
జాతీయజెండాకు నిప్పు
బీర్కూర్: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మం డలం అంకోల్ పంచాయతీ పరిధిలోని బస్వాయిపల్లిలో జాతీయజెండాకు అవమానం జరిగింది. స్వాతం త్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం గ్రామాభివృద్ధి కమి టీ అధ్యక్షులు బండారి గంగారాం జాతీయ జెండాను ఎగురవేశారు. సాయంత్రం వెళ్లి చూడగా కర్ర కిందపడి, జాతీయజెండా సగం దగ్ధమై కనిపించింది. సర్పంచ్ దీపిక కిరణ్ గౌడ్ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు జెండాను కిందపడేసి కాల్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు.