Christmas holidays
-
టూరు.. భలే జోరు..
నగరంలో సగటు వ్యక్తి సమయం ఉద్యోగం, వ్యాపారం, ట్రాఫిక్ తంటాలతోనే సగం గడిచిపోతోంది. డిసెంబర్ వచ్చిందంటే ఉద్యోగులకు సెలవులకు ముగిరిపోయే సమయం ఆసన్నమైందని లెక్కలేసుకుంటారు. మరో వైపు క్రిస్మస్ సెలవులు.. దీంతో సెలవుల్లో ఎలా ఎంజాయ్ చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎత్తయిన కొండల్లో దాగిన సరస్సులు, భూమికి పచ్చని చీరకట్టినట్లుండే టీ, కాఫీ ఎస్టేట్లు, భూతల స్వర్గంలా పొగమంచు కమ్మిన ప్రాంతాలవైపు ఆకర్షితులవుతున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు హిల్ స్టేషన్స్ తమ డెస్టినేషన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాలకూ డిమాండ్ ఉందని టూర్ ఆపరేటర్లు పేర్కొంటున్నారు. 5 రోజుల నుంచి వారం రోజుల పాటు సాగే టూర్ రూ.8 వేల నుంచి రూ.15 వేల వరకూ ఛార్జ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు శీతాకాలంలో దట్టమైన పొగ మంచు, పచ్చని చెట్ల మధ్య సాగే ప్రయాణం.. రహదారులు, గుహల్లోంచి దూసుకుపోయే అద్దాల రైలు ప్రయాణం, రంగురంగుల పూల తోటలు, టీ, కాఫీ ఎస్టేట్స్, వంజంగి కొండపై నుంచి కనిపించే పొగ మంచు పొరలు కన్నులకు విందుగా అనిపిస్తుంది. దేశంలోనే అతి పెద్ద గుహలలో ఒకటైన బొర్రా గుహలు ఇక్కడ చూడొచ్చు. సుమారు 80 మీటర్ల లోతు గుహలో దిగొచ్చు. విశాఖపట్నంలో కైలాసగిరి, ఆర్కే బీచ్, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం, విజయవాడ దుర్గాదేవి దర్శనం చేసుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మండువేసవిలో దట్టమైన మేఘాలు.. ప్రిన్సెస్ ఆఫ్ ది హిల్‌గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్ తమిళనాడులోనే ఉంది. దట్టమైన అడవులు, ఎత్తయిన పర్వతాల నడుమ సాగే ప్రయాణం, సరస్సులు, జలపాతాలు, పిల్లర్ రాక్, బ్రయంట్ పార్క్ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ పర్వతాలపై మండే వేసవిలో సైతం దట్టమైన మేఘాలు మనల్ని కమ్మేస్తాయి. కొడైకెనాల్ల్లో ప్రయాణం చేస్తుంటే.. మేఘాల్లో తేలిన ఫీల్ ఉంటుంది. శీతాకాలంలో అయితే మంచు దుప్పటి కప్పేస్తుంది. ముచ్చటగొలిపే మున్నార్.. కేరళలోని మున్నార్ అంటే మూడు నదులు అని అర్థం. ప్రసిద్ధ ఎరవికులం జాతీయ పార్క్ మున్నార్ సమీపంలోనే ఉంటుంది. టీ ఎస్టేట్స్, మట్టుపెట్టి డ్యాం, ఆహ్లాదరకమైన గ్రీనరీ, ఎత్తయిన కొండలు చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం నచ్చుతుంది. కేరళలోని మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం వయనాడ్. పడమర కనుమలు, వివిధ రకాల పక్షలు, జంతువులు, కొండల మధ్య ప్రయాణం ఆకట్టుకుంటుంది. చెంబ్రా, బాణాసుర సాగర్ డ్యాం పర్యాటకులకు డెస్టినేషన్‌గా నిలుస్తాయి. కూర్గ్‌లో ట్రెక్కింగ్.. కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ట్రెక్కింగ్ చేయాలనుకునే వారికి ఇది అనువైన ప్రదేశం. కనుచూపు మేరలో ఎటు చూసినా కాఫీ, మిరియాలు, యాలుకల తోటలతో సుమనోహరంగా ఉంటుంది. వైల్డ్ లైఫ్, అబ్బే జలపాతం, నగర్‌హోళె నేషనల్ పార్క్‌లు చూడదగ్గ ప్రదేశాలు. అదే సమయంలో నంది హిల్స్‌పై నుంచి సూర్యోదయం చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. బెంగళూరు సమీపంలోని ఈ కొండల్లో భోగనందీశ్వరాలయం ఉంటుంది. నంది కోట ప్రధాన ఆకర్షణ.క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్.. తమిళనాడులోని ఊటీని క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్‌గా పిలుస్తారు. స్థానికంగా ఉండే బొటానికల్ గార్డెన్, నీలగిరి కొండలు, పర్వతాల మధ్య సరస్సులు, పచ్చని తోటలు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఊటీని కొత్త జంటలు హనీమూన్ డెస్టినేషన్‌గా పిలుచుకుంటారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2,240 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఊటీకి సమీపంలోనే కూనూర్ ఉంటుంది. ఇక్కడ డాలి్ఫన్ నోస్, ల్యాంబ్స్ రాక్, టీ ఎస్టేట్స్ చూడొచ్చు. ఐదు రోజుల ప్రయాణం అద్భుతం.. ఈ సీజన్లో హిల్ స్టేషన్స్ చూడటానికి బాగుంటాయని ఫ్రెండ్స్ టూర్ ప్లాన్ చేద్దామని అడిగారు. కొడైకెనాల్ డెస్టినేషన్. మధ్యలో కొన్ని దేవాలయాలు, ఇతర ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వెళ్లి రావడానికి 5 రోజులు పట్టింది. కొడైకెనాల్ ప్రయాణం మేఘాల్లో తేలినట్లుంది. మధ్యాహ్నం 12 అయినా అక్కడ రెండు మీటర్ల దూరంలో ఉన్న మనిషి కనిపించే పరిస్థితి లేదు. ఈ టూర్ మంచి అనుభూతినిచ్చింది. – సాయి హర్ష, మణికొండఆహ్లాదం.. ఆధ్యాత్మికం రెండూ..ఈ సీజన్లో వెకేషన్,ఆధ్యాత్మికం కలిపి మిక్సడ్ టూర్ ప్లాన్స్ ఉంటున్నాయి. గోవా, రామేశ్వరం, ఊటి, కొడైకెనాల్, పాండిచ్చేరి, మున్నార్, మదురై, అరుణాచలం, శభరిమలై వంటి ప్రదేశాలకు ఎక్కువ మంది ప్యాకేజీలు అడుగుతున్నారు. కొన్ని కుటుంబాలు వాహనం మాట్లాడుకుంటున్నారు. – భాస్కర్‌రెడ్డి, శ్రీసాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ -
మళ్లీ లాక్డౌన్! నేటి నుంచి జనవరి 14 వరకు కఠిన ఆంక్షలతో..
Netherlands going into lockdown again amid Omicron అమ్‌స్టర్‌డామ్: నెదర్లాండ్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నందున ఉధృతికి అడ్డుకట్ట వేయాలనే ఉద్ధేశ్యంతో డచ్ ప్రభుత్వం శనివారం లాక్‌డౌన్‌ను విధించింది. ఈ మేరకు హేగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాన మంత్రి మార్క్ రుట్టే ప్రకటించారు. ఈ నిర్ణయంతో నెదర్లాండ్స్ మరొకమారు లాక్డౌన్లోకి వెళ్తుంది. ‘ఊహించిన దానికంటే ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తోంది. అందువల్లనే లాక్డౌన్ తప్పనిసరైంది. కొత్త లాక్డౌన్ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి అమల్లోకొస్తుంది. కఠిన నిబంధనలతో ఈ లాక్‌డైన్ కొత్త సంవత్సరం జనవరి 14 వరకు అమల్లో ఉంటుంది. ఐదో వేవ్ చేరువ అవుతున్న తరుణంలో లాక్‌డైన్ అనివార్యమైంద'ని రుట్టే తెలిపారు. సూపర్ మార్కెట్లు, వైద్యపరమైన వృత్తులు, కార్ గ్యారేజీలు వంటి ఇతర ముఖ్యమైన షాపులు తప్ప, మిగతా ఇతర షాపులు, అన్ని విద్యా సంస్థలు, క్యాటరింగ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్లు, మ్యూజియంలు, థియేటర్లు, జూపార్కులు తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించింది. శుక్ర, శని వారాల్లో దాదాపుగా 14,742 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, ఓఎమ్టీ సభ్యుడు జాప్ వాన్ డిసెల్ మీడియాకు తెలిపాడు. అంతేకాకుండా క్రిస్మస్ తర్వాత నెదర్లాండ్స్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. కాగా డిసెంబర్ 14న నెదర్లాండ్స్‌లో కొన్ని ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే! తాజాగా వాటిని పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అప్రధాన షాపులకు నైట్లాక్డౌన్ అంటే సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించారు. అంతేకాకుండా క్రిస్టమస్ సెలవులకు ఒక వారం ముందునుంచే పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని ఆదేశించారు. ఐతే ఒమిక్రాన్ అడ్డుకోవాలంటే ఈ ఆంక్షలు సరిపోవని భావించిన డచ్ ప్రభుత్వం ఈ ప్రకటన జారీ చేసిన నాలుగు రోజులకే తాజాగా సంపూర్ణ లాక్డౌన్ నిర్ణయం తీసుకుంది. చదవండి: 18 యేళ్లకే స్వయంకృషితో సొంత కంపెనీ.. నెలకు లక్షల్లో లాభం!! -
Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే..
కేవలం 14 రోజులు వర్క్ చేస్తే 9 లక్షల రూపాయలా..! ఫేక్ నోటిఫికేషన్ అని కొట్టిపారేస్తారేమో.. నిజమండీ! ఈ విధమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయీ జిందగీలో. ఉద్యోగవివరాలు ఇవే.. యూకే లోని ఎడిన్బర్గ్లో ఈ రకమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి తాజాగా విడుదలైంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 5 వరకు మొత్తం 14 రోజుల ఉద్యోగావకాశం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఏమిటంత ముఖ్యమైన జాబ్ అనే కదా అనుకుంటున్నారు..! చదవండి: ఈ రెండు చిత్రాల్లో మార్పులు కనిపెట్టారా? మళ్లీ ఓ పాలి.. లుక్కెయ్యండి.. సామీ.. ఓ సంపన్న కుటుంబం క్రిస్టమస్ సెలవుల్లో పిల్లల్ని చూసుకోవడానికిగాను ఈ ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతోంది. ఐదేళ్ల కవల పిల్లల సంరక్షణకుగాను రోజుకు అక్షరాల 59 వేల రూపాయల జీతం చొప్పున.. మొత్తం 14 రోజులకు 9 లక్షల రూపాయల జీతం ప్రకటించింది సదరు కుటుంబం. క్రిస్టమస్ టైంలో పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఫుడ్, బెడ్ అన్నీ అక్కడే. ఈ ఉద్యోగాంలో చేరిన ఆయా.. పిల్లలకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం, వారితో ఆటలాడటం, నిద్ర పుచ్చడం.. వంటి పనులు చేయాలి. అంతేకాదు దరఖాస్తు దారులకు ఖచ్చితంగా పిల్లల సంరక్షణలో ఐదేళ్ల అనుభవం కూడా ఉండాలి. వింతగా అనిపించినా.. పిల్లల సంరక్షణకు ఆ తల్లీదండ్రులు ఎంత కేర్ తీసుకుంటున్నారో కదా! చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? -
24 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు
హైదరాబాద్: రాష్ట్రంలోని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఈనెల 24 నుంచి 28వరకు క్రిస్మస్ సెలవులుగా తెలంగాణ విద్యాశాఖ సోమవారం ప్రకటించింది. 2017 జనవరి 11వ తేదీ నుంచి 15 వరకూ సంక్రాంతి సెలవులు ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. -
ఆశే వారి శ్వాస
చుట్టూ ఎటు చూసినా పచ్చని పొలాలు.. జీడిమామిడి తోటలు.. పక్కనే గలగల పారే వంశధార. చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే ఆ గ్రామ ప్రజల మనస్సుల్లో మాత్రం గుండెలు పిండేసే వ్యథ గూడుకట్టుకుంది. గ్రామ భూములను సస్యశ్యామలం చేయాల్సిన వంశధార ఏటా వరదల రూపంలో దాడి చేస్తూ గ్రామానికిప్రపంచంతో సంబంధాలను తుంచేస్తోంది. ఇసుక మేటల రూపంలో సారవంతమైన భూములను బీళ్లుగా మార్చేస్తోంది. విలువైన పంట భూములు రెల్లు తుప్పలుగా మారిపోయాయి. 2006 నుంచి ఏటా ఇదే చేదు అనుభవం. ఆ ఏడాది వరదలకు వరదగట్టుకు సుమారు 400 మీటర్ల గండి పడి గ్రామ స్వరూపాన్నే మార్చేసింది. ప్రజల జీవనాన్ని దుర్భరం చేసింది. ప్రతి ఏటా వరదల సమయంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎందరో వస్తున్నారు.. ఏవేవో హామీలు ఇస్తున్నారు.. వెళుతున్నారు.. అంతే.. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ మామూలే. అయినా ఆ గ్రామస్తులు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఆశపడుతున్నారు. దాన్నే శ్వాసగా చేసుకొని కాలం వెళ్లదీస్తున్నారు. జిల్లాకు శివారున, ఒడిశా సరిహద్దుకు ఆనుకొని ఉన్న ఆ బాధాతప్త పెనుగొటివాడ గ్రామాన్ని పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సందర్శించారు. ప్రజాప్రతినిధిగా కాకుండా ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామంలోకి అడుగుపెట్టి వంశధార సృష్టించిన విలయాన్ని.. స్థానికుల కన్నీటి గాథలను స్వయంగా చూశారు.. విన్నారు.. రెండేళ్లలో సమస్యకు పరిష్కారం చూపిస్తానని భరోసా ఇచ్చిన ఆయన గ్రామస్తులతో జరిపిన మాటామంతీ యథాతథంగా.. కలమట: నువ్వు రైతువేనా? పంటలు ఎలా పండుతున్నాయి? కె.మృత్యుంజయ(రైతు): నేను రైతునే బాబు ఒకప్పుడు. మా పంట పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. ఇంక పంటలేమి పండుతాయి. అన్నీ రెల్లి తుప్పలు వేశాయి. మా బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, నాయకులు వచ్చి చూసెల్లిపోతున్నారు. కలమట: ఇసుక మేటలు ఎంత మేర వేశాయి. వాటిని ఎలా తొలగించాలనుకుంటున్నారు? కె.జమ్మినాయుడు(రైతు): ఇసుక మేటలు 2006 నుంచి ఉన్నాయి. వీటిని తొలగించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి సహాయం ఇవ్వలేదు. ఇప్పుడైనా పంట పొలాల్లో ఉన్న ఇసుక మేటలను తొలగించుకునేందుకు సాయం చేయమని కోరుతున్నాం. కలమట: ఎంత విస్తీర్ణంలో మేటలు వేసి ఉంటాయి. ఇంకా మిగిలి ఉన్న భూములు ఏమైనా ఉన్నాయా? జి.ఆనందరావు: పెనుగొటివాడ, మాతల రెవెన్యూ గ్రామాల్లో సుమారు 1250 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. మిగిలిన పొలాలు వరద నీటిలోనే ఉంటాయి. చిన్న చినుకు పడితే మునిగిపోతాయి. మేటలు తొలగించడంతో పాటు వంశధార నదికి కరకట్టలు కట్టేందుకు ఎమ్మెల్యేగా మీరే చర్యలు తీసుకోవాలి. కలమట: గతంలో అధికారులు గ్రామానికి వచ్చారా.. ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు? రేగేటి మురళి: వరదలు వచ్చినప్పుడే జిల్లా కలెక్టర్‌తో పాటు ఎంతో మంది అధికారులు మా గ్రామాలకు వస్తున్నారు. ఆప్పుడు ఎన్నో మాటలు చెపుతున్నారు. అందులో ఒక్కటీ అమలు కాలేదు. మాది సుమారు 35 ఎకరాల భూమి. వరదనీరు, ఇసుక మేటల కారణంగా పంటలు పండటంలేదు. వృద్ధురాలితో... కలమట: అమ్మా బాగున్నావా.. ఆరోగ్యం బాగుందా. వరదలు వచ్చినప్పుడు ఎలా అనిపిస్తుంది? గవర వరలక్ష్మి: ఎం బాగు నాయనా.. మా ఊరికి ఒక ఆటో కూడా రాదు. ఎవరికైనా బాగులేనప్పుడు మంచానికి కట్టి మోసుకెళతారు. వరదలు వచ్చినప్పుడు ఊరి చుట్టు నీరే ఉంటుంది. భయం భయంగా బతుకుతున్నాం. 8 సంవత్సరాలుగా ఇదే తీరు నాయనా.. మీరైనా పట్టించుకోండి. కలమట: మీ పిల్లలు ఏమి చేస్తున్నారు. ఆరోగ్యం బాగుందా? నూలు అంకమ్మ: మా ఊరికి వరదలని, చేసేందుకు పనుల్లేక పోవడంతో పిల్లలు వలస వెళ్లిపోతున్నారు. ముసలోల్లమే ఊరు పట్టుకుని ఉన్నాం. ఆరోగ్యం అంతంత మాత్రమే. ఏదో నాయనా నువ్వు వచ్చి మా కట్టాలు అడిగావయ్యా.. సంతోసంగా ఉంది. పింఛను లబ్ధిదారులతో.. కలమట: ప్రతి నెల పింఛను డబ్బులు వస్తున్నాయా.. ఎంత ఇస్తున్నారు? బొంతల సూర్యకాంతం: ప్రతి నెల డబ్బులు వత్తన్నాయి. నెలకు రూ.వెయ్యి ఇత్తన్నారు బాబు. మా పొలాలే పండకుండా పోతున్నాయి. మీరైనా మంచి చేయండి. జడగ గణపతి(వికలాంగుడు): ఎమ్మెల్యే బాబూ.. నాకు ప్రతి నెల రూ.200 పింఛను అందేది. నాకు కాలు వంకర పోయింది. అది తక్కువగా ఉందని పింఛను ఆపేశారు. దాంతో పూట గడవడం కట్టంగా ఉందయ్యా. మీరైనా పింఛను వచ్చేలా చేయండయ్యా.. కలమట: జిల్లా కలెక్టర్లు, అనేక మంది అధికారులు మీ ఊరు వచ్చి సమస్యలు విని వెళ్లారు. ఊరు బాగు కోసం ఏం చేస్తే బాగుంటుందని మీరనుకుంటున్నారు? ఇతర గ్రామస్తులతో.. కందుకూరి పాపారావు: ఆయ్యా నేను విశ్రాంత ఉపాధ్యాయుడ్ని. వరదల కారణంగా ఇసుక మేటలు వేయడంతో ప్రస్తుతం మా పొలం ఎక్కడుందో కూడా తెలియదు. తుప్పలు ఉండటంతో అడవి పందులు, విష పురుగులు చేరాయి. అటువైపు వెళ్లలేని దుస్థితి. పంట భూములకు పరిహారం ఇచ్చి మా గ్రామానికి పునరావాస ప్యాకేజీ కల్పిస్తే మేమంతా మరో చోటికి వెళ్లిపోతాం. స్థానిక ఎమ్మెల్యేగా మీరు, ప్రజా సమస్యలపై పోరాడే పత్రికగా ‘సాక్షి’ ఈ విషయంలో మాకు సహాయం చేయాలి. కలమట: ప్రస్తుతం ఏం పనులు చేస్తున్నారు. మీ జీవనం ఎలా సాగుతోంది? కొప్పిశెట్టి సుబ్బారావు: మమ్మల్ని ఉపాధి హామీ పథకం కొంత ఆదుకుంటోంది. వేసవిలో పనులు దొరుకుతున్నాయి. ఇబ్బందులు ఉండటంలేదు. జూన్ నుంచి పనులు ఉండవు. దీంతో పూట గడవటం కష్టంగా ఉంటుంది. మా ఊరికి ఏడాదంతా పనులు ఉండేలా చర్యలు తీసుకోవాలి. కలమట: గ్రామంలో యువకుడువి నువ్వొక్కడివే కనిపించావు. ఏం చేస్తున్నావు? కందుకూరి ఫల్గుణరావు: సార్ నేను ఆటో నడుపుకొని జీవిస్తున్నాను. ఆటో మా ఊరి వరకు రాదు. పక్కనున్న మాతలలో ఆటో ఉంటుంది. అక్కడి నుంచి నివగాం మీదుగా కొత్తూరు వరకు, లేకుంటే పాతపట్నం, పర్లాకిమిడి వరకు నడిపి జీవిస్తున్నారు. మా ఊరి వరకు రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలి. చేనేత కార్మికుడితో.. కలమట: అయ్యా.. నువ్వు నేత కార్మికుడివని విన్నాను. ఇప్పుడు బట్టలు నేస్తున్నావా.. పింఛను వస్తుందా? అలక చంద్రరావు: ఇప్పుడు బట్టలు నేయడంలేదు. ఒకప్పుడు కుటుంబమంతా నేసేవారం. ఇప్పుడంతా కొత్తకొత్త రకాల బట్టలు వచ్చాయి. మాకు పనిలేకుండా పోయింది. ఎవరైనా సరుకు ఇచ్చి నేయమంటే నేస్తాను. నాకు పింఛను వస్తోంది. కలమట: మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి. గ్రామంలో మీరంతా ఎలా జీవిస్తున్నారు? కె.శ్రీరాములు: 2006 తరువాత మా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మా ఊరిలోని ఆడపిల్లలను పెళ్లి చేసుకునేందుకు, మా ఊరికి కోడళ్లుగా వచ్చేందుకు ఎవరు ముందుకు రావడలేదు. మా పిల్లలు ఎక్కడో పట్టణ ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుని పంపించిన డబ్బులతో గ్రామంలో ముసలి వాళ్లమంతా జీవిస్తున్నాం. వంశధార వరదలు మా జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. విద్యార్థులతో.. కటమట: మీరంతా బడికి వెళ్లడం లేదా? పిల్లలు: వెళ్తున్నాం. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చారు. కలమట: మీ బడికి టీచర్లు రోజూ వస్తున్నారా..ప్రతి రోజూ తెరుస్తున్నారా? పిల్లలు: మా టీచరు రోజూ వస్తారు. వర్షం పడితే మాత్రం బడికి సెలవే. ఊరి చుట్టూ నీరు వచ్చేస్తుంది. టీచరు ఊరిలోకి రాలేరు. అప్పుడు మా ఊరి వాళ్లు ఎక్కడికీ వెళ్లడం అవ్వదు. -
‘న్యూ ఇయర్’ కోసం షిర్డీ సిద్ధం..
సాక్షి, ముంబై: నూతన సంవత్సరం సందర్భంగా షిర్డీ పుణ్యక్షేత్రానికి లక్షల సంఖ్యలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి రాజేంద్ర జాదవ్ చెప్పారు. ఈ నెల 31వ తేదీన (బుధవారం) 24 గంటలూ బాబా ఆలయాన్ని తెరిచే ఉంచుతామని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు ప్రకటించారు. ఇవి పూర్తికాకముందే నూతన సంవత్సర వేడుకలు వస్తున్నాయి. కొత్త సంవత్సరం రోజున బాబాను దర్శించుకునేందుకు యేటా రాష్ట్రంతోపాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది జనం షిర్డీకి తరలివస్తారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని బాబాను దర్శించుకునేందుకు బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు నిరంతరంగా క్యూ కొనసాగుతూనే ఉంటుందని జాదవ్ చెప్పారు. కేవలం ఆరతి సమయంలో 15 నిమిషాలపాటు క్యూను నిలుపుతారని చెప్పారు. ప్రస్తుతం షర్డీలో విపరీతమైన చలి ఉంది. భక్తులు సాధ్యమైనంత వరకు అతిథి గృహాలు, భవనాల వరండాల్లో బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చలి నుంచి తట్టుకునేందుకు అదనంగా చద్దర్లు, తివాచీలు సమకూర్చారు. తాగునీరు, స్నానాల గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తున్నట్లు జాదవ్ తెలిపారు. రెండు పూటలా భోజనం, ఉదయం అల్పాహారం, టీ, కాఫీ, లడ్డు ప్రసాదం కోసం అదనంగా కూపన్ విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. -
షిర్డీకి పెరిగిన రద్దీ
సాక్షి, ముంబై : ఒకపక్క క్రిస్మస్ సెలవులు మరోపక్క నూతన సంవత్సరం కలసి రావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో భక్తుల రద్దీ అధికమైంది. ఫలితంగా సాయిబాబాను దర్శించుకునేందుకు కనీసం ఎనిమిది నుంచి 10 గంటల సమయం పడుతోంది. బాబా సంస్థాన్‌కు చెందిన భక్తి నివాస్, భక్తిధామ్ తదితర ఖరీదైన గదులతోపాటు పేదల కోసం నిర్మించిన చౌకఅద్దె గదులన్నీ కిటకిటలాడుతున్నాయి. నూతన సంవత్సరం మొదటిరోజు తెల్లవారుజామునే బాబా సమాధిని దర్శించుకోవడానికి వేలాది మంది ఒక రోజు ముందే షిర్డీ పుణ్యక్షేత్రానికి చేరుకుంటారు. తొలిరోజే బాబాను దర్శించుకోవడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయన్నది భక్తుల నమ్మకం. ఈ ఏడు నూతన సంవత్సరం బుధవారం రావడంతో మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు షిర్డీకి చేరుకుంటారు. క్రిస్మస్ సెలవులు కావడంతో షిర్డీలో ఇది వరకే విపరీతమైన రద్దీ ఉంది. చౌకగానే లభించే బాబా సంస్థాన్‌కు చెందిన అద్దె గదులన్నీ నిండిపోయాయని సంస్థాన్ అధికారులు తెలిపారు. షిర్డీలో ఎముకలు కొరికే చలి ఉండగా, తలదాచుకుందామంటే గదులు దొరకడం లేదు. దీంతో భక్తులు చేసేదేంలేక ప్రైవేటు లాడ్జీలను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకుని హోటల్, లాడ్జీల యజమానులు భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్కసారిగా హోటల్ గదుల అద్దెలు నాలుగురెట్లు పెంచేసి జేబులు నింపుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి షిర్డీకి వచ్చే ప్రైవేటు లగ్జరీ బస్సుల యజమానులు కూడా అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్నారు. గుర్రపు బళ్లు మొదలుకుని ఆటోలు, సామానులు మోసే కూలీలు, గదులు చూపించే బ్రోకర్లు సైతం ఇష్టం వచ్చిన రీతిలో వసూలు చేస్తున్నారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో దర్శనం కోసం క్యూలో నిలబడే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిలో దూరప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చి గంటల తరబడి క్యూలో నిలబడడంతో తీవ్రంగా అలసిపోతున్నారు. ముఖ్యంగా వృద్థులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీలు సంస్థాన్‌లో పైరవీలు చేయకుండా నిరోధించడానికి ప్రజాసంబంధాల కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో సామాన్య భక్తుల మాదిరిగానే వీఐపీలు, రాజకీయ నాయకులు, ఇతర రంగాల ప్రముఖులు క్యూలోనే బాబాను దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలాఉండగా భారీగా నిర్మించిన ప్రసాదాలయం కూడా ఎటూ సరిపోవడం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడితే తప్ప భోజనం లభించడం లేదు. ఇదే పరిస్థితి అల్పహారం, టీ, కాఫీ కౌంటర్ల వద్ద కూడా కనిపిస్తోంది. భక్తులను నియంత్రించేందుకు పట్టణవ్యాప్తంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. -
నేటి నుంచి మిషనరీ స్కూళ్లకు సెలవులు
తెలంగాణలో జనవరి ఒకటి వరకూ.. సీమాంధ్రలో క్రిస్మస్ రోజుకే పరిమితం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఈ నెల 22 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ క్రిస్మస్ సెలవులను విద్యా శాఖ ప్రకటించింది. రెండో తేదీన ఈ పాఠశాలలు తిరిగి ప్రారంభమౌతాయి. అయితే తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు సెలవులు వర్తిస్తుండగా.. సీమాంధ్ర జిల్లాల్లో మాత్రం క్రిస్మస్ పండుగ రోజున మాత్రమే సెలవు వర్తిస్తుంది. సమైక్య ఉద్యమం సందర్భంగా సీమాంధ్రలో ఉపాధ్యాయులు సమ్మె చేసినందున స్కూళ్లు పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఆ సెలవు దినాలను సర్దుబాటు చేయడంలో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లో క్రిస్మస్ పండుగ రోజు మినహా మిగిలిన రోజుల్లో మిషనరీ పాఠశాలలు పనిచేసేలా విద్యాశాఖ సర్దుబాటు చేసింది. -
రైళ్లు కిటకిట
