
వాషింగ్టన్: డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వం కోరుతున్న టిమ్ రియాన్ (46) తన ఎన్నికల నిధుల కోసం సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఎన్నికల నిధులను సమకూర్చుకునేందుకు, అమెరికాలోని ముందస్తు ఆరోగ్య పరిరక్షణ విధానానికి ప్రజల మద్దతును కూడగట్టేందుకు యోగాను ఉపయోగించుకోనున్నారు. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న వారు సుమారు 24 మంది ఉన్నారు. యోగా శిక్షణ శిబిరంలో పాల్గొని తనతో యోగా చేసేందుకు ఒక్కొక్కరూ మూడు డాలర్లను విరాళంగా ఇవ్వాల్సిందిగా టిమ్ రియాన్ ప్రజల్ని కోరుతున్నారు. యోగా శిక్షణ శిబిరానికి విరాళాలు ఇచ్చిన వారిలో కొంతమందిని డ్రా ద్వారా ఎంపిక చేసి వారికి న్యూయార్క్ ట్రిప్పును కల్పిస్తామని..టిమ్ రియాన్ ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment