International Paper
-
Dr Soosan Jacob: రికార్డు కళ్లు
సూసన్ జాకబ్.. ప్రపంచంలోనే పేరుపొందిన కంటి వైద్యులలో ఒకరు. 2021 పవర్ లిస్టులో టాప్ 100 మందిలో ర్యాంకు సాధించారు... కేవలం కంటి వైద్యులకు సంబంధించిన ఈ జాబితాను ‘ద ఆప్తాల్మాలజిస్ట్’ అనే అంతర్జాతీయ పత్రికలో ఏటా ప్రకటిస్తారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ... ఇతర వైద్యులకు ఆదర్శంగా నిలిచే వారి ఈ జాబితాలో సూసన్ జాకబ్ పేరు చేరింది ఇప్పుడు. డాక్టర్ జాకబ్ ‘అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్’లో 21 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కంటికి సంబంధించిన విభాగాలలో స్పెషలైజేషన్ చేశారు. కటింగ్ ఎడ్జ్ క్యాటరాక్ట్, గ్లకోమా వంటి వాటిలో నిపుణులు. ‘‘ఈ లిస్టులో నా పేరు ఉండటం నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను. మహిళలు కట్టుబాట్లు అనే గాజు అద్దాలను పగలగొట్టి, తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలి. ఇటువంటి వేదికల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని పొందవచ్చు’ అంటున్నారు జాకబ్. జాకబ్ చేసిన పరిశోధనలు ఎంతోమంది కంటి రోగుల జీవితాలను మార్చేశాయి. కార్నియా, రెఫ్రక్టివ్ సర్జికల్ రంగంలో జాకబ్ అనేక పరిశోధనలు చేసిన జాకబ్ యాభైకి పైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. క్రిట్జింగర్ మెమోరియల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ జాకబ్. ఆమె తమిళం, ఇంగ్లీషు, హిందీ, మలయాళ భాషలు మాట్లాడగలరు. -
అమెరికా చట్టాలు ఇక్కడ చెల్లవు
కోటగుమ్మం,(రాజమండ్రి) : ఇంటర్నేషనల్ పేపర్ మిల్లులో అకారణం విధుల నుంచి తొలగించిన నలుగు రు ఆఫీసర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సా ర్ సీపీ కేంద్ర పాలక మండ లి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశా రు. బుధవారం ఉద్యోగులను తొలగించిన విషయమై ఇతర పార్టీల నాయకులు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్నికృష్ణ, సీఐటీయూ నాయకులు టి.అరుణ్, ఐఎన్టీయూసీ నాయకులు డీవీ రెడ్డి, టీఎన్టీయూసీ నాయకులు బ్రహ్మయ్య, రాజారావు, లక్ష్మీపతిరావు, తదితరులతో కలసి పేపర్ మిల్లు యాజమాన్యంతో చర్చించారు. అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగులను తొలగించామని పేపర్ మిల్లు యాజమాన్యం చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. అనంతరం పేపర్ మిల్లు బయట జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ అమెరికా చట్టాలు ఇండియాలో చెల్లవని, ఇండియా చట్టాలకు లోబడే ఇక్కడ పేపర్ మిల్లు నిర్వహించాలని పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరారు. పేపర్ మిల్లుపై అనేక మంది ఆధారపడి జీవిస్తున్నారనే కారణంతో కాలుష్యమైనా రాజమండ్రి ప్రజలు భరిస్తున్నారన్నారు. ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోట తదితరులు పాల్గొన్నారు.