ఆ హీరోకి అక్కగా..!
ఇండియన్ క్రికెటర్ ఎం.ఎస్. ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ చిత్రంలో ధోని అక్క పాత్రలో నటించారు అందాల భామ భూమిక. తాజాగా మరోసారి సిస్టర్ రోల్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ఇంతకీ ఎవరికి అక్కగా నటించనున్నారంటే.. హీరో నానీకి. వెంట వెంటనే అక్క పాత్రలు అంటే ఎవరైనా ఒప్పుకోరేమో? కానీ, నాని చిత్రంలో అక్క పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో ఆమె ఒప్పుకున్నారని టాక్.
వేణు శ్రీరాం దర్శకత్వంలో ‘దిల్’ రాజు సంస్థలో నాని ఓ సినిమా చేయనున్నారు. ఈ మూవీలోనే భూమిక అక్క పాత్రలో కనిపించనున్నారట. మంచి నిర్మాణ సంస్థ, పైగా దర్శకుడు కథ చెప్పిన విధానం భూమికకు నచ్చడంతోనే వెంటనే ఓకే చెప్పారని సమాచారం.