హైదరాబాద్ చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్
హైదరాబాద్ : ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రచారం నిమిత్తం నగరానికి చేరుకున్న ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నేతలతో పాటు, ఉప ముఖ్య మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, లోక్ సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి తదితరులు కోవింద్‌కు ఘనస్వాగతం పలికారు.
కోవింద్ నేరుగా విమానాశ్రయం నుంచి బేగంపేటలోని హరిత టూరిజం ప్లాజాకు చేరుకుని బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. అనంతరం 10.45 వరకు టీడీపీ ఎమ్మెల్యేలతో కోవింద్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పార్క్ హయత్ హోటల్‌కు చేరుకుని 11.15 గంటల నుంచి 12 గంటల వరకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఏపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు.