
యుద్ధం మొదలైన రోజే కుటుంబంతో సహా తనను బంధించేందుకు, హతమార్చేందుకు రష్యా ప్రయత్నించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని రష్యా దళాలు కీవ్‌లో దిగాయి. మా ఆవిడ, నేను పిల్లలను లేపి విషయం చెప్పాం. అప్పటికే బాంబుల వర్షం మొదలైంది’’ అన్నారు. టైమ్ మేగజైన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. టైమ్ తాజా సంచికలో ఆయనపై కవర్‌స్టోరీ కథనం ప్రచురించింది.