మోడీకి మెక్ కెయిన్, టైమ్ అభినందనలు | US senator John McCain congratulates Modi on electoral success | Sakshi
Sakshi News home page

మోడీకి మెక్ కెయిన్, టైమ్ అభినందనలు

Published Tue, May 20 2014 9:48 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

మోడీకి మెక్ కెయిన్, టైమ్ అభినందనలు - Sakshi

మోడీకి మెక్ కెయిన్, టైమ్ అభినందనలు

లోక్సభ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారంటూ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని అమెరికా సెనేటర్ జాన్ మెక్కెయిన్ అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోడానికి ఆయన తమ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో చాలా శక్తిమంతంగా, స్ఫూర్తినిచ్చేలా జరిగిన ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధించినందుకు నరేంద్ర మోడీకి, బీజేపీకి అభినందనలు అంటూ సందేశం పంపారు.

మోడీతో కలిసి పనిచేసేందుకు తనకు ఎంతో ఆసక్తిగా ఉందని 2004 ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ పడిన మెక్ కెయిన్ అన్నారు. భారత్- అమెరికాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాలో ప్రసిద్ధి చెందిన టైమ్ పత్రిక కూడా మోడీ విజయాన్ని ప్రశంసించింది. అధికార కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకలించి, పార్లమెంటులో ఇంతకుముందెన్నడూ లేనంత అత్యధిక మెజారిటీ సాధించారంటూ మోడీని అభినందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement