
లార్డ్ కరణ్ బిలిమోరియా
లండన్: భారత్–బ్రిటన్ బంధాలను ప్రభావితం చేసిన టాప్ వంద మంది ప్రముఖుల్లో ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ చాన్స్‌లర్ లార్డ్ కరణ్ బిలిమోరియాకు చోటుదక్కింది. ఆయనతోపాటు ఇదే వర్సిటీ సహాయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాబిన్ మాసన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. యూకే–ఇండియా వీక్ 2018లో భాగంగా ‘ఇండియా ఐఎన్‌సీ. టాప్ 100’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో భారత్, బ్రిటన్‌ల్లో వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతులు గడించిన పలువరు వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్‌లో జన్మించిన కరణ్ బిలిమోరియా బ్రిటన్‌లో ప్రఖ్యాత కోబ్రా బీర్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు. బ్రిటన్‌లోని అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి అధ్యక్షుడిగా, యూకే–ఇండియా వాణిజ్య మండలి వ్యవస్థాపక చైర్మన్‌గానూ ప్రస్తుతం పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment