టైమ్ జాబితాలో సచిన్, షారుక్ లకు చోటు!
న్యూయార్క్: విశ్వవ్యాప్తంగా ఇంటర్నెట్ లో అమితంగా అభిమానించే 100 మందిలో భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు చోటు లభించింది.
టైమ్ మ్యాగజైన్ రూపొందించిన జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కు ప్రథమ స్థానం లభించగా, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రెండవస్థానం, పాప్ సింగర్ మడోన్నాకు మూడవస్థానం దక్కింది.
భారత దేశానికి చెందిన సచిన్ టెండూల్కర్ కు 68 స్థానంలో, షారుక్ ఖాన్ 99 స్థానంలో నిలిచారు. హిల్లరీ క్లింటన్ 11వ, వ్లాదిమిర్ పుతిన్ 27 స్థానంలో నిలిచారు. ఆన్ లైన్ లో సెలబ్రీటిలు, గ్లోబల్ లీడర్ల వెబ్ సైట్లు, వికీ పేజిల ఆధారంగా టెమ్ 100 మంది జాబితాను రూపొందించారు.