యువతి ఆత్మాహుతి | young girl commit to sucide | Sakshi
Sakshi News home page

యువతి ఆత్మాహుతి

Published Sat, Mar 26 2016 1:51 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

యువతి ఆత్మాహుతి - Sakshi

యువతి ఆత్మాహుతి

అవమానించారని బలవన్మరణం
బొర్రగూడెంలో విషాదం
నిప్పంటించుకొని యువతి బలవన్మరణం
వరుసకు అన్నను చిన్న మాట అడిగి
ఆ తర్వాత అవమానపడ్డానని తనువు చాలించిన వైనం

 బొర్రగూడెం(వర్గల్): నలుగురిలో తనను నిల దీసి అవమానించారని క్షణికావేశంతో ఓ యు వతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని బ లవన్మరణం చెందింది. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని బొర్రగూడెంలో జరిగిం ది. బేగంపేట ఎస్సై అనీల్‌రెడ్డి కథనం ప్రకా రం ఈ విషాదకర ఘటన వివరాలిలా ఉ న్నాయి. బొర్రగూడెం గ్రామానికి చెందిన బొర్ర భీమయ్య, బాలమణి దంపతుల మూ డో కూతురు కవిత(18). ఆమె శుక్రవారం ఉదయం వరుసకు అన్న అయిన నవీన్‌ను కలిసి ‘వేరే ఎవరితోనో తిరుగుతున్నావట నిజమేనా( అని అడిగింది. తనపై చెల్లెలు నిందారోపణ చేసిన విషయం ఆ యువకుడు తన తల్లికి చెప్పాడు.

దీంతో నవీన్ తండ్రి బొర్ర సత్తయ్య, మల్లయ్య, యాదయ్య, ఎల్లవ్వ, హంసవ్వ, మంజులలు ఓ బాలుడితో కవితను పిలిపించుకున్నారు. తమ కొడుకుపై అనవసరంగా ఎందుకు నిందలు మోపుతున్నావని నిలదీసి తిట్టారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కవిత పొలం వద్ద ఉన్న తండ్రి భీమయ్య వద్దకు వెళ్లింది. తాను ఆత్మహత్య చేసుకుంటానని తండ్రికి చెప్పింది. దీంతో తండ్రి ఆ బాలికకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చి వదిలివెళ్లాడు. ఆ తరువాత ఇంట్లో తల్లి బాలమణి దుస్తులు ఉతికే పనిలో నిమగ్నం కాగా, ఇంటి ముందర బాత్రూంకు చేరుకుని కిరోసిన్ పోసుకుని కవిత నిప్పంటించుకుంది.  

పొగలు వస్తున్నట్లు గమనించి అక్కడకు చేరుకోగా అప్పటికే కవిత మంటల్లో పూర్తిగా కాలిపోయి విగతజీవిగా మారింది. ‘అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన తమ కూతురు అ న్నంత పనిచేసి కానరాని తీరాలకు పోయిం ద’ని తల్లిదండ్రులు బోరుమన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకున్నది. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించా రు. మృతురాలి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు బొర్ర మల్లయ్య, సత్తయ్య, యాద య్య, ఎల్లవ్వ, హంసవ్వ, మంజులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement