తెలంగాణలో జనవరి ఒకటి వరకూ..
సీమాంధ్రలో క్రిస్మస్ రోజుకే పరిమితం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు ఈ నెల 22 నుంచి జనవరి ఒకటో తేదీ వరకూ క్రిస్మస్ సెలవులను విద్యా శాఖ ప్రకటించింది. రెండో తేదీన ఈ పాఠశాలలు తిరిగి ప్రారంభమౌతాయి. అయితే తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు సెలవులు వర్తిస్తుండగా.. సీమాంధ్ర జిల్లాల్లో మాత్రం క్రిస్మస్ పండుగ రోజున మాత్రమే సెలవు వర్తిస్తుంది. సమైక్య ఉద్యమం సందర్భంగా సీమాంధ్రలో ఉపాధ్యాయులు సమ్మె చేసినందున స్కూళ్లు పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ఆ సెలవు దినాలను సర్దుబాటు చేయడంలో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లో క్రిస్మస్ పండుగ రోజు మినహా మిగిలిన రోజుల్లో మిషనరీ పాఠశాలలు పనిచేసేలా విద్యాశాఖ సర్దుబాటు చేసింది.