ఫేస్బుక్లో జిందాల్ హవా | Bobby Jindal is one of most talked about candidate on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో జిందాల్ హవా

Published Fri, Aug 7 2015 10:16 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఫేస్బుక్లో జిందాల్ హవా - Sakshi

ఫేస్బుక్లో జిందాల్ హవా

అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న బాబీ జిందాల్ ఇప్పుడు ఫేస్బుక్లో హవా సృష్టిస్తున్నారు. జిందాల్కు ఫేస్బుక్లో 21 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, 49 లక్షల మంది ఆయనతో సంభాషణలు జరుపుతున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులలో ఎక్కువగా చర్చలో ఉన్న వారిలో పదో వ్యక్తిగా బాబీ జిందాల్ నిలిచారు. ఆయనతో పాటు టెక్సాస్ మాజీ గవర్నర్ రికీ పెర్రీ కూడా ఈ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. అయితే వీళ్లిద్దరినీ ఫాక్స్ న్యూస్ తమ రిపబ్లికన్ ప్రైమరీ డిబేట్కు పిలవలేదు.

కానీ బాబీ జిందాల్, పెర్రీ ఇద్దరూ మాత్రం గురువారం రాత్రి జరిగిన హేపీ అవర్ డిబేట్లో పాల్గొన్నారు. పెర్రీకి 24 లక్షల మంది ఫాలోవర్లుండగా 73 లక్షల మంది ఆయనతో సంభాషణలు జరుపుతున్నారు. అందరికంటే అగ్రస్థానంలో బిజినెస్ టైకూన్ డోనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయనకు 2.62 కోట్ల మంది ఫాలోవర్లుండగా 13.56 కోట్ల మంది సంభాషణలు జరుపుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement