
సూసన్ జాకబ్
సూసన్ జాకబ్.. ప్రపంచంలోనే పేరుపొందిన కంటి వైద్యులలో ఒకరు. 2021 పవర్ లిస్టులో టాప్ 100 మందిలో ర్యాంకు సాధించారు... కేవలం కంటి వైద్యులకు సంబంధించిన ఈ జాబితాను ‘ద ఆప్తాల్మాలజిస్ట్’ అనే అంతర్జాతీయ పత్రికలో ఏటా ప్రకటిస్తారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ... ఇతర వైద్యులకు ఆదర్శంగా నిలిచే వారి ఈ జాబితాలో సూసన్ జాకబ్ పేరు చేరింది ఇప్పుడు.
డాక్టర్ జాకబ్ ‘అగర్‌వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్’లో 21 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కంటికి సంబంధించిన విభాగాలలో స్పెషలైజేషన్ చేశారు. కటింగ్ ఎడ్జ్ క్యాటరాక్ట్, గ్లకోమా వంటి వాటిలో నిపుణులు. ‘‘ఈ లిస్టులో నా పేరు ఉండటం నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను. మహిళలు కట్టుబాట్లు అనే గాజు అద్దాలను పగలగొట్టి, తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలి. ఇటువంటి వేదికల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని పొందవచ్చు’ అంటున్నారు జాకబ్.
జాకబ్ చేసిన పరిశోధనలు ఎంతోమంది కంటి రోగుల జీవితాలను మార్చేశాయి. కార్నియా, రెఫ్రక్టివ్ సర్జికల్ రంగంలో జాకబ్ అనేక పరిశోధనలు చేసిన జాకబ్ యాభైకి పైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. క్రిట్జింగర్ మెమోరియల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ జాకబ్. ఆమె తమిళం, ఇంగ్లీషు, హిందీ, మలయాళ భాషలు మాట్లాడగలరు.
Comments
Please login to add a commentAdd a comment