agarwal eye hospital
-
4 ఐపీవోలకు సెబీ సై
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నాలుగు కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో డాక్టర్ అగర్వాల్స్ హెల్త్కేర్సహా కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్, హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా చేరాయి. గతేడాది సెప్టెంబర్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ కంపెనీలు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. అయితే మౌరి టెక్, అమంటా హెల్త్‌కేర్ ఐపీవో ప్రణాళికల నుంచి వెనక్కి తగ్గాయి. వివరాలు చూద్దాం.. ఐకేర్ కంపెనీ పీఈ దిగ్గజాలు టెమాసెక్ హోల్డింగ్స్, టీపీజీలకు పెట్టుబడులున్న డాక్టర్ అగర్వాల్స్ హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 6.95 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా కంటి పరిరక్షణ(ఐ కేర్) సరీ్వసులు అందిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 195 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలినవాటిని ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. రియల్టీ డెవలపర్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రియల్టీ రంగ కంపెనీ కాసాగ్రాండ్ ప్రీమియర్ బిల్డర్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 100 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.మౌలిక రంగ సంస్థ ఈపీసీ ఇన్ఫ్రా, టోల్ వసూళ్ల కంపెనీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీవోలో భాగంగా రూ. 105 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 31 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ప్రమోటర్లకు ప్రస్తతం 71.58 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను సాధారణ కార్పొరేట్, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచ్చించనుంది. మెషీనరీ తయారీ ఇథనాల్ ప్లాంట్లను రూపొందించే రీగ్రీన్ ఎక్సెల్ ఈపీసీ ఇండియా పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. దీనిలో భాగంగా రూ. 350 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.14 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ ప్రధానంగా ఇథనాల్ ప్లాంట్ల డిజైనింగ్, తయారీ, సరఫరా తదితర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వెనకడుగులో.. ఐటీ సొల్యూషన్ల కంపెనీ మౌరి టెక్, ఆరోగ్య పరిరక్షణ సంస్థ అమంటా హెల్త్‌కేర్ పబ్లిక్ ఇష్యూ సన్నాహాలను విరమించుకున్నాయి. గతేడాది సెపె్టంబర్– అక్టోబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. అయితే డిసెంబర్లోనే పత్రాలను వెనక్కి తీసుకున్నాయి. ఇందుకు కారణాలు వెల్లడికాలేదు. ఐపీవోలో భాగంగా హైదరాబాద్ కంపెనీ మౌరి టెక్ రూ. 440 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావించింది. వీటితోపాటు మరో రూ. 1,060 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచాలని ప్రణాళికలు వేశారు. ఇక ఫార్మా రంగ కంపెనీ అమంటా హెల్త్‌కేర్ ఐపీవోలో భాగంగా 1.25 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయాలని తొలుత భావించింది. కంపెనీ ప్రధానంగా మెడికల్ పరికరాలు, స్టెరైల్ లిక్విడ్ ప్రొడక్టుల తయారీలో ఉంది. -
Dr Soosan Jacob: రికార్డు కళ్లు
సూసన్ జాకబ్.. ప్రపంచంలోనే పేరుపొందిన కంటి వైద్యులలో ఒకరు. 2021 పవర్ లిస్టులో టాప్ 100 మందిలో ర్యాంకు సాధించారు... కేవలం కంటి వైద్యులకు సంబంధించిన ఈ జాబితాను ‘ద ఆప్తాల్మాలజిస్ట్’ అనే అంతర్జాతీయ పత్రికలో ఏటా ప్రకటిస్తారు. అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ... ఇతర వైద్యులకు ఆదర్శంగా నిలిచే వారి ఈ జాబితాలో సూసన్ జాకబ్ పేరు చేరింది ఇప్పుడు. డాక్టర్ జాకబ్ ‘అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్’లో 21 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. కంటికి సంబంధించిన విభాగాలలో స్పెషలైజేషన్ చేశారు. కటింగ్ ఎడ్జ్ క్యాటరాక్ట్, గ్లకోమా వంటి వాటిలో నిపుణులు. ‘‘ఈ లిస్టులో నా పేరు ఉండటం నన్ను గౌరవించినట్లుగా భావిస్తాను. మహిళలు కట్టుబాట్లు అనే గాజు అద్దాలను పగలగొట్టి, తమ శక్తిసామర్థ్యాలను నిరూపించుకోవాలి. ఇటువంటి వేదికల ద్వారా రెట్టింపు ఉత్సాహాన్ని పొందవచ్చు’ అంటున్నారు జాకబ్. జాకబ్ చేసిన పరిశోధనలు ఎంతోమంది కంటి రోగుల జీవితాలను మార్చేశాయి. కార్నియా, రెఫ్రక్టివ్ సర్జికల్ రంగంలో జాకబ్ అనేక పరిశోధనలు చేసిన జాకబ్ యాభైకి పైగా ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. క్రిట్జింగర్ మెమోరియల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ జాకబ్. ఆమె తమిళం, ఇంగ్లీషు, హిందీ, మలయాళ భాషలు మాట్లాడగలరు. -
ఆస్పత్రి నిర్వాకం: ‘కనుపాప’ను దూరం చేశారు
సాక్షి, హైదరాబాద్: లేకలేక ఆ దంపతులకు పుట్టిన ‘కనుపాప’ను వైద్య నిర్లక్ష్యం దూరం చేసింది. దృష్టి లోపాన్ని సరిదిద్దుకొని రంగుల ప్రపంచాన్ని చూడాలనుకున్న ఆ చిన్నారిని మత్తుమందు శాశ్వత నిద్రలోకి తీసుకెళ్లింది. మోతాదుకు మించి అనస్తీ్తషియా ఇవ్వడం వల్ల కంటి సర్జరీకి ముందే ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఆల్విన్ కాలనీ సమీపంలోని శంషాగూడకు చెందిన పానీపూరి వ్యాపారి గణపతిరెడ్డి, కీర్తి దంపతులకు పెళ్లైన పన్నెండేళ్ల తర్వాత కుమారుడు ప్రశాంత్ (12) జన్మించాడు. అయితే చిన్నతనం నుంచే అతనికి కంటిచూపు సరిగా లేదు. దీంతో తమ కుమారుడికి చికిత్స చేయించాలని తల్లిదండ్రులు భావించారు. ఈ నెల 20న పంజాగుట్టలోని అగర్వాల్ కంటి ఆస్పత్రిలో చేర్పించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు... రెండు కళ్లలోనూ పొరలున్నాయని, వాటిని తొలగించేందుకు రెండింటినీ ఒకే సమయంలో సర్జరీ చేయాలని సూచించారు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించడంతో ఈ నెల 21న వైద్యులు సర్జరీకి సిద్ధమయ్యారు. చికిత్స సమయంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియనిస్ట్ మత్తుమందు ఇచ్చాడు. అయితే మోతాదుకు మించి మత్తుమందు ఇవ్వడంతో బాలుడు చికిత్సకు ముందే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. చదవండి: (భార్యలు మోసం చేయడంతో సైకోగా మారి 18 హత్యలు) గుట్టుచప్పుడు కాకుండా... ఆపరేషన్ థియేటర్ టేబుల్‌పై అచేతన స్థితిలో పడి ఉన్న బాలుడిని గుట్టుచప్పుడు కాకుండా అగర్వాల్ కంటి ఆస్పత్రి వైద్యులు అంబులెన్సులో సమీప ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తమ వల్ల కాదని, మరో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో అదే ఆస్పత్రి అంబులెన్సులో బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఎలాగైనా తమ బిడ్డను కాపాడాల్సిందిగా తల్లిదండ్రులు ఆ ఆస్పత్రి వైద్యులను వేడుకోవడంతో వారు ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకొని బాలుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. బాలుడు మృతిచెందినట్లు సోమవారం రాత్రి వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఆస్పత్రి వైద్యులు తప్పుడు ఇంజక్షన్ ఇవ్వడం వల్లే తమ బిడ్డ మరణించాడంటూ తల్లిదండ్రులు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు నెలల క్రితం పంజాగుట్ట అగర్వాల్ కంటి ఆస్పత్రిలో వైద్యం వికటించి ఇద్దరికి పూర్తిగా చూపు పోయిన ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజగుట్ట పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రికి తాళం.. వైద్యులు పరార్ బాలుడు మృతి చెందిన విషయం తెలిసి బంధువులు భారీగా ఆస్పత్రికి చేరుకొని వైద్యు లను నిలదీశారు. దీంతో పోలీ సులకు సమాచారం ఇచ్చిన వైద్యులు... ఆ తర్వాత ఆస్పత్రికి తాళం వేసి పరారైనట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మా తప్పేమీ లేదు: అగర్వాల్ కంటి ఆస్పత్రి ‘కొందరు పిల్లలకు మత్తుమందు పడదు. లక్ష మందిలో ఒకరిలో ఇలాంటి రియాక్షన్స్ వెలుగు చూస్తాయి. సర్జరీకి ముందే కార్డియాక్ అరెస్ట్ అయి అపస్మారక స్థితిలోకి చేరుకున్న బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నిం చాం. చికిత్సలో వైద్యుల తప్పిదం లేదు. వయసు, బరువు, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే తగు మోతాదులో మత్తుమందు ఇచ్చాం. అధిక డోసు ఇచ్చామనే ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని మీడియా బులెటిన్‌లో అగర్వాల్ కంటి ఆస్పత్రి పేర్కొంది. -
అరుదైన సర్జరీతో ఇద్దరికి చూపు
చెన్నై అగర్వాల్ నేత్రాలయం వైద్యుల ఘనత సాక్షి, చెన్నై: పీడెక్ అనే అత్యంత అరుదైన నేత్ర శస్త్రచికిత్సను చెన్నైలోని అగర్వాల్ నేత్రాలయం డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. ఇద్దరు వృద్ధులకు కంటిచూపు ప్రసాదించారు. ప్రపంచంలో మొదటిసారిగా ఈ శస్త్రచికిత్స ను నిర్వహించినట్లు డాక్టర్ అమర్ అగర్వాల్ చెప్పారు. రోగి కార్నియాను మార్చకుండా కంటిలోని ఎండోధిలియం పొరను ‘డువా’ అనే అతి సూక్ష్మమైన పొరతో తొలగించే ఈ వినూత్నమైన శస్త్ర చికిత్సనే పీడెక్ అంటారని తెలిపారు. ఏడాది వయసులో మృతిచెందిన బాలుడి కంటిలోని డువా పొరను తొలగించి చెన్నై ఆవడికి చెందిన షణ్ముగం అనే వ్యక్తికి, కోడంబాక్కంకు చెందిన విశాలాక్షికి పీడెక్ సర్జరీ చేసి కంటిచూపు తెప్పించామన్నారు. గత రెండు నెలలలో 16 పీడెక్ చికిత్సలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. వయసుతో పాటు వచ్చే నేత్రలోపాలకు మాత్రమే పీడెక్ విధానం పనికి వస్తుందన్నారు. ఈ శస్త్ర చికిత్సకు 25 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు.