
రాష్ట్రపతి అభ్యర్థిగా పరిశీలనలో సదాశివం
సాక్షి ప్రతినిధి, చెన్నై: త్వరలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీపై అనేక పేర్లు వినిపిస్తుండగా కేరళ గవర్నర్ సదాశివం పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన సదాశివం గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీల అధినేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్న సదాశివంను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం ఉందని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది.