అమెరికా చట్టాలు ఇక్కడ చెల్లవు
కోటగుమ్మం,(రాజమండ్రి) : ఇంటర్నేషనల్ పేపర్ మిల్లులో అకారణం విధుల నుంచి తొలగించిన నలుగు రు ఆఫీసర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సా ర్ సీపీ కేంద్ర పాలక మండ లి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశా రు. బుధవారం ఉద్యోగులను తొలగించిన విషయమై ఇతర పార్టీల నాయకులు, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్నికృష్ణ, సీఐటీయూ నాయకులు టి.అరుణ్, ఐఎన్‌టీయూసీ నాయకులు డీవీ రెడ్డి, టీఎన్‌టీయూసీ నాయకులు బ్రహ్మయ్య, రాజారావు, లక్ష్మీపతిరావు, తదితరులతో కలసి పేపర్ మిల్లు యాజమాన్యంతో చర్చించారు.
అయితే సర్వీస్ రూల్స్ ప్రకారం ఉద్యోగులను తొలగించామని పేపర్ మిల్లు యాజమాన్యం చెప్పడంతో చర్చలు విఫలమయ్యాయి. అనంతరం పేపర్ మిల్లు బయట జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ అమెరికా చట్టాలు ఇండియాలో చెల్లవని, ఇండియా చట్టాలకు లోబడే ఇక్కడ పేపర్ మిల్లు నిర్వహించాలని పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరారు. పేపర్ మిల్లుపై అనేక మంది ఆధారపడి జీవిస్తున్నారనే కారణంతో కాలుష్యమైనా రాజమండ్రి ప్రజలు భరిస్తున్నారన్నారు. ఉద్యోగులను విధుల్లోకి తీసుకునే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కోట తదితరులు పాల్గొన్నారు.