=అటు అయ్యప్పస్వాముల సందడి =క్రిస్మస్ సెలవుల హడావుడి =చాంతాడులా వెయిటింగ్ లిస్ట్ =ప్రయాణికుల ఇక్కట్లు రైళ్లకు అప్పుడే పండుగ కళ వచ్చేసింది. ఆదివారంరైళ్లన్నీ కిటకిటలాడాయి. హైదరాబాద్ వైపు వెళ్లే బళ్లన్నీ రద్దీగా ఉన్నాయి. యశ్వంత్‌పూర్, చెన్నయ్, తిరుపతి వెళ్లే ఎక్స్ప్రెస్లదీఅదే దారి. ఇటు క్రిస్మస్ సెలవులకు వెళ్లే వారు..అటు శబరిమల వెళ్లే స్వాముల హ డావిడి ఎక్కువగా కనిపిం చింది. ఇంకా సంక్రాంతి రాకుండానే నిరీక్షణ జాబితా చాంతాడులా పెరిగిపోవటంతో పలువురు ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. విశాఖపట్నం, న్యూస్‌లైన్: రైలు ప్రయాణికులకు ఇది పరీక్ష సమయం. క్రిస్మస్ సెలవులు ప్రారంభం అయిన సందర్భంగా తమ ఊళ్లకు తరలివెళ్లే వారు.. ఈ నెల 26 నుంచి అయ్యప్ప భక్తుల మండల యాత్రలు ముగుస్తుండడంతో శబరిమల చేరుకోవాలనుకునే స్వాములతో ఆదివారం రైళ్లన్నీ కిటకిటలాడాయి. విశాఖ నుంచి బయల్దేరే దాదాపు అన్ని రైళ్లకూ వెయిటింగ్ జాబితా ప్రయాణికులు ఉండిపోయారు. వందలాది మంది ప్రయాణికులు తమతమ ప్రయాణాలను రద్దు చేసుకున్నా మరింత మంది రైల్లో బెర్తులు లభ్యం కావని ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే రైళ్లతో బాటు యశ్వంత్‌పూర్, చెన్నయ్, తిరుపతి వెళ్లే రైళ్లకు భారీ డిమాండ్ ఉంది. ప్రయాణికులను నియంత్రించలేక రైల్వే పోలీసులు అవస్థలు పడ్డారు. గోదావరి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ల జనరల్ బోగీల్లోకి ప్రయాణికులను ఎక్కించేందుకు చెమటలు కక్కారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు తీవ్రంగా శ్రమించి ఆ రైళ్లలో వేలాడే ప్రయాణికులను దించేసి ఇతర రైళ్లలో పంపించారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో 150 మంది, విశాఖలో 80 మంది, గరీబ్థ్ల్రో 300 మంది నిరీక్షణ జాబితాతో ఈ మూడు రైళ్లు కదిలాయి. దురంతో ఎక్స్‌ప్రెస్‌కు 100 మందికి పైగా ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. సంక్రాంతికి నెల రోజుల ముందుగానే రైళ్ల పరిస్థితి ఇలా వుంటే పండుగ సీజన్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రయాణికులు ఆందోళన పడుతున్నారు. గరీబ్థ్‌క్రు 100 దాటితే కష్టమే! గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణానికి 200 వెయిటింగ్ జాబితా ఉన్నా గతంలో టికెట్ కన్ఫర్మ్ అయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. 50 వెయిటింగ్ వచ్చినా రిజర్వ్ అయ్యే ఛాన్స్‌లు తక్కువగా ఉన్నాయి. అప్పట్లో రెండు బోగీలు అదనంగా ఉండేవి. అప్పట్లో ఈ రెండు బోగీలకు చెందిన బెర్తులు అధికారికంగా ఫీడయ్యేవి కావు. దీంతో నిరీక్షణ జాబితాలో వున్న వారందరికీ రైలు బయల్దేరే వేళకు బెర్తులు ఖాయమయ్యేవి. కానీ గత వారంలో ఆ రెండు బోగీల బెర్తులను కంప్యూటర్లో ఫీడ్ చేశారు. దీంతో టికెట్ తీసుకున్నప్పుడే స్టేటస్ మేరకు నమోదవుతోంది. ఎక్కువ వెయిటింగ్ జాబితా టికెట్ కొనుక్కుంటే ఇకపై రైల్లో కష్టాలు పడాల్సిందే కానీ బెర్త్ ఖాయం మాత్రం కాదు.