
దహెగాం(సిర్పూర్): దొంగతనం చేసినట్లు నిందమోపడంతో అవమానం భరించలేక కుమురం భీం జిల్లా దహెగాం మండలం రాంపూర్‌కి చెందిన ఏగోలం గణపతిగౌడ్(55) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన మానెపల్లి సత్తయ్య ఇంట్లో ఈ నెల 15న బంగారం చోరీ అయింది. గణపతిగౌడ్‌పై అనుమానముందని చెప్పడంతో పోలీసులు ఠాణాకు పిలిపించి విచారించారు. ఆ తర్వాత మానెపల్లి సత్తయ్య, మానెపల్లి రంగుబాయి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ధనూరి మల్లేశ్‌లు గణపతిగౌడ్‌ను బెదిరించి దుర్బాషలాడారు.
చేయని నేరానికి నిందవేయడంతో మనస్తాపం చెందిన గణపతిగౌడ్ బుధవారంరాత్రి పురుగుల మందు తాగాడు. 108లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఆత్మహత్యకు మానెపల్లి సత్తయ్య, మానెపల్లి రంగక్క, మాజీ ఎంపీటీసీ ధనూరి మల్లేశ్ కారణమని గణపతి తల్లి ఏగోలం లచ్చమ్మగౌడ్ బుధవారంరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పై ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్‌ఐ అఫ్జల్‌ఖాన్ తెలిపారు.