సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము(64) రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ నామినేషన్ పత్రాలను అందజేశారామె. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు.
కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు ద్రౌపది ముర్ము దాఖలు చేశారు. అంతకుముందు ఆమె పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. ద్రౌపది వెంట.. బీజేపీతో పాటు మద్ధతు ప్రకటించిన పార్టీల ప్రతినిధులు సైతం ఉన్నారు.
ఒడిషాకు చెందిన ముర్ముకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం.. రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. బీజేపీ-బీజేపీ కూటమి ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా పని చేశారు. 2007లో బెస్ట్ ఎమ్మెల్యేగా ఒడిషా అసెంబ్లీ నుంచి నీలకంఠ్ అవార్డు అందుకున్నారామె. జార్ఖండ్‌కు తొలి గిరిజన మహిళా గవర్నర్‌గానూ పని చేశారు.
#WATCH NDA's Presidential candidate Droupadi Murmu files her nomination today in the presence of PM Modi, Union cabinet ministers & CMs of BJP & NDA-ruled states pic.twitter.com/ennt3naoCB
— ANI (@ANI) June 24, 2022
Comments
Please login to add a commentAdd a comment