అత్యంత ప్రభావశీలురు మోదీ, కేజ్రీవాల్ | pm narendra modi and kejriwal got placed in time magazine | Sakshi

అత్యంత ప్రభావశీలురు మోదీ, కేజ్రీవాల్

Apr 15 2015 2:17 AM | Updated on Aug 20 2018 3:46 PM

అత్యంత ప్రభావశీలురు మోదీ, కేజ్రీవాల్ - Sakshi

అత్యంత ప్రభావశీలురు మోదీ, కేజ్రీవాల్

ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చోటు లభించింది.

న్యూఢిల్లీ: ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావిత వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చోటు లభించింది. రాజకీయం, వినోదం, తదితర రంగాల్లో ఉత్తమ వ్యక్తులపై టైమ్ మేగజైన్ ‘టైమ్ 100 రీడర్స్ పోల్’ పేరుతో ఆన్‌లైన్ పోలింగ్ నిర్వహించింది. ఇందులో రష్యా అధ్యక్షుడు పుతిన్ 6.9 శాతం ఓట్లతో ఈ ఏడాది జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.

పాప్ సింగర్స్ లేడీ గాగా, రిహానా, టేలర్ స్విఫ్ట్‌లు టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాను యాజమాన్యం అధికారికంగా ఈ వారాంతంలో ప్రకటించనుంది. ఈ జాబితాలో చోటు కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేరు కూడా పోటీ పడినా టాప్ 100లో నిలవలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement