
మీరాకుమార్‌కు టీపీసీసీ నేతల శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: విప క్షాల తరఫున రాష్ట్ర పతి అభ్యర్థిగా ఎన్ని కల బరిలో నిలిచిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్‌కు టీపీసీసీ నేతలు శుభా కాంక్షలు తెలిపారు.
మంగళవారమిక్కడ ఆమె నివాసంలో కలిసి ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. మీరాకుమార్‌ను కలిసిన వారిలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.