నాకు సిగ్గు ఎక్కువే.. కానీ ఆ విషయాల్లో.. | Pooja Hegde Says I have heavy Shame | Sakshi
Sakshi News home page

నాకు సిగ్గు ఎక్కువే.. కానీ ఆ విషయాల్లో..

Published Fri, Jun 15 2018 7:28 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Pooja Hegde Says I have heavy Shame - Sakshi

పూజా హెగ్డే

సాక్షి, సినిమా: పూజా హెగ్డే స్వతహాగా నాకు సిగ్గు ఎక్కువ అని చెబుతోంది. అయితే ఆ విషయానికి వస్తే సిగ్గు, బిడియాలను పూర్తిగా వదిలేస్తానంటోంది. దక్షిణాదికి ఎంట్రీ ఇచ్చి ఆరేళ్లు అయినా ఇప్పటికీ 10 చిత్రాలు మాత్రమే చేసింది పూజ. ఇందుకు పూజ ఇతరులతో మాట్లాడడానికి సిగ్గు పడే స్వభావం ఒక కారణం కావచ్చు అంటోంది. కానీ ఆమె వెండితెరపై అందాలను మాత్రం విచ్చలవిడిగా ఆరబోయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఈత దుస్తుల్లో కూడా ఇరగదీస్తోంది. 

ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అసలు ఏం చెప్పదలచుకుందో చూద్దాం.. ‘నాకు కాస్త సిగ్గు ఎక్కువ. అయితే ఫొటోలకు ఫోజులు ఇవ్వడంలోనూ, మరో విషయంలోనూ సిగ్గు, బిడియాలను పూర్తిగా వదిలేస్తాను. ఆ మరో విషయం ఏమిటంటే నటన అనేది ఓ కళ. అది మనలోని భావాలను వెల్లడించడానికి సహకరిస్తుంది. అందుకే నృత్యం చేయడానికి నా సిగ్గును వదిలేస్తాను. ఎంత కఠినమైన స్టెప్స్‌ అయినా ఆడేస్తాను. నిజం చెప్పాలంటే నాకు సిమాల్లో డాన్స్‌ చేసే అవకాశాలు ఇప్పుడే వస్తున్నాయి. ఇకపై నా చిత్రాల్లో డాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.’ అని చెప్పింది.

పూజా హెగ్డే ముగముడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమై నటుడు జీవాతో రొమాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రం తరువాత కోలీవుడ్‌లో కనిపించకపోయినా టాలీవుడ్‌లో బాగా పాపులర్‌ అయింది. అక్కడ స్టార్‌ హీరోలతో వరుసపెట్టి నటిస్తోంది. ఇటీవల రంగస్థలం సినిమాలో ఐటమ్‌ గర్ల్‌గా నటించి జిగేలు రాణిగా యువత గుండెల్ని కొల్లగొట్టేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement