శివాజీనగర/ముల్కీ: ‘కాంగ్రెస్ అవినీతి వ్యవస్థను కూల్చేశానని నాపై పీకలదాకా కోపం పెంచుకున్నారు. నన్ను నిరంతరం అవమానిస్తున్నారు. నన్ను దూషిస్తూ ఓట్లడుగు తున్నారు. ఇలాంటి అవమాన సంస్కృతిని మీరు అంగీకరిస్తారా? పోలింగ్ కేంద్రంలో మీట నొక్కేటపుడు జై బజరంగ బలీ అని నినదించండి. తద్వారా వారికి బుద్ధి చెప్పండి’ అని కర్ణాటక ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రంలో మూడు బహిరంగ సభల్లో మోదీ ప్రసంగించారు.
ప్రతిచోటా మొదట్లో, చివర్లో జై బజరంగ బలీ అంటూ నినదించారు. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీపై ప్రధాని మండిపడ్డారు. ‘విభజించు, పాలించు సిద్ధాంతమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ రాజకీయం నడుపుతుంది. ప్రపంచదేశాలు భారత్‌ను ఘనంగా కీర్తిస్తుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం విదేశాల్లో పర్యటిస్తూ దేశ ప్రతిష్టను, సైన్యాన్ని అవమానించేలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశాభివృద్ధికి, శాంతియుత వాతావరణానికి ప్రబల శత్రువు కాంగ్రెస్. ఎన్నికల లబ్ధి కోసం దేశ వ్యతిరేకులతోనూ ఒప్పందం చేసుకుంటోంది’’ అంటూ దుయ్యబట్టారు.
ప్రజలే నా రిమోట్‌కంట్రోల్
140 కోట్ల మంది ప్రజలే తన రిమోట్ కంట్రోల్ అని మోదీ అన్నారు. ‘‘కర్ణాటకను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకోవాలని చూస్తోంది. అలాంటి పార్టీని రాష్ట్రం నుంచి తరిమేయండి’’ అని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment