Earn Salary 9 Lakhs To Work Only 14 Days, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

Job Alert: 14 రోజులు వర్క్‌ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! రోజుకు 59 వేల రూపాయలు..

Published Fri, Nov 26 2021 3:46 PM | Last Updated on Fri, Nov 26 2021 4:08 PM

Earn Salary 9 Lakhs To Work Only 14 Days, Details Inside In Telugu - Sakshi

కేవలం 14 రోజులు వర్క్‌ చేస్తే 9 లక్షల రూపాయలా..! ఫేక్‌ నోటిఫికేషన్‌ అని కొట్టిపారేస్తారేమో.. నిజమండీ! ఈ విధమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయీ జిందగీలో. ఉద్యోగవివరాలు ఇవే..

యూకే లోని ఎడిన్‌బర్గ్‌లో ఈ రకమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఒకటి తాజాగా విడుదలైంది. డిసెంబర్‌ 22 నుంచి జనవరి 5 వరకు మొత్తం 14 రోజుల ఉద్యోగావకాశం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏమిటంత ముఖ్యమైన జాబ్‌ అనే కదా అనుకుంటున్నారు..!

చదవండిఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ..

ఓ సంపన్న కుటుంబం క్రిస్టమస్‌ సెలవుల్లో పిల్లల్ని చూసుకోవడానికిగాను ఈ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది. ఐదేళ్ల కవల పిల్లల సంరక్షణకుగాను రోజుకు అక్షరాల 59 వేల రూపాయల జీతం చొప్పున.. మొత్తం 14 రోజులకు 9 లక్షల రూపాయల జీతం ప్రకటించింది సదరు కుటుంబం. క్రిస్టమస్‌ టైంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఫుడ్‌, బెడ్‌ అన్నీ అక్కడే. ఈ ఉద్యోగాంలో చేరిన ఆయా.. పిల్లలకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం, వారితో ఆటలాడటం, నిద్ర పుచ్చడం.. వంటి పనులు చేయాలి. అంతేకాదు దరఖాస్తు దారులకు ఖచ్చితంగా పిల్లల సంరక్షణలో ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. వింతగా అనిపించినా.. పిల్లల సంరక్షణకు ఆ తల్లీదండ్రులు ఎంత కేర్‌ తీసుకుంటున్నారో కదా!

చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్‌ వెనుక అసలు కారణం ఏమిటీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement