస్టర్ బిశ్వాస్’కు క్లాస్ అండ్ సొసైటీ విభాగంలో చోటు దక్కింది. పాక్ రచయితలు మొహ్సీన్ హమీద్, కమిలా షమ్సీలు రాసిన ది రిలక్టాంట్ ఫండమెంటలిస్ట్, హోం ఫైర్, అఫ్గాన్–అమెరికన్ రచయిత ఖలేద్ హొస్సైనీ రాసిన ఎ థౌజెండ్ స్లె్పండిడ్ సన్స్ నవలకు చోటు దక్కింది. ఆంగ్లంలో తొలి నవలగా భావించే ‘రాబిన్సన్ క్రూసో ’ప్రచురితమై 300 ఏళ్లు పూర్తవడంతో ఈ జాబితా తెచ్చారు. -
జియో సంచలనం : మూడేళ్లలో టాప్ 100 లోకి
సాక్షి, న్యూఢిల్లీ: టెలికం మార్కెట్ సంచలనం రిలయన్స్ జియో తన వృద్ధి రేటులో దూసుకపోతోంది. కంపెనీ ప్రారంభించిన మూడేళ్లలోనే జియో గ్లోబల్ 100 డిస్ట్రప్టివ్ పవర్ బ్రాండ్ల జాబితాలో చేరింది. అంతేకాదు ప్రస్తుత వృద్ధి రేటుతో మూడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 100 బ్రాండ్లలో ఒకటిగా ఉంటుందని కమ్యూనికేషన్ సర్వీసెస్ ప్రొవైడర్ డబ్ల్యుపీపీ, మార్కెట్ పరిశోధనా సంస్థ కాంతర్ మిల్వార్డ్ బ్రౌన్ తాజా నివేదికలో ఈవిషయాన్ని వెల్లడించింది. 2016లో ప్రారంభించినప్పటికీ, 1995లోమార్కెట్లోకి ప్రవేశించిన ఎయిర్టెల్, వోడాఫోన్ లాంటి ప్రధాన ప్రత్యర్థులకు భిన్నంగా భారత వినియోగదారులు జియోను ఆదరించారని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో టాప్ 100 మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్‌గా దూసుకురానుందని నివేదించింది. మొదటి ఆరు నెలలు ఉచిత సేవలతో కస్లమర్లను ఆకర్షించి, ఆతరువాత సరసమైన ధరల్లో డేటా సేవలను అందించి, మార్కెట్ లీడర్లు ఎయిర్టెల్, వోడాఫోన్ లాంటి కంపెనీలను ప్రభావితం చేసిందని పేర్కొంది. దీంతో అవి కూడా వినియోగదారులను నిలబెట్టుకునేందుకు డేటా టారిఫ్‌ల విషయంలో దిగొచ్చాయని నివేదిక వ్యాఖ్యానించింది. కొత్త బ్రాండ్‌గా మార్కెట్లోకి ప్రవేశించి, వినియోగదారులందరికీ భారీ ప్రయోజనాలతో, ఆ సెక్టార్ చరిత్రనే తిరగరాసిన ఘనత జియోకే దక్కుతుందని కాంతర్ గ్లోబల్ బ్రాండ్జెడ్ రీసెర్చ్ డైరెక్టర్ మార్టిన్ గెరిరియా అన్నారు. 340 మిలియన్లకు పైగా చందాదారులతో జియో ప్రస్తుత బ్రాండ్ విలువ 4.1 బిలియన్లు అని నివేదిక తెలిపింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆపిల్, గూగుల్‌లను అధిగమించి టాప్ 100 మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్‌లో మొదటి ర్యాంకును దక్కించుకుంది. సంవత్సరానికి 52 శాతం పెరుగుదలతో, అమెజాన్ బ్రాండ్ విలువ 315.5 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాలో తొలిసారిగా చైనాకు చెందిన నాలుగు కంపెనీలు, ఇండియాకు చెందిన రెండు కంపెనీలు స్థానాన్ని దక్కించుకున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ (68వ ర్యాంకు), ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ 97వ ర్యాంకుతో కొత్తగా స్థానాన్ని సంపాదించాయి. -
స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ‘టైమ్’ గుర్తింపు
న్యూయార్క్: గుజరాత్ తీరంలో ఏర్పాటైన 597 అడుగుల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ముంబైలోని సోహో హౌస్‌లకు ప్రఖ్యాత టైమ్ మేగజీన్ రూపొందించిన టాప్–100 ప్రపంచంలోనే గొప్పవైన, తక్షణమే వెళ్లి ఆస్వాదించదగిన ప్రాంతాల రెండో జాబితాలో చోటు లభించింది. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 597 అడుగుల ఎత్తైన విగ్రహం గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో ఏర్పాటుచేయడం తెల్సిందే. అలాగే, అమెరికా, యూరప్‌లలో కాకుండా ఆసియాలోనే మొట్టమొదటి సారిగా ముంబైలో ఏర్పాటైన ఘనత సోహో హౌస్ సొంతం. సముద్ర తీరంలో 11 అంతస్తుల భవనంలో ఏర్పాటైన ఈ క్లబ్లో ఒక లైబ్రరీ, చిన్న సైజు సినిమా హాలు, రూఫ్‌టాప్ బార్, స్విమ్మింగ్‌పూల్ ఉన్నాయి. 200 కళాత్మక వస్తువులు ఈ ప్రైవేట్ క్లబ్ ప్రత్యేకతలు. -
ఎవరి సంపాదన ఎక్కువ?
‘షారుక్‌ఖాన్ సినిమాకు ఇన్ని కోట్లు తీసుకుంటారట, సల్మాన్ అయితే ‘బిగ్ బాస్’ ఒక్క ఎపిసోడ్‌కే అన్ని కోట్లు పుచ్చుకుంటారట!’ అని మాట్లాడుకుంటూనే ఉంటాం. సామాన్యుల్లో స్టార్స్ సంపాదన ఎప్పుడూ ఓ హాట్ టాపిక్కే. ఇదే సంభాషణలకు సర్వే రూపం ఇచ్చి ఓ జాబితాను ప్రతి ఏడాదీ రిలీజ్ చేస్తుంటుంది ఫోర్బ్స్ మేగజైన్. సినిమా తారలు, క్రికెటర్స్ ఆ ఏడాది (సర్వే నిర్వహించే కాలం)లో ఎంత సంపాదిస్తున్నారో లెక్క కట్టి ఏడాది చివర్లో ఓ లిస్ట్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఏడాది కూడా తన టాప్ 100 జాబితాను విడుదల చేసింది. 2017 అక్టోబర్ 1 నుంచి సెప్టెబర్ 30, 2018 వరకూ తారల సినిమాల రిలీజ్లు, చేసిన బ్రాండ్ ప్రమోషన్స్ అన్నింటినీ లెక్కకట్టి ఎక్కువగా సంపాదించే వంద మంది ఇండియన్ సెలబ్రిటీల లిస్ట్ ఇచ్చింది. ఈ ఏడాది అత్యంత సంపాదించిన వాళ్లలో సల్మాన్ ఖాన్ నిలిచారు. వరుసగా మూడోసారి ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచారు సల్మాన్ ఖాన్. ఈ కండలవీరుడు సుమారు 253 కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నట్టు పేర్కొంది ఫోర్బ్స్. మూడో స్థానంలో అక్షయ్ కుమార్ (185 కోట్లు) ఉన్నారు. ఈ జాబితాలో సౌత్ హీరోల్లో రజనీకాంత్ టాప్‌లో ఉన్నారు. 50 కోట్లు సంపాదిస్తూ 14వ పొజిషన్లో నిలిచారు రజనీ. ఆ తర్వాత 31కోట్ల సంపాదనతో పవన్ కల్యాణ్ 24వ పొజిషన్లో నిలిచారు. 28 కోట్లు సంపాదిస్తూ ఎన్టీఆర్ 28వ స్థానంలో నిలిచారు. 33, 34, 36 స్థానాల్లో మహేశ్‌బాబు (24.33 కోట్లు), సూర్య (23. 67 కోట్లు), నాగార్జున (22.25 కోట్లు) నిలిచారు. బ్లాక్‌బస్టర్ సినిమాల దర్శకుడు కొరటాల శివ కూడా ఈ లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు.20 కోట్ల సంపాదనతో 39వ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ (15.67 కోట్లు), రామ్‌చరణ్ (14 కోట్లు), లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ (14 కోట్లు) 64,72, 72 స్థానాల్లో ఉన్నారు. గతేడాది రెండో స్థానంలో నిలిచిన షారుక్ ఈ ఏడాది 13వ స్థానంలోకి వెళ్లారు. ఈ ఏడాది ఒక్క సినిమా రిలీజ్ కూడా లేకపోవడమే దానికి కారణం. అలాగే గతేడాది 7వ స్థానంలో నిలిచిన ప్రియాంక ఈ సంవత్సరం 49వ స్థానానికి చేరుకున్నారు. దీపికా రికార్డ్.. నయన కూడా! 112.8 కోట్లతో దీపికా పదుకోన్ నాలుగో స్థానంలో నిలిచారు. 2012 నుంచి ఫోర్బ్స్ విడుదల చేస్తున్న ఈ జాబితాలో టాప్ 5లో చోటు సంపాదించుకున్న తొలి మహిళగా దీపికా పదుకోన్ రికార్డ్ సృష్టించారు. ‘పద్మావత్’ లో హీరోల కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకోవడం, అలాగే తను చేసే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా ఆమెను టాప్ 5లో నిలిచేలా చేశాయని ఊహించవచ్చు. సౌత్ నుంచి హీరోయిన్స్‌లో నయనతార మాత్రమే ఈ లిస్ట్‌లో నిలవడం విశేషం. 15.17 కోట్లు సంపాదించి 69వ స్థానంలో నిలిచారు నయన్. -
ఆ జాబితాలో ముంబైకు చోటు
సాక్షి, ముంబై : ప్రపంచంలోని 100 అత్యంత వినూత్న నగరాల జాబితాలో భారత ఆర్థిక, వినోద రాజధాని ముంబైకి చోటుదక్కింది. టుథింక్నో అనే కమర్షియల్ డేటా ప్రొవైడర్ ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో జపాన్ రాజధాని టోక్యో అగ్రస్ధానంలో నిలిచింది. 2017లో ఈ సంస్థ విడుదల చేసిన జాబితాలో 90వ స్ధానంలో చోటు దక్కించుకున్న ముంబై ఈసారి 92వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఈ జాబితాలో మరో భారతీయ నగరం బెంగళూర్ 139వ స్ధానంలో నిలిచింది. ఇక హైదరాబాద్ 316వ ర్యాంక్, ఢిల్లీ (199), చెన్నై (252), కోల్‌కతా (283), అహ్మదాబాద్ (345), పూణే (346), జైపూర్ (393), సూరత్ (424), లక్నో (442), కాన్పూర్ 9448), మధురై 452వ ర్యాంక్‌ను సాధించాయి. 2017లో టాప్ ఇన్నోవేటివ్ సిటీగా నిలిచిన లండన్ తాజా జాబితాలో రెండవ ర్యాంక్‌ను దక్కించుకుంది. టాప్ 10 నగరాల్లో శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, లాస్ఏంజెల్స్, సింగపూర్, బోస్టన్, టొరంటో, పారిస్, సిడ్నీలున్నాయి. రోబోటిక్స్, త్రీడీ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో దూసుకుపోతున్న కారణంగానే లండన్, శాన్ఫ్రాన్సిస్కోలను అధిగమించి టోక్యో నెంబర్‌వన్‌గా నిలిచింది. -
టాప్–100 ప్రభావశీల వ్యక్తుల్లో బిలిమోరియా
లండన్: భారత్–బ్రిటన్ బంధాలను ప్రభావితం చేసిన టాప్ వంద మంది ప్రముఖుల్లో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ చాన్స్‌లర్ లార్డ్ కరణ్ బిలిమోరియాకు చోటుదక్కింది. ఆయనతోపాటు ఇదే వర్సిటీ సహాయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాబిన్ మాసన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. యూకే–ఇండియా వీక్ 2018లో భాగంగా ‘ఇండియా ఐఎన్‌సీ. టాప్ 100’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో భారత్, బ్రిటన్ల్లో వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతులు గడించిన పలువరు వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన కరణ్ బిలిమోరియా బ్రిటన్‌లో ప్రఖ్యాత కోబ్రా బీర్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. బ్రిటన్‌లోని అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి అధ్యక్షుడిగా, యూకే–ఇండియా వాణిజ్య మండలి వ్యవస్థాపక చైర్మన్‌గానూ ప్రస్తుతం పనిచేస్తున్నారు. -
దేశంలో అత్యంత ధనవంతుడు మళ్లీ ముకేషే
-
ఒబామా నుంచి మలాలా దాకా..
‘టైమ్’ మేగజీన్ 100 మంది ప్రభావశీలుర జాబితాలో మోదీ సహా మహామహులు ‘భారతదేశపు సంస్కరణల సారథి’గా ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మందిలో ఒకరిగా ‘టైమ్ మేగజీన్’లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాసం రాయటం.. భారత ప్రధానికి దక్కిన అరుదైన గౌరవంగా పరిగణిస్తున్నారు. అమెరికాలోని న్యూయార్క్ నుంచి ప్రచురితమవుతున్న ప్రఖ్యాత అంతర్జాతీయ వారపత్రిక టైమ్ మేగజీన్. 1923 లో మొదలైన ఈ మేగజీన్ అమెరికాలో తొలి వార్తా వారపత్రిక. లండన్ నుంచి యూరోపియన్ ఎడిషన్, హాంగ్‌కాంగ్ నుంచి ఏసియన్ ఎడిషన్, సిడ్నీ నుంచి సౌత్ పసిఫిక్ ఎడిషన్లను ప్రచురిస్తోంది. ప్రపంచంలో అత్యంత పాఠకాదరణ ఉన్న మేగజీన్ ఇదే. రెండున్నర కోట్ల మంది దీన్ని చదువుతారు. అందులో రెండు కోట్ల మంది అమెరికాలోనే ఉన్నారు. టైమ్ మేగజీన్ 1999లో తొలిసారి 20వ శతాబ్దపు 100 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాను సర్వే ద్వారా ప్రకటించింది. అప్పటి నుంచీ ప్రతి ఏడాదీ ఆ ఏడాదికి సంబంధించి ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రచురిస్తోంది. రాజకీయాలు, వ్యాపారం, కళలు తదితర రంగాల్లో ప్రభావశీలురను ఎంపిక చేస్తోంది. 2015లో ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల గురించి.. వారి వారి రంగానికి చెందిన ఇతర ప్రముఖుల చేత పరిచయం చేయించటం విశేషం. ఆయా దేశాల ప్రజల సంఖ్యను బట్టి ప్రభావవంతమైన దేశాధ్యక్షులుగా.. భారత ప్రధాని మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తదితరులను ఎంపిక చేశారు. పోప్ ఫ్రాన్సిస్, క్యూబా అధ్యక్షుడు రౌల్ కాస్ట్రో, ఇజ్రాయెల్ పాలకుడు బెంజమిన్ నెతన్యాహు పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆయా కంపెనీల ఉత్పత్తులను వాడే వారి సంఖ్యను బట్టి ప్రభావశీలురను ఎంపిక చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, లింక్డ్ఇన్ సీఈఓ రీడ్ హాఫ్మన్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఫేస్బుక్లో అభిమానుల సంఖ్యను బట్టి వివిధ కళా రంగాలకు చెందిన ప్రభావవంతమైన ప్రముఖ తారలను ఎంపిక చేశారు. ఎమ్మా వాట్సన్, కిమ్ కర్దషియన్, కెవిన్ హార్ట్, బ్రాడ్లీ కూపర్, రీస్ విదర్‌స్పూన్ పేర్లను ఎంపిక చేశారు. ఆరోగ్య రంగంలో భారత్ నుంచి మానసిక వైద్య చికిత్సా నిపుణుడు విక్రమ్పటేల్ పేరు కూడా ఇందులో చోటు సంపాదించుకుంది. భారత ప్రధాని మోదీని పరిచయం చేసిన ఒబామాను ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడిగా పేర్కొంటూ టైమ్ మేగజీన్ రాజకీయ వ్యాసరచయిత జో క్లీన్ రాశారు. ఉత్తరకొరియా ‘పీడకుడు’ అంటూ ఆ దేశాధిపతి కిమ్ జాంగ్ ఉన్ గురించీ రాశారు. జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా పాకిస్తాన్‌కు చెందిన బాలికల విద్యా ఉద్యమ కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ (17) మరో రికార్డు సృష్టించారు.