Elon Musk Says Users to Make Money From Their Twitter Accounts - Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? ట్విటర్‌ బంపరాఫర్‌

Published Fri, Apr 14 2023 2:18 PM | Last Updated on Sat, Apr 15 2023 6:39 AM

Twitter users to make money their accounts details - Sakshi

ట్విటర్ సంస్థ ఎలాన్ మాస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత చాలా మార్పులు సంభవించాయి. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, లోగోలో మార్పులు కూడా జరిగాయి. అయితే తాజాగా మస్క్ యూజర్లకు తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాడు.

ఏదైనా ఎక్కువ సమాచారం నుంచి ఎక్కువ నిడివి ఉన్న వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ తో డబ్బు సంపాదించవచ్చని తెలిపారు. దీని కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుందని కూడా వెల్లడించారు. ఈ ఆప్షన్‌ ఇండియాలో ప్రస్తుతానికి అందుబాటులో లేదు, అయితే అమెరికాలో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ ఆప్షన్‌ మరిన్ని దేశాల్లో అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

తమ కంటెంట్‌ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి మొదటి సంవత్సరం ట్విటర్‌ ఏమీ తీసుకోదని మస్క్‌ తెలిపాడు. అంటే సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో గరిష్ఠంగా 70 శాతం వరకు యూజర్లకే వస్తుంది. కానీ ట్విటర్‌ ద్వారా వచ్చిన డబ్బులో నుంచి ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ 30 శాతం యాప్ స్టోర్ ఫీజు వసూలు చేస్తారు. అంతే కాకుండా తమ కంటెంట్ ప్రమోట్ చేసుకునే వెసులుబాటు కూడా సంస్థ కల్పిస్తుంది. 

నిజానికి ట్విటర్‌ ఎక్కువ మంది వినియోగించడానికి మస్క్ వేస్తున్న వ్యూహం అని తెలుస్తోంది. డబ్బు సంపాదించుకునే అవకాశం అని ప్రకటిస్తే తప్పకుండా ఎక్కువమంది దీనిని ఉపయోగించడం మొదలుపెడతారు. అయితే రానున్న రోజుల్లో దీనిపైన ఎలాంటి మార్పులు జరుగుతాయనేది తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement